Bangalore court
-
యడ్యూరప్పపై అరెస్టు వారెంట్
బెంగళూరు: లైంగిక నేరాల నుంచి బాలల పరిరక్షణ చట్టం(పోక్సో) కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్ప(81)పై బెంగళూరు కోర్టు గురువారం నాన్–బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో సీఐడీ ఇప్పటికే ఆయనకు సమన్లు ఇచ్చింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కానీ, యడ్యూరప్ప హాజరు కాకపోవడంతో సీఐడీ బెంగళూరు కోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు నాన్–బెయిలబుల్ అరెస్టు వారెంటు జారీ చేసింది. యడ్యూరప్ప ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారని, తిరిగివచి్చన తర్వాత సీఐడీ ఎదుట హాజరవుతారని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. 17 ఏళ్ల తన కుమార్తెపై యడ్యూరప్ప లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 2న ఓ సమావేశంలో ఆయన తన కుమార్తెను బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి అకృత్యానికి పాల్పడ్డారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో యడ్యూరప్పపై పోక్సో చట్టంతోపాటు ఐసీసీ సెక్షన్ 354 కింద ఈ ఏడాది మార్చి నెలలో బెంగళూరు సదాశివనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం గంటల వ్యవధిలోనే కర్ణాటక డీజీపీ ఈ కేసును సీఐడీకి బదిలీ చేశారు. తనపై వచి్చన ఆరోపణలను యడ్యూరప్ప ఖండించారు. ఈ కేసును చట్టపరంగా ఎదుర్కొంటానని చెప్పారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. యడ్యూరప్పపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ గత నెలలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు అంతకుముందే రికార్డు చేశారు. పోక్సో కేసులో యడ్యూరప్పను సీఐడీ అరెస్టు చేసే అవకాశం ఉందని కర్ణాటక హోంశాఖ మంత్రి పరమేశ్వర చెప్పారు. దీనిపై సీఐడీ తుది నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. -
శశికళ కాన్వాయ్ పై దాడి
-
శశికళ కాన్వాయ్ పై దాడి
బెంగళూరు: అన్నాడీఎంకే నాయకురాలు ఎంకే శశికళ కాన్వాయ్ పై దాడి జరిగింది. కోర్టులో లొంగిపోయేందుకు చెన్నై నుంచి రోడ్డు మార్గంలో శశికళ బుధవారం సాయంత్రం బెంగళూరు కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమె కాన్వాయ్ పై దాడికి పాల్పడ్డారు. వీరిపై లాఠీచార్జి చేసి పోలీసులు చెదరగొట్టారు. దీంతో కోర్టు ప్రాంగణంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పన్నీర్ సెల్వం వర్గీయులే ఈ దాడికి పాల్పడివుంటారని శశికళ మద్దతుదారులు ఆరోపించారు. మరోవైపు కోర్టులో లొంగిపోయిన శశికళ న్యాయమూర్తి ముందు వాంగ్మూలం ఇచ్చారు. ఆమెను పరప్పణ అగ్రహార జైలుకు తరలించాలని జడ్జి ఆదేశించారు. తనను ప్రత్యేక ఖైదీగా గుర్తించాలని ఆమె పెట్టుకున్న అభ్యర్థనను న్యాయమూర్తి తిరస్కరించారు. వైద్య పరీక్షల అనంతరం ఆమెను జైలుకు తరలించారు. తమిళనాడు మరిన్ని అప్డేట్స్ చూడండి.. చిన్నమ్మ చేసిన శపథం ఏంటంటే..! సీఎం కుర్చీ కోసం నువ్వా-నేనా? చీలిక దిశగా అన్నాడీఎంకే! పన్నీర్ వర్సెస్ పళని జయలలితకు మూడుసార్లు మొక్కి.. జయ సమాధి సాక్షిగా శశికళ శపథం శశికళపై తమిళ ప్రజలకు కోపం? శశికళ నన్ను కిడ్నాప్ చేశారు: ఎమ్మెల్యే పళనిస్వామికే మెజార్టీ ఉంది... శశికళ మేనల్లుడికి పెద్ద పోస్టు కనీసం ఇప్పుడైనా...! చిన్నమ్మకు చెరసాల నన్ను ఏ శక్తీ అడ్డుకోలేదు: శశికళ పళనిస్వామే ఎందుకు! తమిళనాడు అసెంబ్లీలో ఎవరి బలమెంత..? -
చిన్నమ్మ చేసిన శపథం ఏంటంటే..!
చెన్నై: బెంగళూరు ప్రత్యేక కోర్టులో లొంగిపోయేముందు శశికళ.. చెన్నై మెరీనా బీచ్‌లో తన నెచ్చెలి జయలలిత సమాధిపై మూడుసార్లు కొట్టి శపథం చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి బెంగళూరుకు బయల్దేరారు. ఈ దృశ్యాలు టీవీల్లో కనిపించడంతో అమ్మ సమాధి సాక్షిగా చిన్నమ్మ ఏ శపథం చేశారన్నది తమిళనాడులో చర్చనీయాంశమైంది. అన్నా డీఎంకే ట్విట్టర్ లో దీనిపై వివరణ ఇచ్చారు. తనకు చేసిన నమ్మకద్రోహానికి, తనపై జరిగిన కుట్రలకు ప్రతీకారం తీర్చుకుంటామని చిన్నమ్మ శపథం చేసినట్టు ట్వీట్లో వెల్లడించారు. కాగా తమిళ వెబ్సైట్లలో శశికళ చేసిన శపథాలపై రకరకాల ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఆ మూడు శపథాలు ఏంటంటే.. శపథం 1: కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటా శపథం 2: నాపై జరిగిన కుట్రకు ప్రతీకారం తీర్చుకుంటా శపథం 3: నమ్మక ద్రోహులకు గుణపాఠం చెబుతా తమిళనాడు మరిన్ని అప్డేట్స్ చూడండి.. చీలిక దిశగా అన్నాడీఎంకే! జయలలితకు మూడుసార్లు మొక్కి.. జయ సమాధి సాక్షిగా శశికళ శపథం శశికళపై తమిళ ప్రజలకు కోపం? శశికళ నన్ను కిడ్నాప్ చేశారు: ఎమ్మెల్యే పళనిస్వామికే మెజార్టీ ఉంది... శశికళకు మరో షాక్ శశికళ మేనల్లుడికి పెద్ద పోస్టు కనీసం ఇప్పుడైనా...! తొలి తేజం! శశికలే చిన్నమ్మకు చెరసాల నన్ను ఏ శక్తీ అడ్డుకోలేదు: శశికళ పళనిస్వామే ఎందుకు! ఇక శశికళ రూటు అదే: గౌతమి తమిళనాడు అసెంబ్లీలో ఎవరి బలమెంత..? -
జయ సమాధి సాక్షిగా శశికళ శపథం
-
జయ సమాధి సాక్షిగా శశికళ శపథం
చెన్నై : అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ...తన నిచ్చెలి జయలలిత సమాధి వద్ద శపథం చేశారు. బెంగళూరు కోర్టులో లొంగిపోయేందుకు బయల్దేరిన ఆమె ముందుగా మెరినా బీచ్‌లోని జయలలిత సమాధి వద్ద నివాళి అర్పించింది. ఈ సందర్భంగా శశికళ ఉద్వేగంతో పాటు ఒకింత ఆగ్రహంగా కూడా కనిపించారు. మూడుసార్లు జయ సమాధిపై మూడుసార్లు చేత్తో కొట్టి శపథం చేశారు. మరోవైపు శశికళ మద్దతుదారులు ఆమెకు అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జయకు నివాళి అర్పించిన అనంతరం శశికళ వాహనంలో బెంగళూరు బయల్దేరారు. రోడ్డు మార్గంలో ఆమె అక్కడకు చేరుకోనున్నారు. కాగా అక్రమాస్తుల కేసులో శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్లు జైలుశిక్ష విధించిన విషయం తెలిసిందే. అయితే తనకు ఆరోగ్యం బాగోలేనందున లొంగిపోయేందుకు నెల రోజుల సమయం కావాలని శశికళ సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఆమెకు చుక్కెదురు అయింది. శశికళ వెంటనే లొంగిపోవల్సిందేనని న్యాయస్థానం బుధవారం స్పష్టం చేసింది. దాంతో శశికళ బెంగళూరు ప్రత్యేక కోర్టులో లొంగిపోనున్నారు. ఈ మేరకు ఆమె సాయంత్రంలోగా కోర్టులో లొంగిపోతారని శశికళ తరఫు న్యాయవాదులు బెంగళూరు కోర్టుకు తెలిపారు. ఇప్పటికే అన్నాడీఎంకే సీనియర్ నేత తంబిదొరై బెంగళూరు చేరుకున్నారు. అంతకు ముందు పోయెస్ గార్డెన్ లో శశికళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమిళనాడు మరిన్ని అప్డేట్స్ చూడండి.. శశికళకు మరో షాక్ శశికళ మేనల్లుడికి పెద్ద పోస్టు కనీసం ఇప్పుడైనా...! తొలి తేజం! శశికలే చిన్నమ్మకు చెరసాల నన్ను ఏ శక్తీ అడ్డుకోలేదు: శశికళ పళనిస్వామే ఎందుకు! ఇక శశికళ రూటు అదే: గౌతమి తమిళనాడు అసెంబ్లీలో ఎవరి బలమెంత..? -
సుప్రీం కోర్టులో ధోనీకి ఊరట
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. మతవిశ్వాసాలను దెబ్బతీశారంటూ ధోనీపై నమోదైన కేసుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. బిజినెస్ టుడే పత్రికలో తన ఫొటోను విష్ణువుగా చిత్రీకరిస్తూ వేసిన కవర్ పేజీ ఫొటో విషయంలో తలెత్తిన వివాదాన్ని ధోనీ సుప్రీం దృష్టికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. గురువారం ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేశాడు. బెంగళూరు కోర్టులో ఈ కేసు విచారణ సాగుతోంది. బెంగళూరు అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో తనపై పెండింగులో ఉన్న క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను రద్దుచేయానలి ధోనీ కోరారు. ఈ కేసు విచారణపై సుప్రీం కోర్టు స్టే విధించింది. -
మార్చిలో ఉప ఎన్నిక
చెన్నై, సాక్షి ప్రతినిధి :రాష్ట్రంలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగడం పెద్ద విషయం కాకున్నా, జయను పదవీచ్యుతురాలిని చేసిన శ్రీరంగం కావడంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరు కోర్టు జయకు నాలుగేళ్లు జైలు శిక్ష, రూ.100 కోట్లు జరిమానా విధించింది. రెండేళ్లకు మించి జైలు శిక్ష పడిన కారణంగా 1951 సెక్షన్ 8 ప్రకారం జయ తన శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయారు. అయితే ఈ విషయాన్ని అసెంబ్లీ కార్యదర్శి అధికారికంగా ప్రకటిస్తే గానీ శ్రీరంగం స్థానం ఖాళీ అయినట్లుగా ఈసీ పరిగణించదు. బెంగళూరు కోర్టు నుంచి జయ శిక్షకు సంబంధించిన నకలు పత్రాలు రావడంలో జాప్యం చోటుచేసుకుంది. శ్రీరంగంలో ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రతిపక్షాలు తహతహలాడుతూ ఈసీపై ఒత్తిడి పెంచాయి. జయలలిత జైలు శిక్ష కోర్టు పత్రాల పరిశీలనను అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్ పూర్తిచేశారు. సాంకేతికంగా నిర్ధారించుకున్న తరువాత ఈనెల 8వ తేదీన శ్రీరంగం స్థానం ఖాళీ అయినట్లు అధికారికంగా ప్రకటించారు. నిర్ధారణ పత్రాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు పంపగా, వారి ద్వారా కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషన్‌కు చేరడం కూడా పూర్తయింది. చర్యలు చేపట్టిన ఈసీ: అసెంబ్లీ స్థానం ఖాళీ అయిన ఆరు నెలల్లోగా ఉప ఎన్నిక జరిపించాలని ఈసీ నిబంధన ఉంది. అయితే రాష్ట్రంలో ఓటర్ల జాబితా పనులు సాగుతున్నాయి. కొత్త ఓటర్ల చేరిక, ఇటీవలే పంపిణీ చేసిన కలర్ గుర్తింపు కార్డుల్లో తప్పుల సవరణ వంటి చర్యల్లో ఈసీ తలమునకలై ఉంది. సవరింపులు పూర్తయి జనవరి 5వ తేదీన ఓటర్ల తుదిజాబితాను ప్రకటించనున్నారు. ఆరునెలల్లోగా ఉప ఎన్నిక అంటే మార్చి 27వ తేదీకి గడువు పూర్తికానుంది. ఓటర్ల తుది జాబితా సిద్ధమైన తరువాతనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేలా ఈసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తమిళులు ఎక్కువగా సంబరాలు జరుపుకునే జనవరి పొంగల్ పండుగ నాటికి ఉప ఎన్నికల కోలాహలంలో శ్రీరంగం మునిగి తేలే అవకాశం ఉంది. ప్రతిపక్షాలకు ప్రతిష్టాత్మకం: సెలబ్రెటీలు వాడి వదిలేసిన వస్తువులకు వచ్చే గిరాకీ, మోజు వంటిదే తిరుచిరాపల్లి జిల్లా శ్రీరంగం అసెంబ్లీ నియోజకవర్గానికి ఏర్పడింది. జయలలితను మాజీ ముఖ్యమంత్రిని చేసిన నియోజకవర్గాన్ని దక్కించుకోవడానికి ప్రతిపక్షాలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అన్నాడీఎంకే సైతం సహజంగానే శ్రీరంగం చేజారిపోకుండా కాపాడుకోవాలన్న పట్టుదలతో ఉంది. ఎన్నికల సమయంలో తమిళనాడు ప్రజలకు ఇచ్చిన హామీలను ముందుకు తీసుకెళ్లడం ద్వారా శ్రీరంగంను ఎగరేసుకుపోవాలని భారతీయ జనతా పార్టీ కూడా సిద్ధమవుతోంది. రాష్ట్రంలో అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిపక్షాలకు విజయం ఆమడదూరంలో ఉండిపోయింది. ఉప ఎన్నిక, పార్లమెంటు ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు అన్నింటా అన్నాడీఎంకేదే విజయకేతనంగా మారిపోయింది. అమ్మధాటికి తట్టుకోలేక నీరసించిపోయిన ప్రతిపక్షాలు వచ్చే ఏడాది మార్చిలో జరుగనున్న ఉప ఎన్నిక ద్వారా ఊపిరి పోసుకోవాలని ఆశపడుతున్నాయి. -
''బెయిల్ వచ్చిందంటూ..."
-
జయలలితకు నో బెయిల్!
బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కు చుక్కెదురైంది. జయలలిత బెయిల్ పిటిషన్ కర్నాటక హైకోర్టు బెయిల్ పిటిషన్ కొట్టేసింది. కోర్టు ఉత్తర్వులు వెల్లడికాకముందే బెయిల్ వచ్చిందంటూ తమిళ మీడియా అత్యుత్సాహ ప్రచారం చేయడంతో దేశవ్యాప్తంగా మీడియా జయలలితకు బెయిల్ వచ్చిందంటూ ప్రసారం చేశాయి. సీబీఐ అధికారి మాటలతో తొందరపడ్డ తమిళ మీడియా కారణంగా జయలలిత బెయిల్ లభించిందంటూ వచ్చిన వార్తలతో తమిళనాట పండగ వాతావరణం నెలకొంది. బెయిల్ రాలేదంటూ ఆ తర్వాత వచ్చిన వార్తలతో అన్నాడీఎంకే మద్దతుదారులు నిరుత్సాహానికి గురయ్యారు. -
జయలలిత విడుదలపై ఉత్కంఠ!
బెంగళూరు: తమిళనాడు మాజీ సీఎం జయలలిత బెయిల్ మంజూరు అయినప్పటికి ఆమె మంగళవారం విడుదల కాకపోవచ్చని కోర్టు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జయలలిత బెయిల్ ఆర్డర్ తయారు కాలేదని తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం 5 గంటల లోపు బెయిల్ కాపీ అందితేనే జయలలిత ఈ రోజు విడుదల అవుతుందని కోర్టు వర్గాలు వెల్లడించాయి. జయలలిత విడుదల కోసం అన్నాడీఎంకే మద్దతుదారులు, కార్యకర్తలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో జయలలిత ఈరోజు విడుదల అవుతుందా లేదా అనే ఉత్కంఠ నెలకొని ఉంది. ఇప్పటికే తమిళనాట జయ అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలారు. -
జయ నివాసం ఎదుట పండగ వాతావరణం!
బెంగళూరు: బెంగళూరు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో తమిళనాడు మాజీ సీఎం జయలలిత నివాసం ఎదుట పండగ వాతావరణం నెలకొంది. జయ అభిమానులు, ఎన్నాడీఎంకే మద్దతు దారులు ఆనందంతో గంతులు వేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే కేసులో సెప్టెంబర్ 27 తేదిన జయలలితకు జైలుశిక్ష విధించింది. జయలలిత కు బెయిల్ మంజూరు చేశారనే వార్త వెలువడగానే తమిళనాట ఏఐఏడీఎంకే మద్దతుదారులు మిఠాయిలు పంచుకుని, ఆనందాన్ని పంచుకున్నారు. -
బెయిల్ కోసం కర్ణాటక హైకోర్టుకు జయలలిత!
చెన్నై:బెంగళూరు నగర శివారులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్న అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత బెయిల్ కోసం సోమవారం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించనున్నారు. అంతే కాకుండా ప్రత్యేక కోర్టు విధించిన శిక్షపై కూడా స్టే విధించాలని ఆమె కోర్టుకు విన్నవించనున్నారు. ఇందుకు సంబంధించి న్యాయపరమైన వ్యూహాలపై జయలలిత తరుపు న్యాయవాదులు చర్చించారు. మంగళవారం బెయిల్ పిటీషన్ విచారణకు వచ్చే అవకాశం ఉందని న్యాయసలహాదారులు పేర్కొన్నారు. మూడేళ్ల కన్నా ఎక్కువకాలం శిక్ష పడితే హైకోర్టు మాత్రమే బెయిల్ ఇవ్వాలని సీనియర్ న్యాయవాది బి.కుమార్ తెలిపారు. ప్రస్తుతం కర్ణాటక హైకోర్టుకు దసరా సెలవులు. -
తమిళనాట విధ్వంసకాండ
-
తమిళనాట విధ్వంసకాండ
రాష్ట్రవ్యాప్తంగా జయ అభిమానుల ఆందోళనలు బస్సుల దహనం, ద్విచక్ర వాహనాల ధ్వంసం డీఎస్పీపైనే పెట్రోలు పోసిన నిరసనకారులు చెన్నై . ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు బెంగళూరు కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించడం తమిళనాట విధ్వంసానికి దారితీసింది. అన్ని జిల్లాల్లోనూ అన్నాడీఎంకే శ్రేణులు, జయలలిత అభిమానులు చెలరేగిపోయారు. కోర్టు తీర్పు కోసం శనివారం ఉదయం నుంచే ప్రజలు, పార్టీ శ్రేణులు ఉత్కంఠతో టీవీలకు అతుక్కుపోయారు. జయను కోర్టు దోషిగా ప్రకటించినట్లు మధ్యాహ్నం వార్తలు వెలువడగానే అమ్మ అభిమానులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. రైల్‌రోకో, రాస్తారోకోలు నిర్వహించారు. చెన్నైలో రోడ్లపై తిరుగుతున్న అనేక బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. కరుణానిధి, స్టాలిన్, అళగిరి, సుబ్రహ్మణ్యస్వామి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆందోళనలతో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు మూతపడ్డాయి. వ్యాపార, వాణిజ్య సముదాయాలను ఆందోళనకారులు బలవంతంగా మూయించారు. ప్రభుత్వ, ప్రైవేటు బస్సు సర్వీసులు సైతం నిలిచిపోయాయి. కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు వచ్చే బస్సులను ముందుజాగ్రత్త చర్యగా నిలిపేశారు. కాంచీపురంలో 8 బస్సులను తగులబెట్టారు. తిరువళ్లూరులో ఆందోళనకారులను అడ్డుకున్న టౌన్ డీఎస్పీ చంద్రశేఖరన్‌పై అల్లరిమూకలు పెట్రోలు పోసి నిప్పంటించే యత్నం చేశాయి. అయితే పోలీసులు, స్థానికులు ఆయన్ను రక్షించారు. జయలలిత ప్రాతినిధ్యం వహిస్తున్న తిరుచ్చిరాపల్లి జిల్లా శ్రీరంగం ఆందోళనలతో అట్టుడికింది. అమ్మ మద్దతుదారులు మధురైలోని కరుణ పెద్దకుమారుడు అళగిరి ఇంటిపైనా, చెన్నైలోని సుబ్రహ్మణ్యస్వామి నివాసంపైనా రాళ్ల వర్షం కురిపించారు. చెన్నై గోపాలపురంలో కమలకన్నన్ అనే అన్నాడీఎంకే కార్యకర్త ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మాహుతికి యత్నించాడు. చెన్నైలోని జయ నివాసం వద్ద మీడియా ప్రతినిధులపై ఆందోళనకారులు దాడులకు పాల్పడి కెమెరాలను ధ్వంసం చేశారు. ఈ ఆందోళనల్లో 20 మంది వరకూ గాయపడ్డారు. రాష్ట్రం మొత్తం మీద వెయ్యి మందికిపైగా అన్నాడీఎంకే కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అమ్మ మద్దతుదారుల ఆందోళనల నేపథ్యంలో రాష్ట్రవాప్తంగా పెద్ద సంఖ్యలో భద్రతా సిబ్బందిని మోహరించారు. మరోవైపు అన్నాడీఎంకే కార్యకర్తల ఆందోళనల నేపథ్యంలో డీఎంకే కార్యాలయాలు, ఆ పార్టీ సీనియర్ నేతలకు అలాగే బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామికి భద్రతను పెంచారు. శాంతిభద్రతలపై గవర్నర్ సమీక్ష తమిళనాడులో తాజా పరిస్థితులపై ఆ రాష్ట్ర గవర్నర్ కె.రోశయ్య శనివారం అత్యవసర సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి జయలలితకు జైలు శిక్ష పడటంతో చెలరేగిన అల్లర్లపై రాజ్‌భవన్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా పరిస్థితిని అధికారులు గవర్నర్‌కు వివరించారు. శాంతిభద్రతలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను గవర్నర్ ఆదేశించారు. -
జయ కేసు: చరిత్ర సృష్టించిన మైఖేల్
జాన్ మైఖేల్ డికున్హా.. నిన్న మొన్నటి వరకు ఈ పేరు ఎవరికీ తెలియదు. కానీ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కేసు పుణ్యమాని ఒక్కసారిగా ఈ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఆయన ఎవరో కాదు.. అక్రమాస్తుల కేసులో జయలలితను దోషిగా నిర్ధారించిన న్యాయమూర్తి ఆయనే. బెంగళూరులోని ప్రత్యేక కోర్టుకు మొదట బాలకృష్ణన్ న్యాయమూర్తిగా ఉండేవారు. అయితే ఆయన కేసు విచారణ పూర్తి కాకముందే పదవీ విరమణ చేశారు. దాంతో ఆ తర్వాత ఆ కోర్టుకు న్యాయమూర్తిగా జాన్ మైఖేల్ నియమితులయ్యారు. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన రెండేళ్లకు విచారణ పూర్తయింది. ఈ కేసులో తీర్పును జయలలిత ముందే ఊహించారో ఏమో గానీ, శనివారం నాడు తీర్పు వెల్లడించకుండా చూడాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయినా సుప్రీం మాత్రం అందుకు నిరాకరించింది. దాంతో శనివారం నాడే జయలలితను దోషిగా నిర్ధరిస్తూ న్యాయమూర్తి జాన్ మైఖేల్ తీర్పు చెప్పారు. -
కేసు ఓడితే.. సీఎం పదవి గోవిందా!
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బెంగళూరుకు బయల్దేరారు. ప్రత్యేక కోర్టులో నేడు వెలువడనున్న తీర్పు వినేందుకు ఆమె చెన్నై నుంచి బెంగళూరు వెళ్లారు. జయలలితతో పాటు ఆమె సన్నిహితురాలు శశికళ కూడా బెంగళూరుకు బయల్దేరారు. ముఖ్యమంత్రిగా ఉండగా ఆమె 66 కోట్ల రూపాయల అక్రమాస్తులు పోగేసుకున్నారంటూ ఎప్పుడో 18 ఏళ్ల క్రితం నమోదైన కేసు విచారణ సుదీర్ఘంగా ఇన్నాళ్ల పాటు సాగింది. ఈ కేసులో తీర్పును వెలువరించకుండా చూడాలంటూ జయలలిత సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. దాంతో బెంగళూరులోని ప్రత్యేక కోర్టు శనివారమే తన తీర్పు ఇవ్వనుంది. ఒకవేళ ఈ కేసులో తీర్పు జయలలితకు వ్యతిరేకంగా వస్తే మాత్రం ఆమె తన ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాల్సి ఉంటుంది. అలా జరిగితే ఎవరిని ముఖ్యమంత్రి చేయాలనే విషయం కూడా ఇప్పటికే చర్చించుకున్నారు. జయలలిత దృష్టిలో ముగ్గురు ఉన్నారని అన్నాడీఎంకే వర్గాల సమాచారం. వారు రాష్ట్ర రవాణా మంత్రి సెంథిల్ బాలాజీ, రెవెన్యూ మంత్రి పన్నీర్ సెల్వం, మాజీ ఐఏఎస్ అధికారిణి షీలా బాలకృష్ణన్. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఇటీవలే రిటైరైన షీలాకు పరిపాలనా అనుభవం ఉంది. ఆమె జయకు అత్యంత నమ్మకస్తురాలు. అందుకే రిటైరైన తర్వాత కూడా ప్రత్యేక సలహాదారుగా ఆమెను నియమించుకున్నారు. -
‘అమ్మ ఆస్తుల’ టెన్షన్
చెన్నై, సాక్షి ప్రతినిధి: సీఎం జయలలిత ఎదుర్కొంటున్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసుపై ఈనెల 27న బెంగళూరు కోర్టులో తీర్పువెలువడనున్న దృష్ట్యా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు రాష్ట్రాలను కలిపే అన్ని రహదారుల్లో గురువారం నుంచే భద్రతను కట్టుదిట్టం చేయడంతోపాటూ ముమ్మర తనిఖీలు ప్రారంభమయ్యూయి. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత 1991-96లో ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టినట్లు బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి అరోపిస్తూ ఆ తరువాత (1996) అధికారంలోకి వచ్చిన డీఎంకే ప్రభుత్వానికి స్వామి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన ఏసీబీ, ఆదాయానికి మించి రూ.66.44 కోట్లను అమ్మ అక్రమంగా ఆర్జించినట్లు అభియోగం మోపింది. ఈ కేసులో జయతోపాటూ ఆమె దత్తపుత్రుడు సుధాకర్, నెచ్చెలి శశికళ, బంధువు ఇళవరసిలను చేర్చారు. చెన్నైలో కొన్నాళ్లు విచారణ జరిగిన అనంతరం కేసు బెంగళూరులోని ప్రత్యేక కోర్టుకు బదిలీ అయింది. అనేక విచారణల పిదప ఈనెల 20వ తేదీన తీర్పు చెప్పాల్సి ఉంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా కోర్టును అగ్రహారం జైలు సమీపంలోకి మార్చాలని బెంగళూరు పోలీస్ కమిషనర్ కోర్టును కోరడంతో తీర్పు ఈనెల 27 వ తేదీకి వాయిదాపడింది. రెండు రాష్ట్రాల్లో టెన్షన్ తీర్పు ఫలితం ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లోనూ, భద్రతా ఏర్పాట్లపై ఉద్రిక్తత పోలీసు వర్గాల్లోనూ నెలకొంది. కర్ణాటక అదనపు పోలీస్ కమిషనర్ హరిహరన్, తమిళనాడు డీజీపీ రామానుజం పరస్పరం చర్చించుకుంటూ భద్రతా ఏర్పాట్లను ప్రారంభించారు. తమిళనాడు నుంచి కర్ణాటకకు దారితీసే అన్ని రహదారుల్లో అదనపు చెక్‌పోస్టులు, స్పీడ్ కంట్రోలర్లు వేయడం పూర్తిచేశారు. గురువారం నుంచే అన్ని వాహనాలను తనిఖీలు చేయడం ప్రారంభించారు. తీర్పు వెలువడే రోజున తమిళనాడు నుంచి కనీసం 20 వేల మంది అన్నాడీఎంకే కార్యకర్తలు బెంగళూరుకు చేరుకునే అవకాశం ఉందని అంచనావేశారు. వీరి వల్ల బెంగళూరులో శాంతిభద్రత సమస్యలు తలెత్తుతాయనే ఆందోళన రెండు రాష్ట్రాల పోలీసుల్లో నెలకొంది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఇప్పటికే ఒకసారి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటిగా పిలుచుకునే అగ్రహారం సమీపంలో తాత్కాలిక న్యాయస్థానాన్ని నిర్మిస్తున్నారు. ఆ ప్రాంగణంలో న్యాయవాదులు మినహా మరెవరూ ప్రవేశించకుండా చూడాలని నిర్ణయించారు. జయపై వెలువడుతున్న తీర్పు నేపధ్యంలో రాష్ట్రంలో 1.18 లక్షల మంది పోలీసులను బందోబస్తుకు వినియోగిస్తున్నారు. మంత్రి పూజలు ఇదిలా ఉండగా, ఆస్తుల కేసు నుంచి అమ్మ క్షేమంగా బయటపడాలని ప్రార్థిస్తూ రాష్ట్ర మంత్రి రమణ గురువారం ప్రత్యేక పూజలు చేశారు. తిరువళ్లూరు సమీపం పుట్లూరులోని ప్రసిద్ధ అంకాళపరమేశ్వరీ ఆలయంలో పూజలు నిర్వహించి వెయ్యిమందికి అన్నదానం చేశారు. -
చుక్కెదురు
చెన్నై, సాక్షి ప్రతినిధి:ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారనే అభియోగంతో 1996లో ముఖ్యమంత్రి జయలలిత, ఆమె నెచ్చెలి శశికళపై అవినీతి నిరోధకశాఖ కేసు పెట్టింది. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు 914 పట్టుచీరలు, 6,200 ఇతర చీరలు, దుస్తులు, రూ.88 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా చిరుతావూరులో ఒక స్థల యజమానిని బెదిరించి 1.5 ఎకరాల భూమిని రాయించుకున్నట్లు అభియోగం మోపారు. జయలలిత అభ్యర్థన మేరకు కేసును బెంగళూరు ప్రత్యేక కోర్టుకు తరలించారు. అడపాదడపా బెంగళూరు కోర్టుకు జయలలిత హాజరవుతున్నా అధిక శాతం ప్రభుత్వం తరపు న్యాయవాదులే విచారణకు వెళుతున్నారు. బెంగళూరు ప్రత్యేక కోర్టులో ఈ కేసు గురువారం విచారణకు వచ్చింది. ఈ కేసులోని నిందితులు జయలలిత, శశికళ ఈ నెల 5వ తేదీన స్వయంగా విచారణకు హాజరుకావాలని న్యాయమూర్తి జాన్మైకేల్ డి గుణ ఆదేశించారు. జయలలిత ముఖ్యమంత్రి హోదాలో ఉన్నందున కర్ణాటక ప్రభుత్వం ఆమెకు భద్రత కల్పించాలని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జయ రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తుండగా విచారణకు స్వయంగా హాజరుకావాలని బెంగళూరు కోర్టు ఆదేశించడం ఆమెకు ఆశనిపాతమే. చెన్నైలోనూ చుక్కెదురు జయలలిత, శశికళ భాగస్తులుగా నడుపుతున్న శశి ఎంటర్ప్రైజెస్ 1991-94 మధ్య కాలంలో ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయలేదు. దీంతో వారిపై ఆదాయపు పన్ను శాఖ కేసు నమోదు చేసింది. ఈ కేసు చెన్నై ఎగ్మూరులోని కోర్టులో 15 ఏళ్లుగా విచారణ సాగుతోంది. ఈ కేసు నుంచి విముక్తి ప్రసాదించాల్సిందిగా జయ, శశికళ వేసిన పిటిషన్‌ను ఎగ్మూరు కోర్టు కొట్టివేసింది. వారు హైకోర్టులో పిటిషన్ వేశారు. అక్కడా కేసు కొట్టివేశారు. ఆ తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీం కోర్టు సైతం కింది కోర్టుల నిర్ణయాన్ని సమర్ధించడమేకాకుండా నాలుగు నెలల్లోగా కేసును పూర్తిచేయాలని ఎగ్మూరు కోర్టును ఆదేశించింది. సుప్రీం ఆదేశాల మేరకు నాలుగు నెలల్లో కేసు ముగింపు పలకాల్సి ఉన్నందున 313 సెక్షన్ ప్రకారం నిందితుల వాంగ్మూలాన్ని రికార్డు చేయాలని, ప్రశ్న, జవాబులకు అనుమతించాలని ఆదాయపు పన్నుశాఖ న్యాయవాది రంగస్వామి గత నెల 20వ తేదీన కోర్టుకు విన్నవించారు. సుప్రీంకోర్టులో తమ పిటిషన్ విచారణ దశలో ఉన్నందున కేసు విచారణను నాలుగు వారాలు వాయిదా వేయాల్సిందిగా జయ తరపు న్యాయవాది కోరగా ఎగ్మూరు కోర్టు న్యాయమూర్తి ఆర్ దక్షిణామూర్తి నిరాకరించారు. నాలుగు నెలల్లో విచారణ ముగించాలన్న సుప్రీం ఆదేశాలకు కట్టుబడి వాయిదా వేయలేమని, ఏప్రిల్ 3వ తేదీనాటి వాయిదాకు జయలలిత, శశికళ కోర్టుకు హాజరుకావాలని ఆదేశించారు. ఈ క్రమంలో గురువారం కేసు విచారణకు వచ్చింది. జయలలిత, శశికళ హాజరుకాలేదు. ఇందుకు ఆగ్రహించిన ఆదాయపు పన్నుశాఖ న్యాయవాది రంగస్వామి వాయిదాలపై వాయిదాలతో కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. కేసును కొట్టేయాలన్న నిందితుల అభ్యర్థనను నిరాకరిస్తున్నట్లు న్యాయమూర్తి మరోసారి స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాలు తన ఆస్తుల కేసులను ప్రస్తావించకుండా ఆదేశించాలని సీఎం జయలలిత ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై ఇంకా ఎటువంటి ఆదేశాలు రాలేదు. ప్రతిపక్షాలు ప్రస్తావించని దశలో సరిగ్గా ఎన్నికల ప్రచార వేళ కోర్టులే ఈ అంశాన్ని తెరపైకి తేవడం కాకతాళీయమైనా జయలలితకు ఇబ్బందికరంగా మారిందని చెప్పవచ్చు.