న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. మతవిశ్వాసాలను దెబ్బతీశారంటూ ధోనీపై నమోదైన కేసుపై సుప్రీం కోర్టు స్టే విధించింది.
బిజినెస్ టుడే పత్రికలో తన ఫొటోను విష్ణువుగా చిత్రీకరిస్తూ వేసిన కవర్ పేజీ ఫొటో విషయంలో తలెత్తిన వివాదాన్ని ధోనీ సుప్రీం దృష్టికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. గురువారం ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేశాడు. బెంగళూరు కోర్టులో ఈ కేసు విచారణ సాగుతోంది. బెంగళూరు అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో తనపై పెండింగులో ఉన్న క్రిమినల్ ప్రొసీడింగ్స్ను రద్దుచేయానలి ధోనీ కోరారు. ఈ కేసు విచారణపై సుప్రీం కోర్టు స్టే విధించింది.
సుప్రీం కోర్టులో ధోనీకి ఊరట
Published Mon, Sep 14 2015 11:32 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement
Advertisement