సుప్రీం కోర్టును ఆశ్రయించిన ధోని.. ఎందుకంటే..? | Dhoni Appeals To Supreme Court In Amrapali Case | Sakshi
Sakshi News home page

సుప్రీం కోర్టును ఆశ్రయించిన ధోని.. ఎందుకంటే..?

Published Tue, Apr 26 2022 6:50 PM | Last Updated on Tue, Apr 26 2022 8:46 PM

Dhoni Appeals To Supreme Court In Amrapali Case - Sakshi

Dhoni Appeals Supreme Court In Amrapali Projects Case: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని భారత దేశపు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఆమ్రపాలి సంస్థతో నెలకొన్న వివాదాలపై జోక్యం చేసుకోవాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఇదే విషయమై ధోని గతంలో కూడా కోర్టు మెట్లెక్కాడు. 

ఈ వివాదానికి సంబంధించి మధ్యవర్తిత్వ ప్రక్రియలో జోక్యం చేసుకోవాలని ధోని తరఫు న్యాయవాది ఉద్ధవ్ నందా న్యాయస్థానాన్ని కోరారు. ఈ కేసు విషయంలో తాము ఎలా వ్యవహరించాలో సూచించాలని కోర్టును అభ్యర్థించారు. ధోని న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం సదరు వ్యాజ్యాన్ని మే 9న విచారించనున్నట్లు తెలిపింది.

కాగా, 2009-2016 మధ్యలో ఆమ్రపాలి కన్‌స్ట్రక్షన్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన ధోని.. తనకు రావాల్సిన రూ.40కోట్ల పారితోషికం మొత్తాన్ని సదరు కంపెనీ ఎగ్గొట్టిందని గతంలో సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. 
చదవండి: మొయిన్ అలీకి గాయం.. సీఎస్‌కే హెడ్ కోచ్ ఏమ‌న్నాడంటే..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement