Amrapali Group
-
ఆమ్రపాలి సంస్థ ఎండీపై మర్డర్ కేసు
కేంద్ర దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఆమ్రపాలి గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ శర్మపై హత్య కేసు నమోదు చేసింది. బీహార్‌లోని లఖిసరాయ్‌లోని బాలికా విద్యాపీఠం కార్యదర్శి డాక్టర్ శరద్ చంద్ర ఆగష్టు 8, 2014 సాయంత్రం తన నివాసంలోని బాల్కనీలో వార్తాపత్రిక చదువుతుండగా హత్య గురయ్యారు. బాలికా విద్యాపీఠ్, లఖిసరాయ్ భూములు, ఆస్తులను లాక్కోవడానికి కుట్రలో భాగంగా ఈ హత్య చేశారని అనిల్ శర్మతో పాటు మరి కొందరిపై చంద్ర భార్య ఉమా శర్మ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. పాట్నా హైకోర్టు ఆదేశంతో దర్యాప్తు చేపట్టిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విద్యా సంస్థకు చెందిన భూమి, ఆస్తులను స్వాధీనం చేసుకోవడమే ఈ కుట్ర వెనుక ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొంది. అనిల్ శర్మ మరికొందరి సహాయంతో సంస్థ భూమి, ఆస్తులను స్వాధీనం చేసుకోవడంతో చంద్రను అతని పదవి నుంచి కూడా తొలగినట్లు పేర్కొంది. చదవండి: టాలెంట్ కోసం విప్రో కీలక నిర్ణయం: ఉద్యోగులకు బంపర్ ఆఫర్ -
ఆమ్రపాలి సిలికాన్ సిటీపై సీబీఐ కేసు
న్యూఢిల్లీ: బ్యాంక్‌లను రూ.177 కోట్లకు మోసగించిన ఆరోపణలపై ఆమ్రపాలి సిలికాన్ సిటీ ప్రైవేటు లిమిటెడ్, దాని ప్రమోటర్ అనిల్‌కుమార్ శర్మపై సీబీఐ మోసపూరిత కేసు దాఖలు చేసింది. అనంతరం ఢిల్లీ, నోయిడాలోని ఆరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఆమ్రపాలి సిలికాన్ సిటీ తమను మోసగించినట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీబీఐ ఈ చర్యలు తీసుకుంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌తో కూడిన బ్యాంక్‌ల కన్సార్షియానికి లీడ్ బ్యాంక్‌గా బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది. దీంతో బ్యాంక్ ఆఫ్ బరోడా సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఢిల్లీ సబర్బన్ ప్రాంతంలోని అమ్రపాలి సిలికాన్ సిటీలో గ్రూపు హౌసింగ్ కాంప్లెక్స్ అభివృద్ధికి వీలుగా ఆమ్రపాలీ సిలికాన్ సిటీ ప్రైవేటు లిమిటెడ్ 1.76 లక్షల చదరపు మీటర్ల భూమిని, న్యూ ఓక్లా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి తీసుకుంది. ఇందులో నిర్మించిన 468 ఫ్లాట్లను చాలా తక్కువ ధరకు, అది కూడా నిర్మాణ వ్యయానికంటే తక్కువకే కంపెనీ విక్రయించింది. నిర్మాణ వ్యయానికంటే తక్కువకు విక్రయించడం ద్వారా రూ.73 కోట్లను కంపెనీ దారిమళ్లించినట్టు ఫోరెన్సిక్ ఆడిట్లో తేలింది. అలాగే, ఇళ్ల కొనుగోలుదారుల నుంచి తీసుకున్న రూ.303 కోట్లను గ్రూపు కంపెనీలకు దారిమళ్లించిన విషయం కూడా వెలుగు చూసింది. దీంతో ఆమ్రపాలి సిలికాన్ సిటీ రుణం విషయంలో ఫోర్జరీ, తప్పుదారి పట్టించడం ద్వారా రూ.177 కోట్ల మేరకు మోసం చేసినట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా ఆరోపించింది. చదవండి: మామూలు లక్ కాదండోయ్, సంవత్సరంలో రూ.లక్ష పెట్టుబడితో రూ.20 లక్షలు! -
ఆ గృహ కొనుగోలుదారులకు శుభవార్త! 3 నెలల్లో ఫ్లాట్లు
న్యూఢిల్లీ: ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఆమ్రపాలి గ్రూప్‌కు చెందిన గృహ కొనుగోలుదారులకు శుభవార్త. 2 నుంచి 3 నెలల్లో 11,858 ఫ్లాట్లను డెలివరీ చేస్తామని కోర్టు రిసీవర్ సీనియర్ న్యాయవాది ఆర్ వెంకటరమణి సుప్రీం ధర్మాసనానికి శుక్రవారం తెలియజేశారు. నిర్మించాల్సిన 38,000 ఫ్లాట్లలో 11,000 యూనిట్లకు పైగా ఫ్లాట్ కొనుగోలుదారులకు అప్పగిస్తున్నారని ఇది చాలా కీలక పరిణామమని తెలిపారు. వచ్చే నెలలో వచ్చే పండుగ సీజన్లో ఎన్బీసీసీ పూర్తి చేసిన 5,428 ఫ్లాట్లను గృహ కొనుగోలు దారులకు ఇవ్వనున్నట్లు, సుప్రీంకు సీనియర్ న్యాయవాది తెలిపారు. విద్యుత్ నీటి కనెక్షన్‌తో గృహ కొనుగోలుదారులకు ఇవ్వనున్నట్లు కోర్టు రిసీవర్ వెంకటరమణి ప్రధాన న్యాయమూర్తి యుయు లలిత్, జస్టిస్ బేల ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనానికి నివేదించారు. ఈ పూర్తయిన ఫ్లాట్లన్నీ గృహ కొనుగోలుదారుల నుండి పూర్తి చెల్లింపు తర్వాత మాత్రమే అప్పగిస్తామనివెంకటరమణి స్పష్టం చేశారు. అలాగే ఫోరెన్సిక్ ఆడిటర్లు రూ. 3870.38 కోట్లను గృహ కొనుగోలుదారుల నుండి గ్రహించాల్సిన మొత్తంగా అందించారని, అయితే క్రాస్-చెకింగ్‌లో ఈ మొత్తం 3,014 కోట్లుగా గుర్తించామన్నారు. రూ. 3,014 కోట్లలో ఇప్పటి వరకు 22,701 మంది గృహ కొనుగోలుదారుల నుంచి రూ. 1,275 కోట్లు పొందామని, మిగిలిన మొత్తాన్ని 7939 మంది గృహ కొనుగోలుదారుల నుంచి స్వీకరించాల్సి ఉందని, ఈ విషయంలో షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. చెల్లింపు ప్లాన్ ప్రకారం అక్టోబర్ 2024 నాటికి పూర్తికావాల్సిఉందని వెంకటరమణి తెలిపారు. -
ధోనీకి భారీ షాకిచ్చిన సుప్రీం కోర్ట్
-
మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి భారీ షాక్
సాక్షి,న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి భారీ షాక్ తగిలింది. ధోనీ అభ్యర్థనమేరకు ఆమ్రపాలి గ్రూప్‌పై ఢిల్లీ హైకోర్టు ప్రారంభించిన మధ్యవర్తిత్వ చర్యలపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు సోమవారం ధోనీకి నోటీసు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 9కి వాయిదా వేసింది. యూయూ లలిత్, బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఆమ్రపాలి గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడాల్సి ఉందని పేర్కొన్నారు. ఆమ్రపాలి గ్రూప్ పాత యాజమాన్యం మధ్య వర్తిత్వ ప్రక్రియలో గృహ కొనుగోలుదారులకు న్యాయం జరగాలని వ్యాఖ్యానించారు. ధోని బ్రాండ్ అంబాసిడర్‌గా తన సేవలకు చెల్లింపులో డిఫాల్ట్ అయ్యారంటూ ఆమ్రపాలి గ్రూపుపై మధ్యవర్తిత్వ చర్యలు కోరుతు కోర్టును ఆశ్రయించాడు. ధోనీ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్న రితి స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్‌ఎస్‌ఎమ్‌పిఎల్)తో ఆమ్రపాలి గ్రూప్ ‘షామ్ ఒప్పందాలు’ కుదుర్చుకునిఇంటి కొనుగోలుదారులసొమ్మును అక్రమంగా మళ్లించిందని అత్యున్నత న్యాయస్థానం నియమించిన ఫోరెన్సిక్ ఆడిటర్లు ధర్మాసనానికి తెలిపారు. కాగా 2019, మార్చిలో ఆమ్రపాలి గ్రూప్ ప్రాజెక్ట్‌లో 10 సంవత్సరాల క్రితం బుక్ చేసిన 5,500 చదరపు అడుగుల పెంట్‌హౌస్‌పై తన యాజమాన్య హక్కులను కాపాడాలని కోరుతూ సుప్రీం కోర్టు తలుపు తట్టాడు ధోని. రియల్ ఎస్టేట్ కంపెనీకి తన సేవలకు సంబంధించి రూ. 40 కోట్లు పెండింగ్‌లో ఉన్న బకాయిల చెల్లింపు కోసం ఆమ్రపాలి గ్రూప్‌ను ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఆమ్రపాలి గ్రూప్‌పై మధ్యవర్తిత్వ ప్రక్రియను ప్రారంభించింది. ఆమ్రపాలి, దాని డైరెక్టర్లు ఉపయోగించని ఆస్తులను విక్రయించడం ద్వారా 700 కోట్ల రటపాయల నిధిని ఎలా ఏర్పాటు చేయవచ్చో అన్వేషించాలని నోయిడా ,గ్రేటర్ నోయిడా అధికారులను కోర్టు కోరింది. కొనుగోలుదారులపై అనవసరంగా భారం పడకూడదని పేర్కొంటూ, ప్రాజెక్టుల నిర్మాణానికి లోటును తీర్చేందుకు గృహ కొనుగోలుదారులు తమ ఫ్లాట్ల కోసం చదరపు అడుగుకు రూ. 200 చొప్పున అదనపు మొత్తాన్ని జమ చేయాలనే ఎస్సీ నియమించిన రిసీవర్ ప్రతిపాదనను కోర్టు మళ్లీ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ఇది కూడా చదవండి: ఏటీఎం యూజర్లకు గమనిక, ఆ నిబంధన అందరికీ రానుందా? -
సుప్రీం కోర్టును ఆశ్రయించిన ధోని.. ఎందుకంటే..?
Dhoni Appeals Supreme Court In Amrapali Projects Case: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని భారత దేశపు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఆమ్రపాలి సంస్థతో నెలకొన్న వివాదాలపై జోక్యం చేసుకోవాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఇదే విషయమై ధోని గతంలో కూడా కోర్టు మెట్లెక్కాడు. ఈ వివాదానికి సంబంధించి మధ్యవర్తిత్వ ప్రక్రియలో జోక్యం చేసుకోవాలని ధోని తరఫు న్యాయవాది ఉద్ధవ్ నందా న్యాయస్థానాన్ని కోరారు. ఈ కేసు విషయంలో తాము ఎలా వ్యవహరించాలో సూచించాలని కోర్టును అభ్యర్థించారు. ధోని న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం సదరు వ్యాజ్యాన్ని మే 9న విచారించనున్నట్లు తెలిపింది. కాగా, 2009-2016 మధ్యలో ఆమ్రపాలి కన్స్ట్రక్షన్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన ధోని.. తనకు రావాల్సిన రూ.40కోట్ల పారితోషికం మొత్తాన్ని సదరు కంపెనీ ఎగ్గొట్టిందని గతంలో సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. చదవండి: మొయిన్ అలీకి గాయం.. సీఎస్కే హెడ్ కోచ్ ఏమన్నాడంటే..? -
MS Dhoni: ధోనీకి షాక్
భారత క్రికెట్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని.. పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఆమ్రపాలి హౌజింగ్ ప్రాజెక్టుకూ అంబాసిడర్‌గా వ్యవహరించి.. వివాదంలో చిక్కుకున్నారాయన. తాజాగా ఈ వివాదం మరోసారి తెర మీదకు వచ్చింది. ధోనీతో పాటు ప్లాట్ల బకాయిల్ని చెల్లించని మరికొంతమందికి సుప్రీంకోర్టు ఆదేశాలనుసారం 15 రోజుల డెడ్‌లైన్ విధించారు. లేనిపక్షంలో ఒప్పందం రద్దు కావడంతో పాటు ప్లాట్లను వేలం వేస్తామని స్పష్టం చేసింది. ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం.. ఆమ్రపాలి హౌజింగ్ ప్రాజెక్ట్‌లోని కస్టమర్ డేటాలో ఇంతదాకా బకాయిలు చెల్లించని ఓనర్లలో ఎంఎస్ ధోనీ కూడా ఉన్నాడు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రస్తుతం ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న ఎన్బీసీసీ(National Buildings Construction Corporation Ltd).. ఈ మేరకు ధోనీతో పాటు మొత్తం పద్దెనిమిది వందల మందికి నోటీసులు జారీ చేసింది. గడువులోగా బకాయిలు చెల్లించి.. ప్రాజెక్టు పూర్తికి సహకరించాలని కోరింది. కోర్టు ఆదేశాల మేరకు పూర్తి బకాయిలు చెల్లింపునకు రెండు వారాల గడువు ఇస్తున్నామని, లేని పక్షంలో వాళ్లను డిఫాల్టర్లుగా గుర్తిస్తామని నోటీసుల్లో తెలిపింది. ఆపై ఆ ప్లాట్లను అమ్ముడుపోని జాబితాలో చేరుస్తామని, తర్వాతి దశలో ఎలాట్‌మెంట్‌ను రద్దుచేసి... వేలం వేస్తామని హెచ్చరించింది. ఆమ్రపాలి రియల్ ఎస్టేట్ గ్రూప్‌నకు 2009 నుంచి 2016 వరకు ధోనీ ప్రచారకర్తగా వ్యవహరించాడు. ప్రాజెక్ట్ నిర్వాహణ ఆరోపణల నేపథ్యంలో రంగంలోకి దిగిన సుప్రీం కోర్టు.. ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యతల్ని ప్రభుత్వ పర్యవేక్షణలో పని చేసే సంస్థ ఎన్బీసీసీకి అప్పగించింది. ఇప్పటికే చాలామంది పేమెంట్స్ పూర్తి చేయగా.. బకాయిలు చెల్లించని వాళ్లలో ధోనీ కూడా ఉన్నారు. ప్రాజెక్టులో భాగంగా రెండు ఫ్లాట్లు ధోనీ పేరిట ఉన్నాయి. నొయిడాలోని సాప్పైర్ ఫేజ్-1లోని పెంట్ హౌజ్ కోసం కోటిన్నరకుగానూ ఇదివరకే ఇరవై లక్షలు ధోనీ చెల్లించినట్లు ఎన్బీసీసీ గుర్తించింది. అంతేకాదు అంబాసిడర్‌గా వ్యవహరించినందుకు తక్కువ ఎమౌంట్‌కే ప్లాట్లను ధోనీకి అప్పగించినట్లు, ధోనీతో పాటు పలువురు క్రికెటర్లకు 37 కోట్ల రూపాయల్ని చెల్లించినట్లు రోహిత్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ (RSMPL) వెల్లడించింది. ఇక ఈ హౌజింగ్ సొసైటీలో హోం బయర్స్ దాదాపు పదివేలమంది కస్టమర్ డాటాలో పేర్లను నమోదు చేసుకోకపోవడం విశేషం. చదవండి: ధోనీపై గంభీర్ సంచలన వ్యాఖ్యలు -
తీవ్ర ఇబ్బందుల్లో ఎంఎస్ ధోని!
న్యూఢిల్లీ: ప్రముఖ రియల్ ఎస్టేట్ గ్రూప్ ఆమ్రపాలి స్కామ్‌తో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తీవ్ర ఇబ్బందుల్లో పడినట్లే కనిపిస్తోంది. ఈ కేసుకు సంబంధించి తాజాగా ధోనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కుట్రలో అతడికి కూడా భాగస్వామ్యం ఉందని ఆరోపించిన ఆమ్రపాలి గ్రూప్ బాధితులు.. ఎఫ్ఐఆర్లో ధోని పేరును కూడా చేర్చారు. క్రికెటర్‌గా ధోనికి, బిల్డర్‌గా అనిల్ శర్మకు ఎంతో పేరుందని, వీరిపై నమ్మకంతోనే ఫ్లాట్లు కొనుగోలు చేసేందుకు సొమ్ములు చెల్లించామని బాధితులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఆమ్రపాలి రియల్ ఎస్టేట్ గ్రూప్‌నకు ధోని ప్రచారకర్తగా వ్యవహరించాడు. ఫ్లాట్లు విక్రయిస్తామంటూ అనేక మంది వద్ద సొమ్ములు సేకరించిన సంస్థ ఆ మొత్తాన్ని నిబంధనలకు విరుద్ధంగా అనేక కంపెనీలకు మళ్లించింది. ఇందులో ధోని భార్యకు చెందిన కంపెనీ కూడా ఉంది. అయితే, డిపాజిట్లు తీసుకున్న ఆమ్రపాలి కంపెనీ అగ్రిమెంట్ ప్రకారం ఓనర్లకు ఫ్లాట్లు అప్పజెప్పలేదనే ఫిర్యాదులు వెల్లువెత్తడంతో 2017లో దీనిపై సుప్రీం కోర్టు విచారణకు ఆదేశించింది. ప్రజల నుంచి వేలాది కోట్ల రూపాయలు వసూలు చేసిన సంస్థ ఆ మొత్తాన్ని వివిధ రియల్ ఎస్టేట్ కంపెనీలకు బదిలీ చేసినట్టు తేలింది. ప్రజలను మోసం చేసిన కేసులో ఆమ్రపాలి డైరెక్టర్లు సైతం జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఆ కంపెనీకి ధోని బ్రాండ అంబాసిడర్‌గా వ్యవహరించడమే అతనిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయడానికి ప్రధాన కారణమైంది. ఈ గ్రూప్ ద్వారా ఫ్లాట్లు కొనుగోలు చేసిన పలువురు చేసిన ఫిర్యాదు మేరకు ఇప్పటివరకూ ఏడు ఎఫ్ఐఆర్లను ఢిల్లీ పోలీసులు నమోదు చేశారు.