
కేంద్ర దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఆమ్రపాలి గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ శర్మపై హత్య కేసు నమోదు చేసింది. బీహార్‌లోని లఖిసరాయ్‌లోని బాలికా విద్యాపీఠం కార్యదర్శి డాక్టర్ శరద్ చంద్ర ఆగష్టు 8, 2014 సాయంత్రం తన నివాసంలోని బాల్కనీలో వార్తాపత్రిక చదువుతుండగా హత్య గురయ్యారు. బాలికా విద్యాపీఠ్, లఖిసరాయ్ భూములు, ఆస్తులను లాక్కోవడానికి కుట్రలో భాగంగా ఈ హత్య చేశారని అనిల్ శర్మతో పాటు మరి కొందరిపై చంద్ర భార్య ఉమా శర్మ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది.
పాట్నా హైకోర్టు ఆదేశంతో దర్యాప్తు చేపట్టిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విద్యా సంస్థకు చెందిన భూమి, ఆస్తులను స్వాధీనం చేసుకోవడమే ఈ కుట్ర వెనుక ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొంది. అనిల్ శర్మ మరికొందరి సహాయంతో సంస్థ భూమి, ఆస్తులను స్వాధీనం చేసుకోవడంతో చంద్రను అతని పదవి నుంచి కూడా తొలగినట్లు పేర్కొంది.
చదవండి: టాలెంట్ కోసం విప్రో కీలక నిర్ణయం: ఉద్యోగులకు బంపర్ ఆఫర్
Comments
Please login to add a commentAdd a comment