జయ నివాసం ఎదుట పండగ వాతావరణం!
బెంగళూరు: బెంగళూరు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో తమిళనాడు మాజీ సీఎం జయలలిత నివాసం ఎదుట పండగ వాతావరణం నెలకొంది. జయ అభిమానులు, ఎన్నాడీఎంకే మద్దతు దారులు ఆనందంతో గంతులు వేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే కేసులో సెప్టెంబర్ 27 తేదిన జయలలితకు జైలుశిక్ష విధించింది.
జయలలిత కు బెయిల్ మంజూరు చేశారనే వార్త వెలువడగానే తమిళనాట ఏఐఏడీఎంకే మద్దతుదారులు మిఠాయిలు పంచుకుని, ఆనందాన్ని పంచుకున్నారు.