జయలలితకు నో బెయిల్!
బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కు చుక్కెదురైంది. జయలలిత బెయిల్ పిటిషన్ కర్నాటక హైకోర్టు బెయిల్ పిటిషన్ కొట్టేసింది. కోర్టు ఉత్తర్వులు వెల్లడికాకముందే బెయిల్ వచ్చిందంటూ తమిళ మీడియా అత్యుత్సాహ ప్రచారం చేయడంతో దేశవ్యాప్తంగా మీడియా జయలలితకు బెయిల్ వచ్చిందంటూ ప్రసారం చేశాయి.
సీబీఐ అధికారి మాటలతో తొందరపడ్డ తమిళ మీడియా కారణంగా జయలలిత బెయిల్ లభించిందంటూ వచ్చిన వార్తలతో తమిళనాట పండగ వాతావరణం నెలకొంది. బెయిల్ రాలేదంటూ ఆ తర్వాత వచ్చిన వార్తలతో అన్నాడీఎంకే మద్దతుదారులు నిరుత్సాహానికి గురయ్యారు.