జయలలిత విడుదలపై ఉత్కంఠ!
Published Tue, Oct 7 2014 4:10 PM | Last Updated on Sat, Sep 2 2017 2:29 PM
బెంగళూరు: తమిళనాడు మాజీ సీఎం జయలలిత బెయిల్ మంజూరు అయినప్పటికి ఆమె మంగళవారం విడుదల కాకపోవచ్చని కోర్టు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జయలలిత బెయిల్ ఆర్డర్ తయారు కాలేదని తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం 5 గంటల లోపు బెయిల్ కాపీ అందితేనే జయలలిత ఈ రోజు విడుదల అవుతుందని కోర్టు వర్గాలు వెల్లడించాయి.
జయలలిత విడుదల కోసం అన్నాడీఎంకే మద్దతుదారులు, కార్యకర్తలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో జయలలిత ఈరోజు విడుదల అవుతుందా లేదా అనే ఉత్కంఠ నెలకొని ఉంది. ఇప్పటికే తమిళనాట జయ అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలారు.
Advertisement
Advertisement