సూర్యకు క్షమాపణ చెప్పాల్సిందే.. | Kushboo fired on sun tv anchors | Sakshi
Sakshi News home page

సూర్యకు క్షమాపణ చెప్పాల్సిందే..

Published Mon, Jan 22 2018 6:39 AM | Last Updated on Sat, Jun 2 2018 7:34 PM

Kushboo fired on sun tv anchors - Sakshi

తమిళసినిమా: నటుడు సూర్య ఎత్తు గురించి వ్యంగ్యంగా మాట్లాడిన సన్‌ టీవీ యాంకర్లపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌ కోలీవుడ్‌లో అధికం అవుతోంది. ఇటీవల ఒక కార్యక్రమంలో సూర్య హీల్స్‌ వేసుకుని అనుష్కతో నటించా రని, త్వరలో అమితాబ్‌ బచ్చన్‌తో నటించనున్నట్లు ప్రచారం జరుగుతుండడంతో స్టూల్‌పై నిలబడి నటిస్తారా? అని పరిహాసం చేసిన లేడీ యాంకర్ల వ్యవహారం కోలీవుడ్‌లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇప్పటికే దక్షిణ భారత నటీనటుల సంఘం సన్‌టీవీ యాంకర్ల వ్యవహారంపై సీరియస్‌ అయిన విష యం తెలిసిందే.

ఆ మహిళా వ్యా ఖ్యాతలపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అదే విధంగా నటుడు కరుణాస్, దర్శకుడు విఘ్నేశ్‌శివ, నిర్మాత కేఈ. జ్ఞానవేల్‌రాజా వ్యాఖ్యాత తీరును తీవ్రంగా ఖండించారు. తాజాగా నటి కుష్బూ ఆ యంకర్లు సూర్య కు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈమె ఆదివారం ట్విట్టర్‌లో ఈ వ్యవహారంపై స్పందిస్తూ పొడవైన వారు ఎవరూ? పొట్టివా రు ఎవరూ? ఎవరు లావు అయితే వీరికేమిటీ, సన్ననైనే వీరికేమిటీ? అంటూ ప్రశ్నించారు. వీటి వల్ల వారికి కలిగే సంతోషం ఏమిటీ? అన్నారు.  సూర్య గురించి మాట్లాడిన వారు సిగ్గు పడాలన్నారు. ఇది అర్ధరహిత చర్చ అన్నారు. ఆ ఇద్దరు మహిళా యాంకర్లు సూర్యకు క్షమాపణ చెప్పాలని కుష్బూ డిమాండ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement