RIP Anandha Kannan: కోలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ యాంకర్, సినీ నటుడు ఆనంద కణ్ణన్ క్యాన్సర్‌తో కన్నుమూశాడు. సింగపూర్-తమిళియన్ అయిన ఆనంద.. 90వ దశకంలో కోలీవుడ్ ఆడియొన్స్‌కు ఫేవరెట్ నటుడు కూడా. ముఖ్యంగా సన్ టీవీ సిరీస్ సింధ్‌బాద్‌లో లీడ్ రోల్ ద్వారా పిల్లలకు, యువతకు బాగా కనెక్ట్ అయ్యాడు.
క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆనంద.. ఆగష్టు 16న కన్నుమూసినట్లు తెలుస్తోంది. 48 ఏళ్ల వయసులో క్యాన్సర్ చికిత్స తీసుకుంటూ.. ఆయన నవ్వుతూ పలు కార్యక్రమాల్లో పాల్గొనడం విశేషం. వారం క్రితం హఠాత్తుగా ఆరోగ్యం తిరగబడడంతో ఆయన్ని చెన్నైలోని ఓ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ విషయం తెలియగానే యావత్ కోలీవుడ్ దిగ్‌భ్రాంతికి లోనైంది. క్రియేటర్‌గా, నటుడిగా 30 ఏళ్ల పాటు తమిళ ఆడియొన్స్‌ను ఆయన అలరించాడు. ఏకేటీ థియేటర్స్‌ను ఏర్పాటుచేసి.. వర్క్‌షాప్స్‌తో రూరల్ కల్చర్ ద్వారా వర‍్ధమాన నటులెందరినో ప్రోత్సహించాడు.
కాగా, సింగపూర్‌లో వసంతం టీవీ ద్వారా వీజేగా కెరీర్ ప్రారంభించిన ఆనంద.. తర్వాత చెన్నైలో స్థిరపడ్డాడు. సన్ మ్యూజిక్ తో పాటు సన్ టీవీలో సీరియళ్ల ద్వారా ఆడియెన్స్‌ను అలరించాడు. ‘సరోజ, అదిసయ ఉల్గం’ చిత్రాల్లో ఆయన నటించగా.. మరో రెండు చిత్రాలు రిలీజ్‌కు నోచుకోలేదు. సింగపూర్‌లోనూ ఆయన షోలు సూపర్ హిట్. యూత్ ఐకాన్‌గా పేరున్న ఆనంద మృతిని చాలామంది తట్టుకోలేకపోతున్నారు. #RIPanandakannan ట్రెండ్‌తో సోషల్ మీడియా నివాళి అర్పిస్తోంది. సింగపూర్ సెలబ్రిటీ వడివళన్, కోలీవుడ్ దర్శకుడు వెంకట్ ప్రభు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
A great friend a great human is no more!! #RIPanandakannan my deepest condolences pic.twitter.com/6MtEQGcF8q
— venkat prabhu (@vp_offl) August 16, 2021
Comments
Please login to add a commentAdd a comment