చెన్నై: ఎయిర్‌సెల్-మాక్సిస్ ఒప్పందానికి సంబంధించిన మనీల్యాండరింగ్ కేసులో తమ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) అటాచ్ చేయడాన్ని సవాలు చేస్తూ కళానిధి మారన్‌కు చెందిన సన్ టీవీ, కల్ కమ్యూనికేషన్లు వేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. పిటిషన్‌ను విచారించనని, ఈ కేసును సుప్రీం కోర్టు పర్యవేక్షిస్తోంది కనుక అక్కడికే వెళ్లాలని జస్టిస్ సత్యనారాయణన్ బుధవారం చెప్పారు.
టెలికం మాజీ మంత్రి దయానిధి మారన్, ఆయన సోదరుడు కళానిధి , ఇతర కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్న రూ. 742 కోట్ల ఆస్తులను తాత్కాలికంగా జప్తు(అటాచ్‌మెంట్) చేస్తూ ఈడీ మార్చిలో ఇచ్చిన ఉత్తర్వును పిటిషనర్లు సవాలు చేశారు. దయానిధికి చెందిన సన్ డెరైక్ట్ టీవీ, సౌత్ ఏసియా ఎఫ్‌ఎం లిమిటెట్ కంపెనీల్లోకి పెట్టుబడుల ముసుగులో రూ. 742 కోట్ల ముడుపులు వచ్చాయని సీబీఐ ఆరోపించడం తెలిసిందే.
మద్రాస్ హైకోర్టులో మారన్ సోదరులకు ఎదురుదెబ్బ
Published Thu, Jun 11 2015 1:52 AM | Last Updated on Tue, Jun 4 2019 6:47 PM
Advertisement