మారన్ సోదరులపై సీబీఐ చార్జిషీట్
న్యూఢిల్లీ: 2జీ కుంభకోణంలో మారన్ సోదరులపై ప్రత్యేక న్యాయస్థానంలో శుక్రవారం సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది.
ఎయిర్ సెల్-మ్యాక్సీస్ ఒప్పందం కేసులో మాజీ కేంద్రమంత్రి దయానిధి మారన్, కళానిధి మారన్, మలేషియన్ వ్యాపారవేత్త టి. ఆనంద కృష్ణన్ తోపాటు మరో ఐదుగురిపై చార్జిషీట్ దాఖలు చేసినట్టు సీబీఐ పేర్కోంది.
వచ్చేనెల 11 తేది నుంచి ప్రత్యేక న్యాయస్థానంలో ఓపీ సైనీ విచారణ జరుగుతుందని తెలిపారు.