సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసులో దర్యాప్తు సంస్థలు కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరంలను అరెస్ట్ చేయకుండా నవంబర్ 1 వరకూ మధ్యంతర రక్షణను ఢిల్లీ కోర్టు పొడిగించింది. నవంబర్ 1న తిరిగి కేసు విచారణను చేపడతామని సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఓపీ సైనీ వెల్లడించారు.
చిదంబరం న్యాయవాదులు పీకే దూబే, అర్ష్‌దీప్ సింగ్‌ల అప్పీల్‌పై సవివర సమాధానం దాఖలు చేసేందుకు సమయం కావాలని సీబీఐ, ఈడీల తరపు న్యాయవాదులు అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, నితేష్ రాణాలు కోరారు. ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసులో సీబీఐ చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరం పేర్లను జులై 19న చార్జిషీట్‌లో పేర్కొంది.
ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట సీబీఐ వీరిపై అనుబంధ చార్జిషీట్‌ను సైతం దాఖలు చేసింది. రూ 3500 కోట్ల ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ ఒప్పందంతో పాటు ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులోనూ చిదంబరం పాత్రపై సీబీఐ, ఈడీలు దర్యాప్తు చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment