పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024లో భాగంగా కరాచీ కింగ్స్‌తో నిన్న (ఫిబ్రవరి 29) జరిగిన మ్యాచ్‌లో క్వెట్టా గ్లాడియేర్స్ బ్యాటర్ షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ చెలరేగిపోయాడు. 31 బంతుల్లో బౌండరీ, ఆర డజను సిక్సర్ల సాయంతో అజేయమైన 58 పరుగులు చేసి తన జట్టును గెలిపించాడు. చివరి బంతికి బౌండరీ బాది గ్లాడియేటర్స్‌ను విజయతీరాలకు చేర్చాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కరాచీ.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. కరాచీ ఇన్నింగ్స్‌లో ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. జేమ్స్ విన్స్ (37) టాప్ స్కోరర్‌గా కాగా.. టిమ్ సీఫర్ట్ 21,షోయబ్ మాలిక్ 12, మొహమ్మద్ నవాజ్ 28, పోలార్డ్ 13, ఇర్ఫాన్ ఖాన్ 15, హసన్ అలీ 2 పరుగులు చేశారు. ఆఖర్లో అన్వర్ అలీ (14 బంతుల్లో 25 నాటౌట్) మెరపు ఇన్నింగ్స్ ఆడగా.. జహిద్ మహమూద్ 3 పరుగులతో అజేయంగా నిలిచారు. క్వెట్టా బౌలర్లలో అబ్రార్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టగా.. అకీల్ హొసేన్, ఉస్మాన్ తారిక్ తలో 2 వికెట్లు, వసీం ఓ వికెట్ దక్కించుకున్నాడు.
అనంతరం 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన క్వెట్టా.. 5 వికెట్లు కోల్పోయి చివరి బంతికి విజయతీరాలకు చేరింది. జేసన్ రాయ్ (31 బంతుల్లో 52; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రూథర్‌ఫోర్డ్ మెరుపు అర్దశతకాలతో విరుచుకుపడగా.. ఆఖర్లో అకీల్ హొసేన్ (17 బంతుల్లో 22 నాటౌట్) రూథర్‌ఫోర్డ్‌కు జత కలిశాడు. క్వెట్టా ఇన్నింగ్స్‌లో సౌద్ షకీల్ 24, ఖ్వాజా నఫే 2, సర్ఫరాజ్ అహ్మద్ 3, రిలీ రొస్సో 6 పరుగులు చేశారు. కరాచీ బౌలర్లలో హసన్ అలీ, జహిద్ మహమూద్ తలో 2 వికెట్లు.. షోయబ్ మాలిక్ ఓ వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment