
ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జేసన్ రాయ్ పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్( పీఎస్‌ఎల్ 2022లో) విధ్వంసం సృష్టించాడు. క్వెటా గ్లాడియేటర్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్.. 57 బంతుల్లోనే 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 116 పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్ మెగావేలం మరో నాలుగురోజుల్లో జరగనున్న నేపథ్యంలో రాయ్ తన మెరుపు ఇన్నింగ్స్‌తో ఫ్రాంచైజీల కళ్లలో పడ్డాడు. ఫిబ్రవరి 12,13 తేదీల్లో జరగనున్న మెగావేలంలో జేసన్ రాయ్ రూ. 2కోట్లకు తన పేరును రిజిస్టర్ చేసుకున్నాడు. మరి వేలంలో ఏ ఫ్రాంచైజీ అతన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.
చదవండి: Cristiano Ronaldo: రొనాల్డో అరుదైన ఘనత.. సోషల్ మీడియాను వదల్లేదు
ఇక రాయ్ తుఫాను ఇన్నింగ్స్‌తో క్వెటా గ్లాడియేటర్స్ లాహోర్ ఖలండర్స్‌పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలండర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ఫఖర్ జమాన్( 45 బంతుల్లో 70,3 ఫోర్లు, 3 సిక్సర్లు), హారీ బ్రూక్(17 బంతుల్లో 41, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ వీస్(9 బంతుల్లో 22, 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన క్వెటా గ్లాడియేటర్స్ 19.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. రాయ్‌కు తోడు.. చివర్లో జేమ్స్ విన్స్(38 బంతుల్లో 49 నాటౌట్, 5 ఫోర్లు), మహ్మద్ నవాజ్(12 బంతుల్లో 25, 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించడంతో విజయం అందుకుంది.
చదవండి: IPL 2022 Auction:షేక్ రషీద్ సహా ఏడుగురు అండర్-19 ఆటగాళ్లకు బిగ్‌షాక్!
Quetta are comfortably cruising in business class, thanks to @JasonRoy20 👨🏻✈️ #HBLPSL7 l #LevelHai l #QGvLQ pic.twitter.com/3p9WpwG8MJ
— PakistanSuperLeague (@thePSLt20) February 7, 2022
Comments
Please login to add a commentAdd a comment