![Jason Roy Completes Fifty Against Mumbai indians - Sakshi](/styles/webp/s3/article_images/2018/04/14/Josan-Roy.jpg.webp?itok=1Q0gz85N)
జాసన్ రాయ్
ముంబై : ఐపీఎల్-11 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డేవిల్స్ ఆటగాళ్లు జాసన్ రాయ్, రిషబ్ పంత్ అర్థ సెంచరీలతో చెలరేగారు. దీంతో ఢిల్లీ 10 ఓవర్లకు వికెట్ నష్టపోయి 104 పరుగులు చేసింది. ఈ దశలో 27 బంతులు ఎదుర్కొన్న రాయ్ 3 ఫోర్లు,4 సిక్సులతో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో వైపు పంత్ సైతం వరుస సిక్సులు, ఫోర్లతో ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ దశలో 23 బంతుల్లో 47 పరుగులు చేసిన పంత్‌ను కృనాల్ పాండ్యా పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో రెండో వికెట్‌కు నమోదైన 69 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి తొలి వికెట్ 50 పరుగుల భాగస్వామ్యం లభించింది. వేగంగా ఆడే క్రమంలో పంత్, మ్యాక్స్ వెల్ (13) వికెట్లు కోల్పోయింది.
Comments
Please login to add a commentAdd a comment