![Bcci Mulling To Take Strict Action Against Players Pulling Out Of Ipl Reports - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/29/alex-hales.jpg.webp?itok=Kw5Cnpf2)
Courtesy: IPL Twitter
IPL 2022: ఐపీఎల్-2022 ఆరంభానికి ముందు ఇంగ్లండ్ క్రికెటర్‌లు జాసన్ రాయ్, ఆలెక్స్ హేల్స్ ఆనూహ్యంగా తప్పుకుని ఆయా ఫ్రాంచైజీలను షాక్‌కు గురిచేసిన సంగతి తెలిసిందే. బయోబబుల్ నిబంధనల కారణంగా ఈ ఏడాది సీజన్‌కు దూరంగా ఉంటున్నట్లు వారిద్దరూ వెల్లడించారు. ఐపీఎల్-2022 మెగా వేలంలో భాగంగా జాసన్ రాయ్‌ను గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేయగా, ఆలెక్స్ హెల్స్‌ను కోల్ కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది.
కాగా సరైన కారణం లేకుండా ఐపీఎల్ నుంచి తప్పుకున్న ఈ ఇద్దరి క్రికెటర్‌లపై బీసీసీఐ చర్యలు తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపై సరైన కారణం లేకుండా ఐపీఎల్ నుంచి వైదొలగకుండా ఆటగాళ్లు ఉండేలా సరికొత్త విధానాన్ని తీసుకురావాలని బీసీసీఐ యోచిస్తోన్నట్లు సమాచారం. తాజాగా జరిగిన ఐపిఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. "లీగ్‌లో వాటాదారులైన ఫ్రాంఛైజీల పట్ల గవర్నింగ్ కౌన్సిల్ నిబద్ధతను కలిగి ఉంది. ఫ్రాంఛైజీలు చాలా ప్రణాళికలతో ఆటగాళ్లను వేలంలో కొనుగోలు చేస్తారు.
వారు సరైన కారణం లేకుండా వైదొలిగితే వారి లెక్కలు తారుమారు అవుతాయి. కొత్త పాలసీ విధానాన్ని తీసుకురావాలి అని భావిస్తున్నాము. సరైన కారణం లేకుండా ఐపీఎల్ నుంచి తప్పుకున్న ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటాము. అలా అని ఐపీఎల్ నుంచి వైదొలిగిన ప్రతి ఒక్కరినీ కొన్ని సంవత్సరాల పాటు నిషేధించే స్వీపింగ్ విధానం తీసుకురాము. వారు తప్పుకున్న కారణం నిజమైతే ఎటువంటి చర్యలు ఉండవు" అని గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు ఒకరు పేర్కొన్నారు.
చదవండి: IPL 2022 GT Vs LSG: అతడు మంచి వన్డే ప్లేయర్ మాత్రమే.. టీ20 క్రికెట్‌లో అలా కుదరదు: సెహ్వాగ్ విసుర్లు
Comments
Please login to add a commentAdd a comment