Viral: England Batter Jason Roy Welcomes His Baby Boy With Emotional Post - Sakshi
Sakshi News home page

Jason Roy: తండ్రైన క్రికెటర్‌... చిన్ని తండ్రికి స్వాగతం అంటూ ఎమోషనల్‌

Published Sat, Jan 8 2022 9:58 AM | Last Updated on Sat, Jan 8 2022 4:57 PM

Welcome To The Family Little Man Says Emotional Jason Roy Fatherhood - Sakshi

ఇంగ్లండ్‌ బ్యాటర్‌ జేసన్‌ రాయ్‌ తండ్రయ్యాడు. అతడి భార్య ఎల్లీ మూరే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించిన జేసన్‌ రాయ్‌... భార్యా బిడ్డలకు కలిసి ఉన్న ఫొటోలను షేర్‌ చేశాడు. కొడుకుకు ఎలోసీ అని నామకరణం చేసినట్లు తెలిపాడు. ఈ మేరకు... ‘‘జనవరి 5, 2022న జననం. కుటుంబంలోకి స్వాగతం చిన్ని తండ్రీ... నాకు చాలా గర్వంగా ఉంది. కృతజ్ఞతాభావంతో నా మనసు నిండిపోయింది’’ అని భావోద్వేగ నోట్‌ షేర్‌ చేశాడు.

ఈ క్రమంలో సహచర ఆటగాళ్లు, అభిమానుల నుంచి రాయ్‌ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా 2017 అక్టోబరులో రాయ్‌ తన గర్ల్‌ఫ్రెండ్‌ ఎల్లీని వివాహమాడి జీవిత భాగస్వామిని చేసుకున్నాడు. 2019లో ఈ జంటకు కూతురు ఎవర్లీ జన్మించగా.. ఇప్పుడు కుమారుడు పుట్టాడు. కాగా టీ20 వరల్డ్‌కప్‌-2021 టోర్నీలో భాగంగా జేసన్‌ రాయ్‌ చివరిసారిగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. ఇక ఐపీఎల్‌-2021 సీజన్‌లో జేసన్‌ రాయ్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. డేవిడ్‌ వార్నర్‌ స్థానంలో జట్టులోకి వచ్చి మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

చదవండి: SA vs IND: రిషభ్‌ పంత్‌కి భారీ షాక్‌!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement