
అహ్మదాబాద్: భారత్ ఇన్నింగ్స్‌లో సూర్యకుమార్ అవుటైన తీరు హైలైట్‌గా నిలిచింది. బౌండరీ వద్ద జోర్డాన్ అద్భుత ప్రదర్శన అందుకు కారణం. రషీద్ బౌలింగ్‌లో సూర్య డీప్ మిడ్ వికెట్ దిశగా ఆడాడు. అయితే లాంగాన్ నుంచి దూసుకొచ్చిన జోర్డాన్ ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు. అయితే వేగంలో తాను బౌండరీని దాటే ప్రమాదం ఉండటంతో బంతిని రాయ్‌వైపు విసిరాడు. రాయ్ బంతిని అందుకోవడంతో సూర్య వెనుదిరిగాడు. స్కోరు బోర్డులో జోర్డాన్ పేరు లేకపోయినా ఈ క్యాచ్ అతనిదే. బంతిని అందుకున్న సమయంలో రాయ్ నవ్విన తీరు ఈ క్యాచ్ ఎంత అసాధారణమో చూపించింది.
Chris Jordan Pulling Off A Michael Jordan Lay-Up!#IndiavsEngland #INDvsENG pic.twitter.com/FrAtVCPhBf
— @TimeTravellerJofraArcher (@JofraArcher8) March 20, 2021
కాగా, ఇంగ్లండ్‌తో ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 3–2తో గెలుచుకుంది. శనివారం ఇక్కడ జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ 36 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (52 బంతుల్లో 80 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ శర్మ (34 బంతుల్లో 64; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధ సెంచరీలు సాధించగా... హార్దిక్ పాండ్యా (17 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (17 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ఓపెనర్‌గా దిగిన కోహ్లి ముగ్గురు సహచరులతో వరుసగా 94, 49, 81 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పడం విశేషం. అనంతరం ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 188 పరుగులు చేసింది.
చదవండి: (ఆఖరి పోరులో అదరగొట్టారు)