అహ్మదాబాద్: నరేంద్ర మోదీ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ20లో భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ ఔట్ విషయంలో అంపైర్ నిర్ణయంపై విమర్శలు కొనసాగుతున్నాయి. గురువారం నాటి మ్యాచ్‌లో సామ్ కర్రన్ బౌలింగ్‌లో, సూర్యకుమార్ స్వీప్‌షాట్‌తో లెగ్‌సైడ్ బాదగా, ఫైన్‌లెగ్‌లో మలన్ క్యాచ్ పట్టిన సంగతి తెలిసిందే. అయితే, బాల్ అతడి చేతుల్లో పడిన వెంటనే నేలని తాకింది. ఈ క్రమంలో ఫీల్డ్ అంపైర్ ఇచ్చిన ‘సాఫ్ట్ సిగ్నల్ అవుట్’కే టీవీ అంపైర్ మొగ్గు చూపడంతో సూర్యకుమార్ అవుటైనట్లు ప్రకటించారు.
ఈ విషయంపై స్పందించిన ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్.. ఇదొక చెత్త నిర్ణయం అంటూ ట్విటర్ వేదికగా మండిపడ్డాడు. అతడి ట్వీట్‌కు బదులిచ్చిన ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్..‘‘సాఫ్ట్ సిగ్నల్ అనే నిబంధన అస్సలు బాలేదు. ఆఫ్ ఫీల్డ్ ఎంపైర్ ఈ విషయంపై నిర్ణయం తీసుకోవడం కాస్త కష్టమే. ‘‘నాకు సరిగ్గా తెలియడం లేదు కాదు.. కానీ గెస్ చేయగలను. కాబట్టి ఇది అవుట్’’ అని చెబుతారా’’ అంటూ ఈ రూల్‌ను విమర్శించిన అతడు, అదే సమయంలో మలన్ మద్దతుగా నిలిచాడు. బాల్ చేజారుతుందని అతడికి తెలియదన్న బ్రాడ్.. మలన్ గురించి ట్విటర్‌లో వస్తున్న కామెంట్లు చాలా దారుణంగా ఉన్నాయని పేర్కొన్నాడు. కాగా నాలుగో టీ20 టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే.
చదవండి: ఇంగ్లండ్ తొండి.. సూర్య ఔట్ కాదు
సిక్సర్‌తో మొదలుపెట్టి.. 28 బంతుల్లోనే
It’s the “soft signal” which is odd. Hard for off field umpire to overturn. ‘Let’s go upstairs cause I don’t have a clue but I’m guessing (soft signal) it’s out.’
— Stuart Broad (@StuartBroad8) March 18, 2021
Malan’s Twitter feed will be ugly- but he wouldn’t have known the ball hit the ground diving forward at pace https://t.co/hCwlFQKpIf
गजब है! टेक्नोलॉजी का क्या फायदा जब ग्राउंड अंपायर के साथ ही जाना है। साफ नॉट आउट था।👎😠#INDvENG #INDvsENG pic.twitter.com/ZTEH9gxfpa
— Shashank Pradhan (@PradhanShashank) March 18, 2021
Comments
Please login to add a commentAdd a comment