IPL 2022: Big Shock To Gujarat Titans, Batter Jason Roy Pulls Out Of IPL - Sakshi
Sakshi News home page

IPL 2022: గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్‌.. స్టార్‌ ఆటగాడు దూరం

Published Tue, Mar 1 2022 9:42 AM | Last Updated on Tue, Mar 1 2022 11:13 AM

IPL 2022: Gujarat Titans stunned, Jason Roy pulls out of IPL tournament - Sakshi

ఐపీఎల్‌లో కొత్త జట్టుగా అవతరించిన గుజరాత్‌  టైటాన్స్‌కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. ఇంగ్లండ్‌ స్టార్‌ ఓపెనర్‌  జాసన్ రాయ్ బయో బబుల్ నిబంధనల కారణంగా కారణంగా ఐపీఎల్‌-2022 నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. కాగా ఐపీఎల్ మెగా వేలంలో రూ.2 కోట్లకు రాయ్‌ను  గుజరాత్ టైటాన్స్‌ కోనుగొలు చేసింది. అయితే రాయ్‌ తన నిర్ణయాన్ని  గుజరాత్‌ ఫ్రాంచైజీకు తెలియజేసినట్లు తెలుస్తోంది. గతేడాది కూడా ఐపీఎల్‌ తొలి ఫేజ్‌కు దూరమైన రాయ్‌.. సెకెండ్‌ ఫేజ్‌లో సన్‌రైజర్స్‌ తరుపున ఆడాడు. అంతకు ముందు ఢిల్లీకు రాయ్‌ ప్రాతినిథ్యం వహించాడు.  ఇక జాసన్‌ రాయ్‌ చివరిసారిగా పాకిస్థాన్ సూపర్ లీగ్ -2022లో పాల్గొన్నాడు.

పీఎస్‌ల్‌లో రాయ్‌ అద్భుతంగా రాణించాడు. కేవలం 6 మ్యాచ్‌లు ఆడిన రాయ్‌.. 303 పరుగులు సాధించించాడు. అతడి ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ, 2 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అదే విధంగా తన ఐపీఎల్‌ కెరీర్‌లో 13 మ్యాచ్‌లు ఆడిన రాయ్‌ 329 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్‌-2022 మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌ మొత్తం మహారాష్ట్రలోనే జరగనుంది. ముంబై, పుణే వేదికగా మ్యాచ్‌లు జరగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ త్వరలోనే ప్రకటించనుంది.

చదవండి: Kieron Pollard: స్పిన్నర్‌గా మారిన పొలార్డ్‌.. ముంబై ఇండియన్స్‌కు ఇక.. వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement