PC: IPL.com
ఐపీఎల్-2023లో క్వాలిఫియర్-2 సమరానికి రంగం సిద్దమైంది. అహ్మదాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు మే28న అహ్మదాబాద్ వేదికగా చెన్నైసూపర్ కింగ్స్‌తో ఫైనల్ మ్యాచ్‌లో తలపడనుంది. ఇక క్వాలిఫియర్-1లో సీఎస్‌కే చేతిలో ఓటమి చవిచూసిన గుజరాత్.. ఎలాగైనా క్వాలిఫియర్-2లో విజయం సాధించి రెండో సారి ఫైనల్లో అడుగుపెట్టాలని భావిస్తోంది.
మరోవైపు లక్నోపై విజయంతో గెలుపుజోష్‌లో ఉన్న ముంబై.. అదే జోరును గుజరాత్‌పై కొనసాగించి ఆరో సారి ఫైనల్‌కు చేరాలని యోచిస్తోంది. ఇక ఈ మ్యాచ్‌లో గుజరాత్ రెండు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు సమాచారం. దసున్ షనక స్థానంలో ఐరీష్ పేసర్ జాషువా లిటిల్ తుది జట్టులోకి వచ్చే చాన్స్ ఉంది.
అదే విధంగా దర్శన్ నల్కండే స్థానంలో యువ బ్యాటర్ సాయిసుదర్శన్‌ను తీసుకురావాలని గుజరాత్ మెనెజ్‌మెంట్ భావిస్తన్నట్లు సమాచారం. మరోవైపు ముంబై ఇండియన్స్ మాత్రం లక్నోపై ఆడిన టీమ్‌తో బరిలోకి దిగనున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ మ్యాచ్ శుక్రవారం సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది.
తుది జట్లు(అంచనా)
గుజరాత్ టైటాన్స్: శబ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, జాషువా లిటిల్, మహ్మద్ షమీ, నూర్ అహ్మద్
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, తిలక్ వర్మ, క్రిస్ జోర్డాన్, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, ఆకాష్ మధ్వల్
చదవండి: AFG vs IND: ఆఫ్గాన్‌తో వన్డే సిరీస్.. భారత కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా! విధ్వంసకర ఓపెనర్ ఎంట్రీ
Comments
Please login to add a commentAdd a comment