PC: IPL.com
ఐపీఎల్-2023లో ముంబై ఇండియన్స్ మరో అద్భుత విజయం సాధించింది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో ముంబై గెలుపొందింది. దీంతో పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ మూడో స్థానాన్ని చేరుకుంది. ఇక మ్యాచ్‌లో గుజరాత్ ఓటమి పాలైనప్పటికీ.. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ మాత్రం అద్భుత ప్రదర్శన కనబరిచాడు.
తొలుత బౌలింగ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన రషీద్.. అనంతరం బ్యాటింగ్‌లో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. గుజరాత్‌కు భారీ ఓటమి ఖాయం అనుకున్న వేళ రషీద్.. 32 బంతుల్లో 3 ఫోర్లు, 10 సిక్స్‌లతో 79 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కాగా ఈఏడాది సీజన్‌లో ముంబై చేతిలో గుజరాత్ ఓటమి చెందడం ఇది రెండో సారి కావడం గమానర్హం. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు.
"మేము బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమయ్యాం. మా జట్టులో రషీద్ ఒక్కడే అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతడు బౌలింగ్ చేసిన విధానం, బ్యాటింగ్ గురించి ఎంత చెప్పకున్న తక్కువ. మ్యాచ్‌ను రషీద్ భాయ్ టర్న్ చేస్తాడని నేను భావించాను. అతడికి సపోర్ట్‌గా మరొక బ్యాటర్ ఉండి ఉంటే మ్యాచ్ కచ్చితంగా టర్న్ అయ్యేది. బౌలింగ్‌లో కూడా విఫలమయ్యం.
సరైన ప్రణాళికలను అమలు చేయలేకపోయాం. వికెట్ చాలా ఫ్లాట్‌గా ఉంది. అయినప్పటికీ మేము ఒక 25 పరుగులు అదనంగా ఇచ్చాం. సూర్య గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీ20 క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడు. అతడి విషయంలో సరైన ప్లాన్స్ అమలు చేయకపోతే సూర్య విధ్వంసం సృష్టిస్తాడు.
అది కేవలం బౌలర్ల చేతిలో మాత్రం ఉంది. ఎందుకంటే నేను ఫీల్డ్ సెట్ చేయడం తప్ప ఇంకా ఏమి చేయలేను. ముంబై చివరి 10 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. మేము వారిలా చేయడంలో విఫలమయ్యం. అందుకు తగ్గ ఫలితం అనుభవించాం. ఈ మ్యాచ్ ఫలితాన్ని మర్చిపోయి మా తదుపరి మ్యాచ్‌లపై దృష్టి సారిస్తాం" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు.
చదవండి: #RashidKhan: భారీ ఓటమి తప్పదనుకున్నవేళ రషీద్ సంచలన ఇన్నింగ్స్.. పలు రికార్డులు బద్దలు
Comments
Please login to add a commentAdd a comment