ముంబై ఇండియన్స్‌పై గుజరాత్ ఘన విజయం
ఐపీఎల్-2024లో గుజరాత్ టైటాన్స్ బోణీ కొట్టింది. అహ్మదాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో గుజరాత్ ఘన విజయం సాధించింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే చేసింది. ముంబై బ్యాటర్లలో బ్రెవిస్(46), రోహిత్ శర్మ(43) టాప్ స్కోరర్లగా నిలిచారు. గుజరాత్ బౌలర్లలో ఒమర్జాయ్, ఉమేశ్ యాదవ్, మోహిత్ శర్మ, స్పెన్సర్ జాన్సెన్ తలా రెండు వికెట్లు సాధించారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో సాయిసుదర్శన్(45) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. శుబ్‌మన్ గిల్(41) రాహుల్ తెవాటియా(22) పరుగులతో రాణించారు. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు పడగొట్టగా.. కోయిట్జీ రెండు, చావ్లా తలా రెండు వికెట్లు పడగొట్టారు.
18 ఓవర్లకు ముంబై స్కోర్: 142/5
18 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 5 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. క్రీజులో తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ఉన్నారు. ముంబై విజయానికి 12 బంతుల్లో 27 పరుగులు కావాలి.
మూడో వికెట్ డౌన్.. రోహిత్ ఔట్
107 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. 43 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. సాయి కిషోర్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ముంబై విజయానికి 42 బంతుల్లో 57 పరుగులు కావాలి.
10 ఓవర్లకు ముంబై స్కోర్: 88/2
10 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ రెండు వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(40), బ్రెవిస్(26) పరుగులతో ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన ముంబై.. నమాన్ ధీర్ ఔట్
30 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన నమాన్ ధీర్.. ఒమర్జాయ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 4 ఓవర్లకు ముంబై ఇండియన్స్ స్కోర్: 40/2. క్రీజులో రోహిత్ శర్మ(18), బ్రెవిస్(0) ఉన్నారు.
167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. తొలి ఓవర్‌లోనే ఇషాన్ కిషన్ డకౌటయ్యాడు. ఒమర్జాయ్ బౌలింగ్‌లో కిషన్ ఔటయ్యాడు.
రాణించిన గుజరాత్ బ్యాటర్లు.. ముంబై టార్గెట్ 169 పరుగులు
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో సాయిసుదర్శన్(45) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. శుబ్‌మన్ గిల్(41) రాహుల్ తెవాటియా(22) పరుగులతో రాణించారు. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు పడగొట్టగా.. కోయిట్జీ రెండు, చావ్లా తలా రెండు వికెట్లు పడగొట్టారు.
ఐదో వికెట్ కోల్పోయిన గుజరాత్..
గుజరాత్ టైటాన్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 45 పరుగులు చేసిన సాయిసుదర్శన్.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 18 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్ తెవాటియా(17), విజయ్ శంకర్(1) ఉన్నారు.
నాలుగో వికెట్ కోల్పోయిన గుజరాత్.. మిల్లర్ ఔట్
133 పరుగుల వద్ద గుజరాత్ టైటాన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన మిల్లర్.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి విజయ్ శంకర్ వచ్చాడు.
మూడో వికెట్ డౌన్.. ఒమర్జాయ్ ఔట్
104 పరుగుల వద్ద గుజరాత్ టైటాన్స్ మూడో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన అజ్మతుల్లా ఓమర్జాయ్.. గెరాల్డ్ కోయిట్జీ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
రెండో వికెట్ డౌన్..
66 పరుగుల వద్ద గుజరాత్ టైటాన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 31 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్.. చావ్లా బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి అజ్ముతుల్లా ఒమర్జాయ్ వచ్చాడు.
తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్..
31 పరుగుల వద్ద గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన వృద్దిమన్ షా.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి సాయి సుదర్శన్ వచ్చాడు.
3 ఓవర్లకు ముంబై స్కోర్ 27/0
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ 3 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్(11) , వృద్దిమన్ షా(15) పరుగులతో ఉన్నారు.
ఐపీఎల్-2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్ టైటాన్స్ జట్టు యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ సారథ్యం వహిస్తుండగా.. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా వ్యవహరిస్తున్నాడు.
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్(కెప్టెన్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), సాయి సుదర్శన్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఉమేష్ యాదవ్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, స్పెన్సర్ జాన్సన్
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, నమన్ ధీర్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), టిమ్ డేవిడ్, షమ్స్ ములానీ, పీయూష్ చావ్లా, గెరాల్డ్ కోయెట్జీ, జస్ప్రీత్ బుమ్రా, ల్యూక్ వుడ్
Comments
Please login to add a commentAdd a comment