ఐపీఎల్ -2024 సీజన్‌ను ముంబై ఇండియన్స్‌తో ఓటమితో ఆరంభించింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో ముంబై ఓటమి పాలైంది. సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై పరాజయం చవిచూసింది. ఆఖరి 6 ఓవర్లలో ముంబై విజయానికి 48 పరుగులు అవసరమవ్వగా.. వరుసక్రమంలో వికెట్లు కోల్పోయి ఓటమి కొనితెచ్చుకుంది.
169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే చేసింది. ముంబై బ్యాటర్లలో బ్రెవిస్(46), రోహిత్ శర్మ(43) టాప్ స్కోరర్లగా నిలిచారు. ఇక ఓటమిపై మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. ఆఖరి ఓవర్లలో వరుసగా వికెట్ల కోల్పోవడంతో ఓటమి పాలైమని హార్దిక్ తెలిపాడు.
"ఆఖరి వరకు మేము గేమ్‌లోనే ఉన్నాం. చివరి 5 ఓవర్లలో మా విజయానికి 42 పరుగులు అవసరమయ్యాయి. మా చేతిలో 6 వికెట్ల ఉండడంతో ఈజీగా గెలుస్తామని భావించాము. కానీ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయాం. అదే మా కొంపముంచింది. చివరి ఐదు ఓవర్లలో ముంబై ఇంత తక్కువ స్కోర్ ఛేదించకపోయిన మ్యాచ్‌ల్లో కచ్చితంగా ఇదొకటి.
అహ్మదాబాద్‌లో మళ్లి తిరిగి వచ్చి ఆడినందుకు సంతోషంగా ఉంది. అహ్మదాబాద్ స్టేడియం అంటే నాకు చాలా ఇష్టం. ఈ రోజు మొత్తం అభిమానులతో నిండిపోయింది. గుజరాత్ కూడా అద్భుతంగా ఆడింది. ఇక రషీద్ ఖాన్ బౌలింగ్‌లో తిలక్ వర్మ సింగిల్‌ను తిరష్కరించడం సరైన నిర్ణయమే.
ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్ స్ట్రైక్‌లో ఉంటే బెటర్ అని తిలక్ భావించాడు. నేను కూడా అతడికి ఫుల్ సపోర్ట్‌గా నిలిచాను. ఇంకా మాకు 13 మ్యాచ్‌లు ఉన్నాయి. తర్వాతి మ్యాచ్‌లో కచ్చితంగా మేము తిరిగి కమ్‌బ్యాక్ ఇస్తామని" హార్దిక్ పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో పేర్కొన్నాడు. కాగా హార్దిక్ ముంబై కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ఓటమిని ఎదుర్కోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment