
ముంబై: ఐపీఎల్ 2021 సీజన్‌కు సంబంధించి వేలానికి సిద్ధమవుతున్న ఫ్రాంచైజీలు పలువురు స్టార్ ఆటగాళ్లకు షాక్ ఇస్తున్నాయి. ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్‌ను వదులుకునేందుకు రాజస్తాన్ రాయల్స్ సిద్ధమైంది. ఐపీఎల్ 13వ సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ తరపున 14 మ్యాచ్‌లాడి 311 పరుగులు చేసిన స్మిత్.. టీమిండియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో రిషబ్ పంత్ గార్డ్ మార్క్‌ను చెరిపేసి అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. ఇలాంటి చీటింగ్ చేసే వ్యక్తి ఐపీఎల్‌లో ఆడకుండా బ్యాన్ చేయాలంటూ స్మిత్‌పై సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: థ్యాంక్యూ బీసీసీఐ.. మంచి సిరీస్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు
దీంతో పాటు టీమిండియా వెటరన్ ఆటగాళ్లు హర్బజన్ సింగ్, మురళీ విజయ్, పియూష్ చావ్లాలతో పాటు కేదార్ జాదవ్‌ను సీఎస్‌కే వదులుకున్నట్లు ప్రకటించింది. అయితే ఐపీఎల్ 13వ సీజన్‌కు దూరంగా ఉన్న సురేశ్ రైనా మాత్రం సీఎస్‌కేతో కొనసాగనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా పలువురు ఆటగాళ్లను వదులుకుంటున్నట్లు ప్రకటించింది. ఇంగ్లండ్ ఆటగాడు జాసన్ రాయ్‌తో పాటు అలెక్స్ హేల్స్, భారత ఆటగాళ్లు సందీప్, మోహిత్ శర్మలకు గుడ్‌బై చెప్పనున్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రకటించింది. కాగా ఐపీఎల్ 2021కి సంబంధించి వేలంపాట ఫిబ్రవరి చివరివారంలో నిర్వహించనున్నట్లు సమాచారం.చదవండి: ఆసీస్‌తో సిరీస్ : అసలైన హీరో అతనే