
లండన్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరుగుతున్న ఆరంభపు మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టుకు మంచి భాగస్వామ్యాన్ని అందించారు జేసన్ రాయ్, జోరూట్‌లు. వీరిద్దరూ 106 పరుగులు సాధించి ఇంగ్లండ్‌ను గాడిలో పెట్టారు. ఇంగ్లండ్ ఒక్క పరుగుకే వికెట్ కోల్పోయిన తరణుంలో జేసన్ రాయ్, రూట్‌లు సమయోచితంగా బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలోనే వీరు హాఫ్ సెంచరీలతో మెరిశారు. 51 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో రాయ్ హాఫ్ సెంచరీ చేయగా, జో రూట్ 56 బంతుల్లో అర్థ శతకం నమోదు చేశాడు.
కాగా, ఓపెనర్ రాయ్ 54 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. దాంతో ఇంగ్లండ్ 107 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. హాఫ్ సెంచరీ తర్వాత భారీ షాట్‌కు యత్నించిన రాయ్ ఔటయ్యాడు. సఫారీ బౌలర్ ఫెహ్లుకోవాయా బౌలింగ్‌లో డుప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చి రాయ్ పెవిలియన్ బాట పట్టాడు. కాసేపటికి రూట్(51) కూడా నిష్క్రమించాడు. రబడా బౌలింగ్‌లో జేపీ డుమినీకి క్యాచ్ ఇచ్చిన రూట్ పెవిలియన్ చేరారు.
వీరిద్దరూ నాలుగు పరుగుల వ్యవధిలో పెవిలియన్ చేరారు. అంతకుముందు ఒక బంతిని మాత్రమే ఎదుర్కొన్న బెయిర్ స్టో పరుగులేమీ చేయకుండా గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. తొలి ఓవర్‌ను అందుకున్న దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్.. బెయిర్ స్టోను పెవిలియన్‌కు చేర్చాడు. తాహీర్ వేసిన గుడ్ లెంగ్త్ బంతికి తడబడిన బెయిర్ స్టో.. సఫారీ కీపర్ డీకాక్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.