లండన్ : ప్రపంచకప్-2019లో తన విధ్వంసకర ఆటతీరుతో విమర్శకులచే ప్రశంసలు అందుకున్నాడు ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జేసన్ రాయ్. అంతేకాకుండా ఇంగ్లండ్ జగజ్జేతగా నిలవడంలో రాయ్ కీలక పాత్ర పోషించాడు. ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేయడంతో రాయ్ తొలిసారి ఇంగ్లండ్ టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. బుధవారం ఐర్లాండ్‌తో జరగబోయే ఏకైక టెస్టు కోసం ప్రకటించిన జాబితాలో 28 ఏళ్ల రాయ్‌ను సెలక్టర్లు ఎంపిక చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. అన్నీ కుదిరితే ఐర్లాండ్‌పై టెస్టు అరంగేట్రం చేసే అవకాశం ఉంది.
తొలి సారి ప్రపంచకప్ అందుకోవడంతో సంబరాల్లో మునిగితేలుతున్న ఇంగ్లండ్.. ఈ అపూర్వ విజయానికి యాషెస్ కూడా తోడుకావాలని భావిస్తోంది. దీంతో యాషెస్‌కు ముందు ఈ టెస్టును వార్మప్‌గా ఉపయోగించుకోవాలని ఇంగ్లండ్ ఆరాటపడుతోంది. దానిలో భాగంగా రాయ్ టెస్టు ప్రదర్శనను పరిశీలించాలని అనుకుంటున్నారు. ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్న ఈ టెస్టు మ్యాచ్‌కు బెన్ స్టోక్స్, జోస్ బట్లర్‌లకు సెలక్టర్లు విశ్రాంతినివ్వగా.. బౌలర్లు జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్‌లను పరిగణలోకి తీసుకోలేదు.
ఇంగ్లండ్ టెస్టు జట్టు:
జోయ్ రూట్(కెప్టెన్), మొయిన్ అలీ, జేమ్స్ అండర్సన్, బెయిర్ స్టో, స్టువార్ట్ బ్రాడ్, బర్న్స్, స్యామ్ కరన్, జోయ్ డెన్లీ, లూయిస్ గ్రెగొరీ, లీచ్, జేసన్ రాయ్, స్టోన్, క్రిస్ వోక్స్.
Comments
Please login to add a commentAdd a comment