test team
-
విజ్డెన్ అత్యుత్తమ జట్టులో నలుగురు టీమిండియా ప్లేయర్లు.. కోహ్లికి నో ప్లేస్
ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా విజ్డెన్ ఎంపిక చేసిన అత్యుత్తమ టెస్ట్ జట్టులో నలుగురు టీమిండియా ప్లేయర్లకు చోటు దక్కింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా విజ్డెన్ అత్యుత్తమ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ జట్టులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి చోటు దక్కకపోవడం విశేషం. ప్రస్తుత ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో విరాట్ ఎనిమిదో స్థానంలో ఉన్నాడు.వికెట్‌కీపర్ కోటాలో పాక్ ఆటగాడు, ఐసీసీ పదో ర్యాంకర్ మొహమ్మద్ రిజ్వాన్ ఎంపికయ్యాడు. రోహిత్ శర్మతో (ఆరో ర్యాంక్) పాటు ఓపెనర్‌గా స్టీవ్ స్మిత్ (నాలుగో ర్యాంక్) ఎంపికయ్యాడు.Wisden picks Current Best Test XI based on ICC Rankings:1. Rohit Sharma.2. Steve Smith.3. Kane Williamson.4. Joe Root.5. Daryl Mitchell.6. Mohammad Rizwan.7. Ravindra Jadeja.8. Ravi Ashwin.9. Pat Cummins.10. Jasprit Bumrah.11. Josh Hazelwood. pic.twitter.com/xUSQPYjA09— Tanuj Singh (@ImTanujSingh) September 10, 2024వన్ డౌన్లో కేన్ విలియమ్సన్ (రెండో ర్యాంక్), నాలుగో స్థానంలో జో రూట్ (మొదటి ర్యాంక్), ఐదో ప్లేస్‌లో డారిల్ మిచెల్ (మూడో ర్యాంక్), వికెట్‌కీపర్‌గా మొహమ్మద్ రిజ్వాన్ (పదో ర్యాంక్), ఆల్‌రౌండర్ కోటాలో రవీంద్ర జడేజా (నంబర్ వన్ ఆల్‌రౌండర్), స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా రవిచంద్రన్ అశ్విన్ (నంబర్ వన్ టెస్ట్ బౌలర్), పేసర్లుగా పాట్ కమిన్స్ (నాలుగో ర్యాంక్), జస్ప్రీత్ బుమ్రా (రెండో ర్యాంక్), జోష్ హాజిల్‌వుడ్ (రెండో ర్యాంక్) విజ్డెన్ అత్యుత్తమ టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నారు.ఓవరాల్‌గా చూస్తే విజ్డెన్ అత్యుత్తమ టెస్ట్ జట్టులో నలుగురు టీమిండియా ప్లేయర్లు, ముగ్గురు ఆస్ట్రేలియా ఆటగాళ్లు, ఇద్దరు న్యూజిలాండ్ ప్లేయర్లు, ఇంగ్లండ్, పాక్‌ల నుంచి చెరొకరు చోటు దక్కించుకున్నారు. ఈ జట్టు ఎంపిక కేవలం ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగానే జరిగింది. ర్యాంకింగ్స్‌లో టాప్‌లో ఉన్న ఆటగాళ్లను విజ్డెన్ తమ అత్యుత్తమ జట్టుకు ఎంపిక చేసుకుంది. -
బంగ్లాతో టెస్టు సిరీస్.. భారత జట్టు ప్రకటన! పంత్ రీ ఎంట్రీ
ముంబై: వికెట్ కీపర్ రిషభ్ పంత్ భారత టెస్టు జట్టులోకి తిరిగొచ్చాడు. 2022 డిసెంబర్లో రోడ్డు ప్రమాదానికి గురైన పంత్ 20 నెలల తర్వాత టెస్టు ఫార్మాట్లో బరిలోకి దిగనున్నాడు. ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో భారత్ ‘బి’ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పంత్ రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 7, 61 పరుగులు చేశాడు. ఈ నెల 19 నుంచి చెన్నైలో బంగ్లాదేశ్‌తో జరగనున్న తొలి టెస్టు కోసం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఆదివారం రాత్రి 16 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ ఏడాది ఆరంభంలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు వ్యక్తిగత కారణాలతో దూరమైన విరాట్ కోహ్లి తిరిగి రాగా... ఉత్తర ప్రదేశ్ పేస్ బౌలర్ యశ్ దయాల్ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. సీనియర్ పేసర్ షమీ శస్త్రచికిత్స అనంతరం పూర్తిగా కోలుకోకపోవడంతో... సెలెక్టర్లు యశ్ దయాల్‌కు అవకాశం కలి్పంచారు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 24 మ్యాచ్‌లాడిన యశ్ దయాల్ 76 వికెట్లు పడగొట్టాడు. టి20 ప్రపంచకప్ గెలిచినప్పటి నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లి, బుమ్రా విశ్రాంతి తీసుకుంటుండగా... ఇతర ఆటగాళ్లు దులీప్ ట్రోఫీ ఆడుతున్నారు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా గాయపడి జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్ కూడా పునరాగమనం చేశాడు. తొలి టెస్టుకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెపె్టన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశి్వన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్‌దీప్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్. -
ఐసీసీ టెస్ట్ జట్టు ప్రకటన.. టీమిండియా నుంచి ఇద్దరు!
2023 అత్యుత్తమ టెస్ట్ జట్టును ఐసీసీ ఇవాళ (జనవరి 23) ప్రకటించింది. ఈ జట్టుకు సారధిగా ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఎంపిక కాగా.. టీమిండియా నుంచి ఇద్దరు ఆటగాళ్లకు చోటు లభించింది. ఈ జట్టుకు ఓపెనర్లుగా ఆసీస్ ఆటగాడు ఉస్మాన్ ఖ్వాజా, శ్రీలంక ప్లేయర్ దిముత్ కరుణరత్నే ఎంపిక కాగా.. వన్ డౌన్ బ్యాటర్‌గా న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, నాలుగో స్థానంలో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్, ఐదో ప్లేస్‌లో ఆసీస్ ఆటగాడు ట్రవిస్ హెడ్, వికెట్‌కీపర్ బ్యాటర్‌గా ఆసీస్ ఆటగాడు అలెక్స్ క్యారీ, ఆల్‌రౌండర్ల కోటాలో భారత ఆటగాళ్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా ఆసీస్ సారధి పాట్ కమిన్స్, స్పెషలిస్ట్ పేసర్లుగా ఇంగ్లండ్ బౌలర్ మిచెల్ స్టార్క్, ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఎంపికయ్యారు. ఈ జట్టులో రిటైర్డ్ ఆటగాడు స్టువర్ట్ బ్రాడ్‌కు చోటు లభించడం అనూహ్యం. జట్ల వారీగా చూస్తే.. ఆస్ట్రేలియా నుంచి అత్యధికంగా ఐదుగురు ఆటగాళ్లు ఎంపిక కాగా.. ఇంగ్లండ్ నుంచి ఇద్దరు, భారత్ నుంచి ఇద్దరు, శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల నుంచి చెరో ఆటగాడు ఎంపికయ్యాడు. భారత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు ఈ జట్టులో చోటు దక్కకపోవడం ఆసక్తికరం. ఇదిలా ఉంటే, ఐసీసీ గతేడాది అత్యుత్తమ టెస్ట్ జట్టుతో పాటు వన్డే, టీ20 జట్లను కూడా ప్రకటించింది. ఒక్క ఆటగాడికి కూడా మూడు ఫార్మాట్ల జట్లలో చోటు లభించలేదు. 2023 ఐసీసీ టెస్ట్ జట్టు: ఉస్మాన్ ఖ్వాజా, దిముత్ కరుణరత్నే, కేన్ విలియమ్సన్, జో రూట్, ట్రవిస్ హెడ్, రవీంద్ర జడేజా, అలెక్స్ క్యారీ (వికెట్‌కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), రవిచంద్రన్ అశ్విన్, మిచెల్ స్టార్క్, స్టువర్ట్ బ్రాడ్ 2023 ఐసీసీ వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ట్రవిస్ హెడ్, విరాట్ కోహ్లి, డారిల్ మిచెల్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్‌కీపర్), మార్కో జన్సెన్, ఆడమ్ జంపా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్ 2023 ఐసీసీ టీ20 జట్టు: ఫిలిప్ సాల్ట్, యశస్వి జైస్వాల్, నికోలస్ పూరన్, మార్క్ చాప్మన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సికందర్ రజా, అల్పేష్ రంజనీ, మార్క్ అడైర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, రిచర్డ్ నగరవ -
ఒక్కటీ గెలవలేదు.. హోదా ఇచ్చి తప్పుచేశారు! అన్నిటికంటే చెత్త విషయం ఇదే..
Getting Test status was...: న్యూజిలాండ్ మాజీ పేసర్ సైమన్ డౌల్ ఐర్లాండ్ క్రికెట్‌ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టుకు టెస్టు హోదా కల్పించడం అన్నింకంటే చెత్త విషయమని పేర్కొన్నాడు. టెస్టు జట్టుగా మారడం ఐర్లాండ్ క్రికెట్‌కు హానికరంగా పరిణమించిందని వ్యాఖ్యానించాడు. కాగా పరిమిత ఓవర్ల క్రికెట్లో పసికూన అనే ముద్రను చెరిపేసుకునేందుకు కృషి చేస్తున్న ఐరిష్ టీమ్.. 2017లో టెస్టు జట్టు హోదాను దక్కించుకుంది. ఆ మరుసటి ఏడాది పాకిస్తాన్‌తో తమ తొలి అంతర్జాతీయ టెస్టు ఆడిన ఐరిష్ జట్టు.. 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇక ఆ తర్వాత.. అఫ్గనిస్తాన్‌తో ఒకటి, ఇంగ్లండ్‌తో రెండు, శ్రీలంకతో రెండు టెస్టులాడింది. వీటన్నింటితో పాటు ఈ ఏడాది బంగ్లాదేశ్‌తో ఆడిన ఏకైక టెస్టులోనూ పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో ఐర్లాండ్ జట్టు పరాభవాలను ఉద్దేశించి సైమన్ డౌల్ స్కై స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ఫ్యాన్స్‌ను కోల్పోతానని తెలుసు ‘‘ఇలా మాట్లాడటం వల్ల నా అభిమానుల్లో కొంతమందిని కోల్పోతానని తెలుసు.. కానీ ఐర్లాండ్ విషయంలో జరిగిన చెడు ఏమిటంటే ఆ జట్టుకు టెస్టు హోదా రావడమే. నేను మాట్లాడేది సిల్లీగా అనిపించవచ్చు. అంతర్జాతీయ స్థాయిలో టెస్టు క్రికెట్ ఆడాలనేది ఇప్పటికీ ఐర్లాండ్‌లోని కొద్ది మంది ప్లేయర్లకు మాత్రమే కల. అప్పుడు కౌంటీ క్రికెట్లో ఆడుతూ కానీ రానున్న 15-20 ఏళ్లలో ఇలాగే ఉంటుందని చెప్పలేం. నిజానికి తమ క్రికెటర్లు కౌంటీ క్రికెట్ ఆడేటపుడు ఐర్లాండ్ జట్టు అత్యుత్తమంగా ఉండేది. యూకేలో అత్యున్నత ప్రమాణాల స్థాయికి తగ్గట్లు వాళ్లు ఆడేవారు. దానినే జాతీయ జట్టులోనూ కొనసాగించాలని పట్టుదలగా ఉండేవారు. ఒత్తిడి ఎలా జయించాలో తెలిసిన అనుభవజ్ఞులు జట్టులో ఉంటే ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ ప్రస్తుతం ఐర్లాండ్ టీమ్‌ను చూస్తే అలా కనిపించడం లేదు’’ అని పేర్కొన్నాడు. కాగా చెత్త ప్రదర్శనల నేపథ్యంలో టెస్టు హోదా వల్ల ఐర్లాండ్‌కు పెద్దగా ఒరిగిందేమీ లేదని.. భవిష్యత్తులో ఆ జట్టు మనుగడ కష్టమేనన్న ఉద్దేశంలో సైమన్ డౌల్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. చదవండి: Ind vs Aus: కనీసం ఆ జట్టులో కూడా పనికిరాడా? కెప్టెన్ కావాల్సినోడు.. -
పుజారాపై వేటు... యశస్వికి చోటు
న్యూఢిల్లీ: భారత టెస్టు క్రికెట్లో కీలక పరిణామం... సుదీర్ఘ కాలంగా జట్టులో కీలక సభ్యుడిగా, పలు చిరస్మరణీయ విజయాల్లో ముందుండి నడిపించిన చతేశ్వర్ పుజారాపై సెలక్టర్లు విశ్వాసం కోల్పోయారు. వచ్చే వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ను (డబ్ల్యూటీసీ 2023–2025) దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ చేయబోతున్న మార్పుల్లో భాగంగా అందరికంటే ముందుగా పుజారాపై వేటు పడింది. వెస్టిండీస్‌తో జరిగే టెస్టు సిరీస్ కోసం శుక్రవారం ప్రకటించిన భారత జట్టులో పుజారాకు చోటు దక్కలేదు. అతనితో పాటు ఇటీవల జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడిన పేసర్ ఉమేశ్ యాదవ్‌ను కూడా జట్టు నుంచి తప్పించారు. వీరి స్థానాల్లో యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, పేసర్ ముకేశ్ కుమార్‌లను ఎంపిక చేశారు. 16 మంది సభ్యుల ఈ టీమ్‌లోకి మరో పేస్ బౌలర్ నవదీప్ సైనీ కూడా ఎంపికయ్యాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో రాణించిన అజింక్య రహానే తన స్థానం నిలబెట్టుకోవడంతో పాటు వైస్ కెపె్టన్‌గా కూడా ఎంపిక కావడం విశేషం. భిన్న వర్గాల నుంచి విమర్శలు వచ్చినా ఆంధ్ర వికెట్ కీపర్ కోన శ్రీకర్ (కేఎస్) భరత్ తన స్థానం నిలబెట్టుకోగా... గాయాల నుంచి ఇంకా కోలుకోకపోవడంతో బుమ్రా, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ పేర్లను పరిశీలించలేదు. మొహమ్మద్ షమీకి విశ్రాంతినివ్వగా, జనవరి 2021 తర్వాత మళ్లీ టెస్టు ఆడని సైనీకి మరో చాన్స్ దక్కింది. భారత్, విండీస్ మధ్య జూలై 12–16, జూలై 20–24 మధ్య డొమినికా, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లలో రెండు టెస్టు మ్యాచ్‌లు జరుగుతాయి. అనూహ్య ఎంపికలేమీ లేకుండా... వెస్టిండీస్‌తో జరిగే 3 వన్డేల సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో మాత్రం ఎలాంటి ఆశ్చర్యకర ఎంపికలు లేవు. భారత్ ఆడిన గత 4 వన్డే సిరీస్‌లకు దూరంగా ఉన్న వికెట్ కీపర్ సంజు సామ్సన్ తిరిగి జట్టులోకి ఎంపిక కావడమే చెప్పుకోదగ్గ విశేషం. ఆ్రస్టేలియాతో వన్డే సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచ్‌లలో తొలి బంతికే వెనుదిరిగి చెత్త రికార్డు నమోదు చేసినా... సూర్యకుమార్ యాదవ్‌కు మళ్లీ అవకాశం దక్కింది . స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌పై వేటు పడింది. ఎంపిక చేసిన 17 మందితో పాటు గాయాల నుంచి కోలుకొని బుమ్రా, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ అందు బాటులోకి వస్తే 20 మందితో వచ్చే వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకొని ఎంపిక సాగినట్లు అర్థమవుతోంది. భారత్, విండీస్ మధ్య జూలై 27, 29, ఆగస్ట్ 1 తేదీల్లో 3 వన్డేలు జరుగుతాయి. రంజీల్లో సత్తా చాటి... ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన యశస్వి ఫస్ట్ క్లాస్ రికార్డు కూడా ఘనంగా ఉండటం అతనికి టెస్టు టీమ్‌లో అవకాశం క ల్పించింది. 26 ఇన్నింగ్స్‌లలోనే అతను 80.21 సగటుతో 1845 పరుగులు సాధించాడు. ఇందులో 9 సెంచరీలు ఉన్నాయి. ఇటీవల జరిగిన ఇరానీ కప్ మ్యాచ్‌లో అతను రెండు ఇన్నింగ్స్‌లలో 213, 144 పరుగులు చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం కూడా రిజర్వ్‌గా అతను ఇటీవల జట్టుతో పాటు లండన్ వెళ్లాడు. ఫస్ట్‌క్లాస్‌లో 42.19 సగటు ఉన్న రుతురాజ్ రికార్డు గొప్పగా లేకపోయినా, అతని టెక్నిక్ టెస్టు ఫార్మాట్‌కు పనికొస్తుందని భావించి సెలక్టర్లు గత కొంతకాలంగా అతడిపై దృష్టి పెట్టారు. గత మూడు రంజీ సీజన్లలో బెంగాల్ రెండుసార్లు ఫైనల్ వెళ్లడంలో పేసర్ ముకేశ్ కుమార్ కీలక పాత్ర పోషించాడు. ఇండియా ‘ఎ’ తరఫున కూడా రాణించిన అతను 39 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 21.55 సగటుతో 149 వికెట్లు తీశాడు. ఈ ముగ్గురిలో రుతురాజ్ ఇప్పటికే భారత్ తరఫున ఒక వన్డే, 9 టి20లు ఆడగా మిగతా ఇద్దరు ఇంకా అరంగేట్రం చేయలేదు. టెస్టు జట్టు వివరాలు: రోహిత్ శర్మ (కెప్టెన్), రహానే (వైస్ కెప్టెన్), శుబ్‌మన్ గిల్, కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, కేఎస్ భరత్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, సిరాజ్, ముకేశ్ కుమార్, జైదేవ్ ఉనాద్కట్, ఇషాన్ కిషన్, నవదీప్ సైనీ. వన్డే జట్టు వివరాలు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, సంజూ సామ్సన్, ఇషాన్ కిషన్, శార్దుల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, చహల్, కుల్దీప్, జైదేవ్ ఉనాద్కట్, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముకేశ్. -
ఐసీసీ టెస్టు జట్టు: ఆసీస్, ఇంగ్లండ్ ప్లేయర్ల హవా.. భారత్ నుంచి ఒకే ఒక్కడు
ICC Men’s Test Team of the Year 2022: గతేడాది టెస్టుల్లో తమదైన ముద్ర వేసిన పురుష క్రికెటర్లతో కూడిన జట్టును అంతర్జాతీయ క్రికెట్ మండలి మంగళవారం ప్రకటించింది. 2022 ఏడాదికి గానూ.. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 11 మంది ప్లేయర్ల పేర్లను వెల్లడించింది. ఈ జట్టుకు బెన్‌స్టోక్స్‌ను సారథిగా ఎంపిక చేసిన ఐసీసీ.. టీమిండియా బ్యాటర్ రిషభ్ పంత్‌కు వికెట్ కీపర్‌గా అవకాశమిచ్చింది. భారత్ నుంచి ఒకే ఒక్కడు కాగా టీమిండియా నుంచి పంత్ ఒక్కడికే ఐసీసీ అత్యుత్తమ టెస్టు జట్టులో స్థానం దక్కడం విశేషం. ఈ టీమ్‌లో ఓపెనర్లుగా ఉస్మాన్ ఖవాజా, క్రెయిగ్ బ్రాత్‌వెయిట్.. మూడో స్థానంలో మార్నస్ లబుషేన్, ఆ తర్వాతి స్థానాల్లో బాబర్ ఆజం, జానీ బెయిర్‌స్టో, బెన్‌స్టోక్స్, రిషభ్ పంత్, ప్యాట్ కమిన్స్‌కు చోటిచ్చింది ఐసీసీ. ఆసీస్, ఇంగ్లండ్ ఆటగాళ్ల హవా పేస్ విభాగంలో కగిసో రబడ, జేమ్స్ ఆండర్సన్ స్పిన్ విభాగంలో నాథన్ లియోన్ ఐసీసీ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇప్పటికే 2021-23 సీజన్లో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరిన ఆసీస్ జట్టుకు చెందిన ఆటగాళ్లు అత్యధికంగా నలుగురు ఈ జట్టులో స్థానం సంపాదించారు. బజ్‌బాల్ విధానంతో టెస్టు క్రికెట్లోనూ దూకుడు ప్రదర్శిస్తున్న సారథి స్టోక్స్‌తో పాటు బెయిర్‌స్టో, ఆండర్సన్ ఇంగ్లండ్ నుంచి చోటు దక్కించుకున్నారు. వారెవ్వా పంత్ 2022లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ పంత్ 12 ఇన్నింగ్స్‌లో 61.81 సగటుతో 680 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక గతేడాది పంత్ టెస్టుల్లో 21 సిక్సర్లు బాదాడు. ఆరు స్టంప్స్‌లో భాగమయ్యాడు. 23 క్యాచ్‌లు అందుకున్నాడు. కాగా గతేడాది డిసెంబరు 30న కారు ప్రమాదానికి గురైన పంత్ కోలుకుంటున్న విషయం విదితమే. ఐసీసీ మెన్స్ టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్ 2022 1.ఉస్మాన్ ఖవాజా- ఆస్ట్రేలియా 2.క్రెయిగ్ బ్రాత్‌వెట్- వెస్టిండీస్ 3.మార్నస్ లబుషేన్- ఆస్ట్రేలియా 4.బాబర్ ఆజం- పాకిస్తాన్ 5.జానీ బెయిర్‌స్టో- ఇంగ్లండ్ 6.బెన్ స్టోక్స్- ఇంగ్లండ్ (కెప్టెన్) 7.రిషభ్ పంత్- ఇండియా(వికెట్ కీపర్) 8.ప్యాట్ కమిన్స్- ఆస్ట్రేలియా 9.కగిసో రబడ- సౌతాఫ్రికా 10.నాథన్ లియోన్- ఆస్ట్రేలియా 11.జేమ్స్ ఆండర్సన్- ఇంగ్లండ్. చదవండి: IND VS NZ 3rd ODI: 17 నెలల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. ఎట్టకేలకు సెంచరీ బాదిన హిట్‌మ్యాన్ ఐసీసీ అత్యుత్తమ వన్డే జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా బాబర్ ఆజం.. టీమిండియా నుంచి ఇద్దరే -
ఐసీసీ టెస్టు జట్టులో రోహిత్, పంత్, అశ్విన్.. కోహ్లికి దక్కని చోటు
ఐసీసీ టెస్టు జట్టు 2021లో టీమిండియా నుంచి ముగ్గురు ఆటగాళ్లకు చోటు దక్కింది. ఓపెనర్‌గా రోహిత్ శర్మ, వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్, స్పిన్నర్‌గా రవిచంద్రన్ అశ్విన్‌లు స్థానం సంపాదించగా.. ఇటీవలే టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలిగిన కోహ్లికి మాత్రం స్థానం దక్కలేదు.గతేడాది తొలిసారి నిర్వహించిన ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌లో న్యూజిలాండ్‌ను విజేతగా నిలిపిన కేన్ విలియమ్సన్కు కెప్టెన్‌గా అవకాశం దక్కగా... అదే మ్యాచ్‌లో బౌలింగ్‌లో మెరిసిన కైల్ జేమీసన్‌కు జట్టులో చోటు లభించింది. డబుల్ సెంచరీతో ఆకట్టుకున్న దిముత్ కరుణరత్నే(శ్రీలంక) రెండో ఓపెనర్‌గా.. ఆస్ట్రేలియాకు చెందిన మార్నస్ లబుషేన్, ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ మిడిలార్డర్లో.. పాకిస్తాన్ నుంచి పవాద్ ఆలమ్, షాహిన్ అఫ్రిది, హసన్ అలీలు చోటు దక్కించుకున్నారు. కాగా ఇప్పటికే ప్రకటించిన ఐసీసీ వన్డే, టి20 జట్టులో టీమిండియా నుంచి ఒక్క ఆటగాడికి కూడా చోటు దక్కలేదన్న సంగతి తెలిసిందే. ఐసీసీ పురుషుల టెస్టు జట్టు 2021: దిముత్ కరుణరత్నే (శ్రీలంక), రోహిత్ శర్మ (భారత్), కేన్ విలియమ్సన్ (కెప్టెన్, న్యూజిలాండ్), మార్నస్ లబుషేన్ (ఆస్ట్రేలియా), జో రూట్ (ఇంగ్లండ్), ఫవాద్ ఆలం (పాకిస్తాన్), రిషబ్ పంత్ ( భారత్), రవిచంద్రన్ అశ్విన్ (భారత్), కైల్ జేమీసన్ (న్యూజిలాండ్), షాహిన్ షా ఆఫ్రిది (పాకిస్థాన్), హసన్ అలీ (పాకిస్థాన్) ►ఇక ఐసీసీ టెస్టు జట్టులో ఓపెనర్‌గా చోటు దక్కించుకున్న రోహిత్ గతేడాది క్యాలెండర్ ఇయర్లో 47.68 సగటుతో 906 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. రోహిత్ సాధించిన రెండు సెంచరీల్లో ఒకటి స్వదేశంలో(చెన్నైలో), మరొకటి విదేశంలో(ఓవల్) వచ్చాయి. ఈ రెండు సందర్భాల్లో ఇంగ్లండ్ ప్రత్యర్థి కావడం విశేషం. ►టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్.. గతేడాది కాలంలో అన్ని ఫార్మాట్లలోనూ రెగ్యులర్ వికెట్ కీపర్‌గా మారిపోయాడు. 12 టెస్టుల్లో 748 పరుగులు సాధించిన పంత్‌కు ఒక సెంచరీ ఉంది. అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో సూపర్ సెంచరీతో మెరిశాడు. ఇక కీపర్‌గా 23 ఇన్నింగ్స్‌లో 39 డిస్మిసల్స్(స్టంపింగ్స్, క్యాచ్) చేశాడు. ►టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గతేడాది టెస్టుల్లో విశేషంగా రాణించాడు. 9 మ్యాచ్‌ల్లో 54 వికెట్లు తీసిన అశ్విన్.. స్వదేశంలో టీమిండియా ఇంగ్లండ్, న్యూజిలాండ్‌లపై టెస్టు సిరీస్‌లు గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. అంతేగాక బ్యాట్‌తోను 355 పరుగులు చేసిన అశ్విన్ ఖాతాలో ఒక టెస్టు సెంచరీ ఉండడం విశేషం. -
ఈ సారథ్యం నాకొద్దు!
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా సీనియర్ బ్యాట్స్‌మన్ ఫాఫ్ డు ప్లెసిస్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. తమ జట్టుకు ఇప్పుడు కొత్త తరం నాయకత్వం అత్యవసరమని వ్యాఖ్యానిస్తూ టెస్టు, టి20 జట్ల సారథ్యానికి బైబై చెప్పాడు. ఇంతకుముందు ఇంగ్లండ్‌తో సిరీస్ సమయంలో వన్డే జట్టు నాయకత్వం నుంచి డు ప్లెసిస్ తప్పుకోవడంతో వికెట్ కీపర్ డికాక్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు మిగిలిన రెండు ఫార్మాట్లకు కూడా అతను పగ్గాలు వదిలేశాడు. ‘ఇది కఠినమైన నిర్ణయం. కానీ... కొత్త తరానికి స్వాగతం పలుకుతున్నా. ఎప్పటిలాగే జట్టుకు పూర్తి నిబద్ధతతో సేవలందిస్తాను. కెప్టెన్ డికాక్, కోచ్ మార్క్ బౌచర్‌లకు పూర్తిగా సహకరిస్తాను. సఫారీ జట్టు పునర్నిర్మాణానికి, జట్టు పటిష్టంగా ఎదిగేందుకు ఆటగాడిగా నా వంతు కృషి చేస్తాను’ అని 35 ఏళ్ల డుప్లెసిస్ తెలిపాడు. ‘మిస్టర్ 360’ డిగ్రీ బ్యాట్స్‌మన్ డివిలియర్స్ వారసుడిగా 2017 ఆగస్టులో దక్షిణాఫ్రికా పగ్గాలు చేపట్టిన డు ప్లెసిస్‌కు 2019 వన్డే ప్రపంచకప్ పెద్ద గాయమే చేసింది. ఆ మెగా టోర్నీలో సఫారీ జట్టు పేలవ ప్రదర్శనతో గ్రూప్ దశలోనే వెనుదిరిగింది. త్వరలోనే దక్షిణాఫ్రికా జట్టు ఆసీస్‌తో మూడు టి20లు, మరో మూడు వన్డేల సిరీస్‌ల్లో తలపడనుంది. శుక్రవారం ఇరు జట్ల మధ్య తొలి టి20 జరుగనుంది. -
ధోనికి నో ఛాన్స్.. కోహ్లికే ఓటు
మెల్బోర్న్: టీమిండియా సారథి విరాట్ కోహ్లికి ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్ సముచిత స్థానాన్ని కల్పించాడు. ఈ దశాబ్దపు తన బెస్ట్ టెస్టు జట్టును పాంటింగ్ తాజాగా ప్రకటించాడు. అయితే ఈ జట్టుకు విరాట్ కోహ్లి నాయకత్వం వహించనున్నాడు. పదకొండు మంది సభ్యులతో కూడిన తన టెస్టు జట్టులో టీమిండియా నుంచి కోహ్లికి ఒక్కడికే పాంటింగ్ అవకాశం కల్పించాడు. సుదీర్ఘకాలంగా టెస్టుల్లో చాంపియన్‌గా కొనసాగుతున్న భారత్ నుంచి ఒక్కరికే అవకాశం ఇవ్వడం గమనార్హం. సారథిగా కాకపోయినా కనీసం వికెట్ కీపర్‌గా కూడా ఎంఎస్ ధోనిని పాంటింగ్ ఎంపిక చేయలేదు. వికెట్ కీపర్‌గా ధోనిని కాదని శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కరకు అవకాశం కల్పించాడు. జట్టులో స్పిన్నర్‌గా ఉపఖండపు స్పిన్నర్లను కాదని లియోన్‌ను ఎంపిక చేయడం అందరిలోనూ అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇక 11 మంది జాబితాలో ఇంగ్లండ్ నుంచి అత్యధికంగా నలుగురికి, ఆసీస్ నుంచి కేవలం ముగ్గురికే అవకాశం ఇచ్చాడు. ఓపెనర్లగా డేవిడ్ వార్నర్, అలిస్టర్ కుక్‌లను ఎంపిక చేశాడు. వన్‌డౌన్‌లో న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్, ఆ తర్వాతి వరుసగా స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లి, కుమార సంగక్కరలు మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు దిగుతారని పేర్కొన్నాడు. ఈ దశాబ్దపు బెస్ట్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అంటూ కితాబిస్తూ అతడికి జట్టులో చోటిచ్చాడు. ఇక ఇంగ్లండ్ పేస్ ద్వయం స్టువార్ట్ బ్రాడ్, అండర్సన్లవైపే పాంటింగ్ మొగ్గు చూపాడు. అంతేకాకుండా దక్షిణాఫ్రికా నుంచి డేల్ స్టెయిన్‌ను ఎంపిక చేశాడు. అయితే పాంటింగ్ టెస్టు జట్టుపై మాజీ క్రికెటర్లు పెదవి విరుస్తున్నారు. పక్షపాతంగా జట్టును ప్రకటించాడని విమర్శిస్తున్నారు. పాంటింగ్ టెస్టు జట్టు ఇదే విరాట్ కోహ్లి(సారథి), డేవిడ్ వార్నర్, అలిస్టర్ కుక్, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్, కుమార సంగక్కర, బెన్ స్టోక్స్, స్టువార్ట్ బ్రాడ్, డేల్ స్టెయిన్, జేమ్స్ అండర్సన్, నాథన్ లియోన్ చదవండి: కోహ్లితో టచ్‌లోనే ఉన్నాడుగా.. మంచు కొండల్లో విరుష్కల విహారం -
ప్రపంచకప్ ఎఫెక్ట్: రాయ్ తొలిసారి
లండన్ : ప్రపంచకప్-2019లో తన విధ్వంసకర ఆటతీరుతో విమర్శకులచే ప్రశంసలు అందుకున్నాడు ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జేసన్ రాయ్. అంతేకాకుండా ఇంగ్లండ్ జగజ్జేతగా నిలవడంలో రాయ్ కీలక పాత్ర పోషించాడు. ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేయడంతో రాయ్ తొలిసారి ఇంగ్లండ్ టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. బుధవారం ఐర్లాండ్‌తో జరగబోయే ఏకైక టెస్టు కోసం ప్రకటించిన జాబితాలో 28 ఏళ్ల రాయ్‌ను సెలక్టర్లు ఎంపిక చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. అన్నీ కుదిరితే ఐర్లాండ్‌పై టెస్టు అరంగేట్రం చేసే అవకాశం ఉంది. తొలి సారి ప్రపంచకప్ అందుకోవడంతో సంబరాల్లో మునిగితేలుతున్న ఇంగ్లండ్.. ఈ అపూర్వ విజయానికి యాషెస్ కూడా తోడుకావాలని భావిస్తోంది. దీంతో యాషెస్‌కు ముందు ఈ టెస్టును వార్మప్‌గా ఉపయోగించుకోవాలని ఇంగ్లండ్ ఆరాటపడుతోంది. దానిలో భాగంగా రాయ్ టెస్టు ప్రదర్శనను పరిశీలించాలని అనుకుంటున్నారు. ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్న ఈ టెస్టు మ్యాచ్‌కు బెన్ స్టోక్స్, జోస్ బట్లర్లకు సెలక్టర్లు విశ్రాంతినివ్వగా.. బౌలర్లు జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్‌లను పరిగణలోకి తీసుకోలేదు. ఇంగ్లండ్ టెస్టు జట్టు: జోయ్ రూట్(కెప్టెన్), మొయిన్ అలీ, జేమ్స్ అండర్సన్, బెయిర్ స్టో, స్టువార్ట్ బ్రాడ్, బర్న్స్, స్యామ్ కరన్, జోయ్ డెన్లీ, లూయిస్ గ్రెగొరీ, లీచ్, జేసన్ రాయ్, స్టోన్, క్రిస్ వోక్స్. -
కోహ్లినే సారథి.. పంత్‌కు భలే అవకాశం
సాక్షి, హైదరాబాద్: టీమిండియా యువ సంచలనం రిషబ్ పంత్ అరంగేట్ర ఏడాదే అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. గతేడాది టెస్టుల్లో ఇంగ్లండ్‌పై అరంగేట్రం చేసిన పంత్.. అటు కీపింగ్‌లోనూ ఇటు బ్యాటింగ్‌లోనూ అదరగొడుతున్న విషయం తెలిసిందే. దీంతో ‘ఐసీసీ టెస్టు టీమ్ ఆఫ్ ద ఇయర్ 2018’లో పంత్ చోటు దక్కించుకున్నాడు. 2018లో అత్యంత ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు ఐసీసీ టెస్టు జట్టులో చోటు కల్పించింది. దీనికి సంబంధించి ఐసీసీ అధికారిక ట్విటర్లో పోస్ట్ చేసింది. ఇక టెస్టు టీమ్ ఆఫ్ ద ఇయర్ 2018 జట్టుకు ఈ ఏడాది కూడా విరాట్ కోహ్లినే సారథిగా ఎంపికయ్యాడు. ఐసీసీ ప్రకటించిన టెస్టు జట్టులో మరో భారత ఆటగాడు జస్ప్రిత్ బుమ్రా చోటు దక్కించుకున్నాడు. కాగా టీమిండియా టెస్టు స్పెషలిస్టు బ్యాట్స్‌మన్ చటేశ్వర పుజారాకు అవకాశమివ్వకపోవడం గమనార్హం. టెస్టు జట్టులో టామ్ లాథమ్, కేన్ విలియమ్సన్, హెన్రీ నికోలస్(న్యూజిలాండ్), కరుణరత్నే (శ్రీలంక), కగిసో రబడా(దక్షిణాఫ్రికా), నాథన్ లియోన్(ఆస్ట్రేలియా), జాసన్ హోల్డర్(వెస్టిండీస్), మహ్మద్ అబ్బాస్(పాకిస్తాన్)లు చోటు దక్కించుకున్నారు. అయితే ఇంగ్లండ్ టెస్టు సారథి జోయ్ రూట్‌తో పాటు మరే ఇతర బ్రిటీష్ ఆటగాళ్లకు చోటు దక్కలేదు. ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా టెస్టు సిరీస్ గెలవడంలో కోహ్లి, పంత్, బుమ్రా, పుజారా కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. పరుగుల ప్రవాహాన్ని కొనసాగిస్తున్న కోహ్లి.. ఐసీసీ ప్రకటించిన తాజా టెస్టు రాంకింగ్స్‌లో నంబర్ వన్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. పుజారా మూడో స్థానంలో కొనసాగుతుండగా.. ఆసీస్‌పై చివరి టెస్టుల్లో శతక్కొట్టిన పంత్ టాప్-20లో చోటు దక్కించుకున్నాడు. వన్డేల్లోనూ కోహ్లినే కింగ్ ‘ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ 2018’కు కూడా విరాట్ కోహ్లినే కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఇక వన్డే జట్టులో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రాలు చోటు లభించింది. బెయిర్‌స్టో, జోయ్ రూట్, బట్లర్, బెన్ స్టోక్స్(ఇంగ్లండ్), రాస్ టేలర్ (న్యూజిలాండ్), ముస్తఫిజుర్ రహ్మాన్(బంగ్లాదేశ్), రషీద్ ఖాన్ (ఆఫ్గనిస్తాన్)లు ఐసీసీ వన్డే జట్టులో చోటు దక్కించుకున్నారు. It's time to reveal the ICC Test Team of the Year 2018! Press START to play! 🏏🎮 ➡️ https://t.co/ju3tzAxwc8#ICCAwards 🏆 pic.twitter.com/EowPQ14t2a — ICC (@ICC) 22 January 2019 Presenting the ICC Men's ODI Team of the Year 2018! 🏆 🇮🇳 @ImRo45 🏴 @jbairstow21 🇮🇳 @imVkohli (c) 🏴 @root66 🇳🇿 @RossLTaylor 🏴 @josbuttler (wk) 🏴 @benstokes38 🇧🇩 @Mustafiz90 🇦🇫 @rashidkhan_19 🇮🇳 @imkuldeep18 🇮🇳 @Jaspritbumrah93 ➡️ https://t.co/EaCjC7szqs#ICCAwards 🏆 pic.twitter.com/dg64VGuXiZ — ICC (@ICC) 22 January 2019 -
ఆసీస్ టెస్టు జట్టులో ఫించ్
సిడ్నీ: డాషింగ్ బ్యాట్స్‌మన్ ఆరోన్ ఫించ్ తొలిసారిగా ఆస్ట్రేలియా టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. టిమ్ పైన్ నేతృత్వంలోని ఆసీస్ జట్టు వచ్చే నెలలో పాకిస్తాన్‌తో రెండు టెస్టులాడనుంది. అక్టోబర్ 7 నుంచి దుబాయ్‌లో తొలి టెస్టు, 16 నుంచి అబు దాబిలో రెండో టెస్టు జరుగనుంది. ఇప్పటికే ఆసీస్ తరఫున 93 వన్డేలు, 42 టి20లు ఆడిన ఫించ్‌తోపాటు ఏకంగా ఐదుగురికి టెస్టుల్లో అరంగేట్రం అవకాశమిచ్చారు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) సెలక్టర్లు. ఇందులో ట్రెవిస్ హెడ్ కూడా ఉండగా, మిగతా ముగ్గురైతే పూర్తిగా కొత్త ముఖాలే. క్వీన్స్‌లాండ్‌కు చెందిన మైకేల్ నాసెర్, బ్రెండన్ డగెట్, మార్నస్ లబ్‌షేన్‌లు తొలిసారిగా జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. కీలక ఆటగాళ్లంతా దూరం కావడంతో ఏకంగా ఐదుగురిని కొత్తగా టెస్టు జట్టులోకి తీసుకున్నామని సీఏ సెలక్టర్ ట్రెవర్ హాన్స్ తెలిపారు. దక్షిణాఫ్రికాలో బాల్ ట్యాంపరింగ్ ఉదంతంలో అప్పటి కెప్టెన్ స్మిత్, ఓపెనర్లు వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌లపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ ముగ్గురు కీలక ఆటగాళ్లతో పాటు హజెల్‌వుడ్, కమిన్స్ గాయాలతో ఆటకు దూరమైన నేపథ్యంలో సగం జట్టు సభ్యులను కొత్తగా చేర్చాల్సి వచ్చింది. -
కోహ్లి వికెట్.. టెస్టుల్లో చోటు?
లండన్: ఎవరి తలరాతైనా మారడానికి ఒకే ఒక్క క్షణం చాలు. అదే విధంగా ఒక క్రికెటర్ వికెట్, క్యాచ్, ఆఖరికి ఒక్క పరుగు సాధించి కూడా హీరో అయిన సందర్భాలు అనేకం. నిదహాస్ ట్రోఫీలో బంగ్లాదేశ్‌తో జరిగిన పైనల్ మ్యాచ్‌లో వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ఆఖరి బంతికి సిక్స్ కొట్టి టీమిండియాకు కప్పు అందించి.. నమ్మదగిన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇలాంటి అనుభూతినే ఇంగ్లండ్ లెగ్ స్పిన్నర్ అదిల్ రషీద్ ఆస్వాదిస్తున్నాడు. టీమిండియాతో జరిగిన నిర్ణయాత్మకమైన మూడో మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ కైవసం చేసుకున్నవిషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో సాఫీగా సాగుతున్న భారత్ ఇన్నింగ్స్‌ను దెబ్బతీసింది అదిల్ రషీదే. జోరు మీదున్న టీమిండియా సారథి విరాట్ కోహ్లి ని అద్భుత బంతితో క్లీన్ బౌల్డ్ చేసి ఇన్నింగ్స్ స్వరూపాన్నే మార్చేశాడు. ఇదే ఇప్పుడు రషీద్ పాలిట అదృష్టంగా మారింది.. టెస్టుల్లో పునరాగమనానికి మార్గం సుగమం చేసింది. సుమారు రెండేళ్ల తర్వాత? అదిల్ రషీద్ ఇప్పటివరకు ఆడిన పది టెస్టుల్లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో ఇంగ్లండ్ సెలక్టర్లు టెస్టులకు ఈ ఆటగాడిని పక్కకు పెట్టి వన్డే, టీ20లకే పరిమితం చేశారు. ఈ లెగ్ స్పిన్నర్ ఆడిన చివరి టెస్టు 2016లో భారత్ పైనే. ఇప్పుడు సుమారు రెండు సంవత్సరాల తర్వాత టెస్టు జట్టులో చోటు దక్కే అవకాశం లభించింది. భారత్‌తో వన్డే సిరీస్‌లో రాణించడంతో సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఇంగ్లండ్‌కు టెస్టుల్లో సీనియర్ స్పిన్నర్ లేకపోవడం, వన్డేల్లో అదరగొట్టిన ఈ ముప్పై ఏళ్ల ఆటగాడిని టెస్టుల్లో ఎంపిక చేయాలనే ఆలోచనలో సెలక్టర్లు ఉన్నట్టు సమాచారం. తొలి లెగ్‌స్పిన్నర్.. స్పిన్ బౌలింగ్‌ను అవలీలగా ఎదుర్కొని పరుగులు సాధించే టీమిండియా సారథిని రషీద్ ఔట్ చేసి అరుదైన ఘనతన సాధించాడు. ఇప్పటివరకు లెగ్ స్పిన్నర్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లి క్లీన్‌బౌల్డ్ కాలేదు. ఇంగ్లండ్‌తో నిర్ణయాత్మకమైన మ్యాచ్‌లో కోహ్లిని రషీద్ క్లీన్‌బౌల్డ్ చేసి ఆ రికార్డును తుడిచిపాడేశాడు. చదవండి: ఆ బంతికి బిత్తరపోయిన కోహ్లి -
పార్థీవ్ అవుట్
న్యూఢిల్లీ:బంగ్లాదేశ్‌తో జరగబోయే ఏకైక టెస్టు మ్యాచ్‌కు సంబంధించి భారత వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్‌కు నిరాశే ఎదురైంది. మంగళవారం ప్రకటించిన 15 మంది సభ్యులతో కూడిన భారత టెస్టు జట్టులో పార్థీవ్ పటేల్ కు సెలక్టర్లు మొండి చేయి చూపించారు. ఇంగ్లండ్ తో జరిగిన టెస్టు సిరీస్‌లో పార్థీవ్ రాణించినప్పటికీ అతని తాజా ఎంపికపై సెలక్టర్లు మొగ్గు చూపలేదు. కాగా, తమిళనాడు ఆటగాడు అభినవ్ ముకుంద్‌కు అనూహ్యంగా చోటు దక్కింది. 2011 జూలై నెలలో ఇంగ్లండ్ తో జరిగిన టెస్టులో ముకుంద్ చివరిసారి ఆడాడు. ఇదిలా ఉండగా భారత జట్టులో మురళీ విజయ్, వృద్ధిమాన్ సాహాలు తిరిగి చోటు దక్కించుకున్నారు. గత కొన్ని రోజుల క్రితం గాయం కారణంగా జట్టుకు దూరమైన ఈ ఇద్దరూ ఫిట్నెస్ పరీక్షలో పాస్ కావడంతో వారికి స్థానం కల్పించారు. వచ్చే నెల తొమ్మిదో తేదీన ఇరు జట్ల మధ్య హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఏకైక టెస్టు మ్యాచ్ జరుగనుంది. భారత ఎంపిక చేసిన జట్టు ఇదే: విరాట్ కోహ్లి(కెప్టెన్), మురళీ విజయ్, కేఎల్ రాహుల్, అజింక్యా రహానే, కరుణ్ నాయర్, వృద్ధిమాన్ సాహా, అశ్విన్, రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, అమిత్ మిశ్రా, అభినవ్ ముకుంద్, హార్దిక్ పాండ్యా -
విరాట్‌కు స్థానం ఎందుకు దక్కలేదు?
దుబాయ్:విరాట్ కోహ్లి.. అసాధారణ ప్రతిభతో చెలరేగిపోతూ ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న భారత క్రికెటర్. ఒకే ఏడాది మూడు డబుల్ సెంచరీలు కొట్టి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రికెటర్‌గా గుర్తింపు సాధించాడు. గత కొంతకాలంగా మూడు ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తూ ప్రపంచ క్రికెట్లో సూపర్ మ్యాన్ అనిపించుకుంటున్న క్రికెటర్. ప్రస్తుతం విరాట్ శకం నడుస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే 2016 సంవత్సరానికి గాను గురువారం అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) విడుదల చేసిన టెస్టు జట్టులో కోహ్లికి స్థానం దక్కలేదు. ఐసీసీ వన్డే జట్టుకు కెప్టెన్ గా ఎంపికైన కోహ్లి.. టెస్టు జట్టులో మాత్రం కనీసం చోటు దక్కించుకోలేకపోయాడు. మరొకవైపు ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ మాత్రం టెస్టుల్లో స్థానం దక్కించుకోగా, కోహ్లికి మాత్రం ఆ జాబితాలో చోటు దక్కలేదు. ఇందుకు కారణం ఇరువురి ప్రదర్శనే కారణం. అయితే ఇక్కడ గమనించాల్సి విషయమేమిటంటే.. గతేడాది సెప్టెంబర్ 14 నుంచి మొదలుకొని 2016 సెప్టెంబర్ 20 వరకూ మాత్రమే ఆటగాళ్ల ప్రదర్శనను పరిగణలోకి తీసుకున్నారు. ఈ సమయంలో ఎనిమిది టెస్టు మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 45.10 సగటుతో 451 పరుగులు చేశాడు. ఈ 12 నెలల సమయంలో కోహ్లి కేవలం ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ మాత్రమే సాధించాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో కోహ్లి సెంచరీ, హాఫ్ సెంచరీలు మాత్రమే చేసి పెద్దగా ఆకట్టుకోలేదు. అదే సమయంలో రూట్ 14 టెస్టు మ్యాచ్‌లు ఆడి 55.30 సగటుతో 1272 పరుగులు నమోదు చేశాడు. ఇందులో 9 హాఫ్ సెంచరీలు, 2 సెంచరీలు ఉన్నాయి. దాంతో మాంచెస్టర్‌లో పాకిస్తాన్ తో జరిగిన టెస్టులో 254 పరుగులు చేసి ఆ ఏడాదిని(ఐసీసీ పరిగణలోకి తీసుకున్న జాబితా ప్రకారం) ఘనంగా ముగించాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే..ఈ ఏడాది సెప్టెంబర్ తరువాత విరాట్ కోహ్లి ఖాతాలో రెండు డబుల్ సెంచరీలు చేరాయి. న్యూజిలాండ్ తో తొలి టెస్టులో డబుల్ సెంచరీ చేసిన విరాట్.. ఇటీవల ఇంగ్లండ్ తో ముగిసిన ఐదు టెస్టుల సిరీస్‌లో కూడా ద్విశతకం సాధించాడు. ఈ క్రమంలోనే ఆ రెండు టెస్టు సిరీస్‌ల్లో 80.33 సగటుతో 964 పరుగులు చేశాడు. విరాట్ ఆడిన వరుసగా ఆడిన ఆరుటెస్టుల్లో రెండు డబుల్ సెంచరీలు సాధించడం ఇక్కడ విశేషం. ప్రస్తుతం ప్రపంచ టెస్టు ర్యాంకింగ్స్ లో కోహ్లి రెండో స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్, ఇంగ్లండ్ సిరీస్‌ల అనంతరం కోహ్లి ఏకంగా 12 స్థానాలకు పైగా మెరుగుపరుచుకుని రెండో స్థానానికి చేరడం అతని ప్రతిభకు అద్దం పడుతోంది. ఇదే ఫామ్‌ను విరాట్ కొనసాగిస్తే మాత్రం వచ్చే ఏడాది ఐసీసీ విడుదల చేసి టెస్టు జట్టులో విరాట్ ముందు వరుసలో ఉండటం ఖాయం. -
రైనాను టెస్టుల్లోకి రప్పించేందుకు ప్రయత్నిస్తా
టీమిండియా డెరైక్టర్ రవిశాస్త్రి ముంబై: సురేశ్ రైనాను తిరిగి టెస్టు జట్టులోకి రప్పించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని టీమిండియా డెరైక్టర్ రవిశాస్త్రి తెలిపారు. ‘రైనా క్రికెట్ ఆడుతుంటే చూడ్డానికి బావుంటుంది. అతడిని తిరిగి టెస్టుల్లోకి రప్పించేందుకు నేనేదైనా చేయాల్సి ఉంది. నెట్స్‌లో సాధన చేస్తున్నప్పుడు కూడా అతడు ఆడే షాట్లు వైవిధ్యంగా ఉంటాయి’ అని రవిశాస్త్రి చెప్పారు. 2012లో న్యూజిలాండ్‌తో రైనా చివరిసారిగా టెస్టు ఆడాడు. కుల్దీప్ యాదవ్‌లో నైపుణ్యం ఉందని, ఒకట్రెండేళ్లలో సరైన మార్గనిర్దేశనంతో మరింతగా రాటుదేల్చేందుకే జట్టులోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. నిలకడగా రాణించే ఆటగాళ్లపై సెలక్టర్ల దృష్టి ఉంటుందని సెహ్వాగ్‌ను ఉద్దేశించి అన్నారు. 2015 ప్రపంచకప్ సమయానికి ఆటగాళ్ల ఫామ్ ఆధారంగా ఆ మెగా టోర్నీ కోసం ఎంపిక ఉంటుందని చెప్పారు. వన్డేలు, టి20ల్లో ద్వైపాక్షిక సిరీస్‌లను తగ్గించుకుంటే బాగుంటుందని, టి20ల వల్ల క్రికెట్‌కు మేలు జరుగుతుందని అన్నారు.