
మెల్‌బోర్న్: టీమిండియా సారథి విరాట్ కోహ్లికి ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్ సముచిత స్థానాన్ని కల్పించాడు. ఈ దశాబ్దపు తన బెస్ట్ టెస్టు జట్టును పాంటింగ్ తాజాగా ప్రకటించాడు. అయితే ఈ జట్టుకు విరాట్ కోహ్లి నాయకత్వం వహించనున్నాడు. పదకొండు మంది సభ్యులతో కూడిన తన టెస్టు జట్టులో టీమిండియా నుంచి కోహ్లికి ఒక్కడికే పాంటింగ్ అవకాశం కల్పించాడు. సుదీర్ఘకాలంగా టెస్టుల్లో చాంపియన్‌గా కొనసాగుతున్న భారత్ నుంచి ఒక్కరికే అవకాశం ఇవ్వడం గమనార్హం. సారథిగా కాకపోయినా కనీసం వికెట్ కీపర్‌గా కూడా ఎంఎస్ ధోనిని పాంటింగ్ ఎంపిక చేయలేదు. వికెట్ కీపర్‌గా ధోనిని కాదని శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కరకు అవకాశం కల్పించాడు. జట్టులో స్పిన్నర్‌గా ఉపఖండపు స్పిన్నర్లను కాదని లియోన్‌ను ఎంపిక చేయడం అందరిలోనూ అనుమానాలను రేకెత్తిస్తోంది.
ఇక 11 మంది జాబితాలో ఇంగ్లండ్ నుంచి అత్యధికంగా నలుగురికి, ఆసీస్ నుంచి కేవలం ముగ్గురికే అవకాశం ఇచ్చాడు. ఓపెనర్లగా డేవిడ్ వార్నర్, అలిస్టర్ కుక్‌లను ఎంపిక చేశాడు. వన్‌డౌన్‌లో న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్, ఆ తర్వాతి వరుసగా స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లి, కుమార సంగక్కరలు మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగుతారని పేర్కొన్నాడు. ఈ దశాబ్దపు బెస్ట్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అంటూ కితాబిస్తూ అతడికి జట్టులో చోటిచ్చాడు. ఇక ఇంగ్లండ్ పేస్ ద్వయం స్టువార్ట్ బ్రాడ్, అండర్సన్‌లవైపే పాంటింగ్ మొగ్గు చూపాడు. అంతేకాకుండా దక్షిణాఫ్రికా నుంచి డేల్ స్టెయిన్‌ను ఎంపిక చేశాడు. అయితే పాంటింగ్ టెస్టు జట్టుపై మాజీ క్రికెటర్లు పెదవి విరుస్తున్నారు. పక్షపాతంగా జట్టును ప్రకటించాడని విమర్శిస్తున్నారు.
పాంటింగ్ టెస్టు జట్టు ఇదే
విరాట్ కోహ్లి(సారథి), డేవిడ్ వార్నర్, అలిస్టర్ కుక్, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్, కుమార సంగక్కర, బెన్ స్టోక్స్, స్టువార్ట్ బ్రాడ్, డేల్ స్టెయిన్, జేమ్స్ అండర్సన్, నాథన్ లియోన్
చదవండి:
కోహ్లితో టచ్‌లోనే ఉన్నాడుగా..
మంచు కొండల్లో విరుష్కల విహారం
Comments
Please login to add a commentAdd a comment