2023 అత్యుత్తమ టెస్ట్ జట్టును ఐసీసీ ఇవాళ (జనవరి 23) ప్రకటించింది. ఈ జట్టుకు సారధిగా ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఎంపిక కాగా.. టీమిండియా నుంచి ఇద్దరు ఆటగాళ్లకు చోటు లభించింది.
ఈ జట్టుకు ఓపెనర్లుగా ఆసీస్ ఆటగాడు ఉస్మాన్ ఖ్వాజా, శ్రీలంక ప్లేయర్ దిముత్ కరుణరత్నే ఎంపిక కాగా.. వన్ డౌన్ బ్యాటర్‌గా న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, నాలుగో స్థానంలో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్, ఐదో ప్లేస్‌లో ఆసీస్ ఆటగాడు ట్రవిస్ హెడ్, వికెట్‌కీపర్ బ్యాటర్‌గా ఆసీస్ ఆటగాడు అలెక్స్ క్యారీ, ఆల్‌రౌండర్ల కోటాలో భారత ఆటగాళ్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా ఆసీస్ సారధి పాట్ కమిన్స్, స్పెషలిస్ట్ పేసర్లుగా ఇంగ్లండ్ బౌలర్ మిచెల్ స్టార్క్, ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఎంపికయ్యారు.
ఈ జట్టులో రిటైర్డ్ ఆటగాడు స్టువర్ట్ బ్రాడ్‌కు చోటు లభించడం అనూహ్యం. జట్ల వారీగా చూస్తే.. ఆస్ట్రేలియా నుంచి అత్యధికంగా ఐదుగురు ఆటగాళ్లు ఎంపిక కాగా.. ఇంగ్లండ్ నుంచి ఇద్దరు, భారత్ నుంచి ఇద్దరు, శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల నుంచి చెరో ఆటగాడు ఎంపికయ్యాడు. భారత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు ఈ జట్టులో చోటు దక్కకపోవడం ఆసక్తికరం.
ఇదిలా ఉంటే, ఐసీసీ గతేడాది అత్యుత్తమ టెస్ట్ జట్టుతో పాటు వన్డే, టీ20 జట్లను కూడా ప్రకటించింది. ఒక్క ఆటగాడికి కూడా మూడు ఫార్మాట్ల జట్లలో చోటు లభించలేదు.
2023 ఐసీసీ టెస్ట్ జట్టు: ఉస్మాన్ ఖ్వాజా, దిముత్ కరుణరత్నే, కేన్ విలియమ్సన్, జో రూట్, ట్రవిస్ హెడ్, రవీంద్ర జడేజా, అలెక్స్ క్యారీ (వికెట్‌కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), రవిచంద్రన్ అశ్విన్, మిచెల్ స్టార్క్, స్టువర్ట్ బ్రాడ్
2023 ఐసీసీ వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ట్రవిస్ హెడ్, విరాట్ కోహ్లి, డారిల్ మిచెల్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్‌కీపర్), మార్కో జన్సెన్, ఆడమ్ జంపా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్
2023 ఐసీసీ టీ20 జట్టు: ఫిలిప్ సాల్ట్, యశస్వి జైస్వాల్, నికోలస్ పూరన్, మార్క్ చాప్‌మన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సికందర్ రజా, అల్పేష్ రంజనీ, మార్క్ అడైర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, రిచర్డ్ నగరవ
Comments
Please login to add a commentAdd a comment