రైనాను టెస్టుల్లోకి రప్పించేందుకు ప్రయత్నిస్తా
టీమిండియా డెరైక్టర్ రవిశాస్త్రి
ముంబై: సురేశ్ రైనాను తిరిగి టెస్టు జట్టులోకి రప్పించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని టీమిండియా డెరైక్టర్ రవిశాస్త్రి తెలిపారు. ‘రైనా క్రికెట్ ఆడుతుంటే చూడ్డానికి బావుంటుంది. అతడిని తిరిగి టెస్టుల్లోకి రప్పించేందుకు నేనేదైనా చేయాల్సి ఉంది. నెట్స్‌లో సాధన చేస్తున్నప్పుడు కూడా అతడు ఆడే షాట్లు వైవిధ్యంగా ఉంటాయి’ అని రవిశాస్త్రి చెప్పారు. 2012లో న్యూజిలాండ్‌తో రైనా చివరిసారిగా టెస్టు ఆడాడు. కుల్దీప్ యాదవ్‌లో నైపుణ్యం ఉందని, ఒకట్రెండేళ్లలో సరైన మార్గనిర్దేశనంతో మరింతగా రాటుదేల్చేందుకే జట్టులోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. నిలకడగా రాణించే ఆటగాళ్లపై సెలక్టర్ల దృష్టి ఉంటుందని సెహ్వాగ్‌ను ఉద్దేశించి అన్నారు. 2015 ప్రపంచకప్ సమయానికి ఆటగాళ్ల ఫామ్ ఆధారంగా ఆ మెగా టోర్నీ కోసం ఎంపిక ఉంటుందని చెప్పారు. వన్డేలు, టి20ల్లో ద్వైపాక్షిక సిరీస్‌లను తగ్గించుకుంటే బాగుంటుందని, టి20ల వల్ల క్రికెట్‌కు మేలు జరుగుతుందని అన్నారు.