
హైదరాబాద్: ఇంగ్లండ్ ఓపెనర్ జేసన్ రాయ్ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్ నుంచి తప్పుకున్న ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిషెల్ మార్ష్ స్థానంలో సన్‌రైజర్స్ జట్టు రాయ్‌ను ఎంచుకుంది. 2020 ఐపీఎల్ ఆడని రాయ్‌కు రైజర్స్ వేలంలో అతని కనీస ధర రూ. 2 కోట్లను చెల్లిస్తుంది. ఇటీవల భారత్‌తో జరిగిన టి20 సిరీస్‌లో రాయ్ 5 మ్యాచ్‌లలో 132.11 స్ట్రయిక్‌రేట్‌తో 144 పరుగులు...3 వన్డేల్లో 123.65 స్ట్రయిక్‌రేట్‌తో 115 పరుగులు చేశాడు.
ప్రస్తుత ఐపీఎల్ బయో సెక్యూర్ నిబంధనల ప్రకారం.. మార్ష్ ఏడు రోజుల క్వారంటైన్‌తో పాటు 50 రోజుల కఠిన బయో బబుల్‌లో ఉండాల్సి ఉంది. దీన్ని కష్టంగా భావించిన ఆయన లీగ్ నుంచి తప్పుకున్నాడు. మార్ష్.. యూఏఈ వేదికగా జరిగిన గత సీజన్‌లో తొలి మ్యాచ్‌లోనే గాయం కారణంగా లీగ్ నుంచి తప్పుకున్నాడు.ఏప్రిల్ 11న చెన్నై వేదికగా జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment