‘రాయ్‌.. నీ ఆట ఏమిటో చూస్తాం’ | We Will See How Roy Adapts To Test Cricket Hazlewood | Sakshi
Sakshi News home page

‘రాయ్‌.. నీ ఆట ఏమిటో చూస్తాం’

Jul 29 2019 1:02 PM | Updated on Jul 29 2019 1:05 PM

We Will See How Roy Adapts To Test Cricket Hazlewood - Sakshi

బర్మింగ్‌హామ్‌: ప్రత్యర్థి జట్లపై స్లెడ్జింగ్‌కు దిగడంలో ఆసీస్‌ క్రికెట్‌ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. ఏ జట్టులో అయతే స్టార్‌ ఆటగాళ్లు ఉంటారో వారే లక్ష్యంగా ఆసీస్‌ మాటల యుద్ధానికి దిగుతోంది. ఒక సిరీస్‌ ఆరంభానికి ముందు నుంచే ఆసీస్‌ స్లెడ్జింగ్‌కు పదును పెడుతుంది. మరో మూడు రోజుల్లో ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ ప్రారంభం కానున్న తరుణంలో ఆసీస్‌ తమ నోటికి పని చెప్పింది. టెస్టుల్లో ఇటీవలే అరంగేట్రం చేసిన ఇంగ్లండ్‌ స్టార్‌ ఆటగాడు జేసన్‌ రాయ్‌ను టార్గెట్‌ చేసింది. ఇందుకు తమ అస్త్రంగా తమ పేసర్‌ హజల్‌వుడ్‌ను ఉపయోగించింది. ‘ జేసన్‌ రాయ్‌.. టెస్టుల్లో నీ గేమ్‌ ఏమిటో మేమూ చూస్తాం. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఫామ్‌ను టెస్టుల్లో కొనసాగించాలంటే అంత ఈజీ కాదు. ఇప్పటివరకూ రాయ్‌ ఆడింది ఒకే ఒక్క టెస్టు మ్యాచ్‌. వన్డే గేమ్‌ తరహాలో టెస్టుల్లో ఓపెనింగ్‌ చేయడమంటే సవాల్‌. అందులోనూ మీ దేశంలో ఓపెనింగ్‌ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. టెస్టుల్లో నీ గేమ్‌ ఏమిటో చూపించడానికి సిద్ధంగా ఉండు. మా బౌలింగ్‌ వేడి ఏమిటో మేము చూపిస్తాం’ అని హజల్‌వుడ్‌ వార్నింగ్‌ ఇచ్చాడు.

కొన్ని రోజుల క్రితం ఐర్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌ ద్వారా జేసన్‌ రాయ్‌ ఈ ఫార్మాట్‌లో అరంగేట్రం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు పరుగులు చేసి నిరాశపరిచిన రాయ్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 72 పరుగులు చేసి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఆగస్టు 1 వ తేదీ నుంచి బర్మింగ్‌హామ్‌ వేదికగా యాషెస్‌ సిరీస్‌ ఆరంభం కానుంది. తొలి టెస్టుకు మాత్రమే జట్టును ఎంపిక చేసిన ఇంగ్లండ్‌..అందులో జేసన్‌ రాయ్‌కు అవకాశం కల్పించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement