గ్రెనిడా వేదికగా వెస్టిండీస్‌తో ఉత్కంఠ భరితంగా జరిగిన మూడో టీ20లో 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. దీంతో సిరీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. 223 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లీష్ జట్టు 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అయితే ఆఖరి ఓవర్‌లో ఇంగ్లండ్ విజయానికి 21 పరుగులు అవసరమయ్యాయి. విండీస్ కెప్టెన్ పావెల్ బంతిని సీనియర్ ఆండ్రీ రస్సెల్‌ను బంతిని అందించాడు.
అయితే స్ట్రైక్‌లో ఉన్న హ్యారీ బ్రూక్ తొలి బంతినే బౌండరీగా మలిచాడు. అనంతరం రెండు, మూడు బంతులను సిక్స్‌లు బాది మ్యాచ్‌ను ఇంగ్లండ్ వైపు మలుపు తిప్పాడు. ఈ క్రమంలో చివరి మూడు బంతుల్లో 5 పరుగులు అవసరమవ్వగా.. బ్రూక్ ఐదో బంతికి సిక్స్ బాది ఇంగ్లండ్‌కు అద్భుతమైన విజయాన్ని అందించాడు.
ఇంగ్లండ్ బ్యాటర్లలో బ్రూక్‌తో పాటు ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఆజేయశతకంతో చెలరేగాడు. 56 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్స్‌లతో 109 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కెప్టెన్ జోస్ బట్లర్ కూడా(51) హాఫ్ సెంచరీతో రాణించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
విండీస్ బ్యాటర్లలో పూరన్(82) పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కుర్రాన్, అదిల్ రషీద్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 డిసెంబర్ 19న జరగనుంది.
చదవండి: రింకూ సిక్సర్ సింగ్
Comments
Please login to add a commentAdd a comment