రిటైరయినందుకు బాధపడను: ధోనీ
వెస్టిండీస్‌తో నేటి(గురువారం) నుంచి ప్రారంభమయ్యే నాలుగు టెస్టుల సిరీస్‌లో స్పిన్నర్లు కీలకపాత్ర పోషిస్తారని భారత పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అభిప్రాయపడ్డాడు. కరీబియన్ గడ్డపై మందకొడి పిచ్‌ల దృష్ట్యా జట్టులో స్పిన్నర్లు చాలా కీలకం కానున్నారని తెలిపాడు. భారత జట్టులో పేసర్లు విరివిగా అందుబాటులో ఉండడంపై ధోని అనందం వ్యక్తం చేశాడు.
టెస్టుల నుంచి తాను వైదొలగినందుకు(రిటైర్మెంట్) చింతించడం లేదని పేర్కొన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియాకు తన సేవలు కొనసాగుతున్నాయని చెప్పాడు. గతంలో టెస్టులు, వన్డేలు, టీ20లు అంటూ అన్ని ఫార్మాట్ల మ్యాచ్ లతో బిజీబిజీగా ఉండేవాడిని. అయితే టెస్టులకు గుడ్ బై చెప్పినందున ప్రస్తుతం టెస్ట్ సిరీస్ జరుగుతున్న సమయంలో కుటుంబంతో గడపడంతో పాటు తన ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తున్నట్లు ఎంఎస్ ధోని తెలిపాడు.