ఒకప్పటి మేటి జట్టు వెస్టిండీస్.. టెస్ట్‌ల్లో టీమిండియాపై విజయం సాధించి రెండు దశాబ్దాలు దాటిపోయిందంటే ఎవరైనా నమ్మగలరా..? నమ్మినా, నమ్మకపోయినా ఇది నిజం. విండీస్ జట్టు చివరిసారిగా 2002లో జమైకాలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియాపై గెలుపొందింది. అప్పటి నుంచి 21 సంవత్సరాలుగా విండీస్‌కు టీమిండియాపై గెలుపే లేదు.
విండీస్‌తో రేపటి నుంచి (జులై 12) తొలి టెస్ట్ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. మరి 21 సంవత్సరాల తర్వాతైనా విండీస్.. టీమిండియాపై గెలుస్తుందా అంటే..? అసంభవమనే చెప్పాలి. ప్రస్తుత భారత జట్టుకు విండీస్ కనీస పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌్‌కప్ క్వాలిఫయర్స్‌లో ఆ జట్టు దయనీయ పరిస్థితిని అందరం చూశాం.
అయితే ముఖాముఖి రికార్డుల్లో మాత్రం భారత్‌పై విండీస్‌దే పై చేయిగా ఉంది. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య జరిగిన 98 మ్యాచ్‌ల్లో.. విండీస్ 30 గెలిస్తే, భారత్ 22 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయాలు సాధించింది. 46 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.
జట్ల వివరాలు..
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానె, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శ్రీకర్ భరత్, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, జయ్‌దేవ్ ఉనద్కత్, నవ్‌దీప్ సైని, ముఖేశ్ కుమార్.
వెస్టిండీస్: క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (వైస్ కెప్టెన్), అలిక్ అథనేజ్, త్యాగ్‌నారాయణ్ చంద్రపాల్, రఖీమ్ కార్న్‌వాల్, జోష్వా ద సిల్వా, షనోన్ గాబ్రియల్, జేసన్ హోల్డర్, అల్జారి జోసెఫ్, కిర్క్ మెకంజీ, రేమన్ రీఫర్, కీమర్ రోచ్, జోమెల్ వారికన్
రిజర్వ్ ఆటగాళ్లు: టెవిన్ ఇమ్లాచ్, అకీమ్ జోర్డాన్
Comments
Please login to add a commentAdd a comment