
సాక్షి, న్యూఢిల్లీ : కెరీర్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి రోహిత్ శర్మ, కోచ్ రవిశాస్త్రి అండగా నిలిచారు. ధోనిని విమర్శిస్తున్న మాజీ క్రికెటర్లకు కనువిప్పు కలిగేలా సమాధానం చెప్పారు. తొలుత రోహిత్ శర్మ స్పందిస్తూ..
‘ధోనిపై వస్తున్న విమర్శలు మేం పట్టించుకోం. ఆయన 2019 ప్రపంచ కప్ ధోని ఆడతాడా? అంటూ కొంతమందికి వస్తున్న సందేహాలు మమ్మల్ని విస్మయానికి గురిచేస్తున్నాయి. ధోని మంచి ఫామ్‌లోనే ఉన్నారు. ఆ విషయంలో ఎవరికీ సంకోచం అక్కర్లేదు. 4, 6 స్థానాల్లో ధోనికి అసలు వచ్చే బంతులే తక్కువ. దాంతో ఆయనకు పెద్దగా ఆడే అవకాశమే ఉండదు’ అని అన్నారు. మరోపక్క, రవిశాస్త్రి కూడా ధోనిని సమర్థిస్తూ .. ‘ధోనిపై విమర్శలు చేస్తున్నవారు.. తామూ ఆటగాళ్ళమే అని మరిచిపోవద్దు. 36 ఏళ్ల వయసులో వారైతే ఏం చేసేవారో ఆలోచించుకోవాలి’ అని ఆయన ఘాటుగా స్పందించాడు. గత నెలలో న్యూజిలాండ్‌తో జరిగిన టి-20లో 49 బంతుల్లో 37 పరుగులే చేసి టీమిండియా ఓటమికి కారణమయ్యాడంటూ ధోని పై తీవ్ర విమర్శలు రాగా ఆ సమయంలో విరాట్ కోహ్లి మాజీ కెప్టెన్‌కు పూర్తి మద్దతిచ్చిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment