Ravi Shastri as head coach for Ahmedabad team: టీ20 ప్రపంచకప్-2021 తర్వాత భారత ప్రధాన కోచ్ రవిశాస్త్రి తన బాధ్యతల నుంచి తప్పుకోనున్న సంగతి తెలిసిందే. తనతో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ కూడా తప్పుకోనున్నారు. ఈ క్రమంలో టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌ను బీసీసీఐ నియమించింది. అయితే వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్‌లో కొత్త జట్టుగా అవతరించిన అహ్మదాబాద్.. తమ జట్టు హెడ్ కోచ్‌గా రవిశాస్త్రిని నియమించుకోవాలి అని భావిస్తోంది.
ఇప్పటికే రవిశాస్త్రిని ఈ విషయంపై సంప్రదించునట్లు సమాచారం. అతడు నిర్ణయం తీసుకోవడానికి కాస్త సమయం కోరినట్లు తెలుస్తోంది. అయితే బీసీసీఐ ఐపీఎల్‌లో కొత్త జట్టులకు నిర్వహించిన వేలంలో అహ్మదాబాద్ ఫ్రాంచైజీను సీవిసీ క్యాపిటల్ 5600 కోట్లకు కైవసం చేసుకుంది. ఆదేవిధంగా లక్నో ఫ్రాంచైజీని సంజీవ్ గోయెంకా గ్రూప్ 7090 కోట్లకు దక్కించుకుంది. మరోవైపు ఆటగాళ్ల మెగా వేలం డిసెంబర్ లో బీసీసీఐ నిర్వహించనుంది.
చదవండి: T20 WC 2021 AUS Vs WI: చెలరేగిన వార్నర్, మార్ష్.. విండీస్‌పై ఆసీస్ ఘన విజయం
Comments
Please login to add a commentAdd a comment