పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత జట్టు వైస్ కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అదే విధంగా రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హజరీలో పాండ్యానే టీమిండియాకు సారధ్యం వహిస్తున్నాడు. టీ20ల్లో అయితే గత కొన్ని సిరీస్‌ల నుంచి నాయకత్వం వహిస్తున్న హార్దిక్.. జట్టును విజయ పథంలో నడిపిస్తున్నాడు.
ఐపీఎల్‌లో కూడా కెప్టెన్‌గా హార్దిక్ విజయవంతమయ్యాడు. ఈ క్రమంలో ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ తర్వాత వైట్‌బాల్ క్రికెట్‌లో రోహిత్ శర్మను తప్పించి టీమిండియా పూర్తి స్థాయి కెప్టెన్‌గా హార్దిక్‌ను నియమించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు సమాచారం. రోహిత్‌ను కేవలం టెస్టుల్లో మాత్రమే కొనసాగించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు భారత క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.
కాగా రోహిత్ భారత జట్టు పగ్గాలు చేపట్టాక...వరుసగా ఆసియాకప్, టీ20 ప్రపంచకప్-2022, డబ్ల్యూటీసీ ఫైనల్లో ఘోర ఓటములను చవిచూసింది. ఈ క్రమంలో రోహిత్‌ను తప్పించి మరోక ఆటగాడికి జట్టు పగ్గాలు అప్పజెప్పాలని చాలా మంది మాజీలు బీసీసీఐకి సూచిస్తున్నారు. ఇక తాజాగా ఇదే విషయంపై భారత దిగ్గజ క్రికెటర్ రవిశాస్త్రి తన అభిప్రాయాలను వెల్లడించాడు.
"వన్డే ప్రపంచకప్ తర్వాత వైట్-బాల్ క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్సీని హార్దిక్ పాండ్యా చేపట్టాలని నేను భావిస్తున్నాను. ప్రపంచకప్‌లో మాత్రం భారత్ జట్టుకు రోహిత్ శర్మనే నాయకత్వం వహించాలి. రోహిత్ కూడా అద్భుతమైన లీడర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ మూడు ఫార్మాట్‌లలో జట్టును నడిపించడం అంత సులభం కాదు. ఒత్తడి ఎక్కువగా ఉంటుంది. అది అతడి వ్యక్తిగత ప్రదర్శనపై ప్రభావం చూపిస్తోంది" అని ది వీక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
చదవండి: IND vs WI: భారత జట్టులో నో ఛాన్స్.. సెలక్టర్లకు కౌంటర్ ఇచ్చిన సర్ఫరాజ్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment