
బ్యాటింగ్ తీరు మెరుగుపడాలి: రవిశాస్త్రి
సొంతగడ్డపై జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్ 3-0తో ప్రపంచ నంబర్‌వన్ జట్టు దక్షిణాఫ్రికాను ఓడించినప్పటికీ... స్పిన్ పిచ్‌లపై భారత బ్యాట్స్‌మెన్ ఆటతీరు ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. ఏడాది కాలంలోనే విరాట్ కోహ్లి మంచి నాయకుడిగా ఎదిగాడని ఆయన ప్రశంసించారు. క్రమం తప్పకుండా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఉంటున్నందున భారత జాతీయ జట్టు సభ్యులు దేశవాళీ టోర్నమెంట్‌లలో ఆడలేకపోతున్నారని ఆయన అన్నారు.