Improvement
-
కోవిడ్ తర్వాత పెరిగిన పర్యాటకరంగ ఉపాధి!
కోవిడ్ మహమ్మారి తగ్గుముఖం పట్టాక దేశంలో పర్యాటకరంగంలో ఉపాధి అవకాశాలు విపరీతంగా పెరిగాయి. 2033 నాటికి అంటే రాబోయే తొమ్మిదేళ్లలో ట్రావెల్ అండ్ టూరిజం రంగంలో దేశంలో 5.82 కోట్ల మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. కరోనా సమయంలో అంటే 2020లో పర్యాటక రంగంలో 3.9 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇది దేశంలోని మొత్తం ఉపాధిలో 8 శాతం.తాజాగా ఎన్ఎల్బి సర్వీసెస్ నివేదిక ప్రకారం మహమ్మారి నుండి కోలుకున్న తర్వాత పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందింది. ఈ రంగం 2023 క్యాలెండర్ సంవత్సరంలో 16 లక్షల అదనపు ఉద్యోగాలను అందించింది. జనవరి 2023 నుండి ప్రయాణ, పర్యాటక రంగంలో రోజువారీ వేతన ఉద్యోగాలు 14 శాతం మేరకు పెరిగాయి. అనువాదకులు, ఫోటోగ్రాఫర్లు, టూర్ గైడ్లకు ఉద్యోగావకాశాలు ఏర్పడ్డాయి. వచ్చే రెండేళ్లలో పర్యాటక రంగంలో ఉద్యోగాలు 20 శాతం మేరకు పెరుగుతాయని అంచనా.ఎన్ఎల్బి సర్వీసెస్ నివేదికలోని డేటా ప్రకారం పర్యాటక రంగం 2022లో భారతదేశ జీడీపీకి 15.9 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని అందించింది. అదే సమయంలో ఇది విదేశీ మారకద్రవ్యానికి ముఖ్య వనరుగా నిలిచింది. ఎన్ఎల్బి సర్వీసెస్ సీఈఓ సచిన్ అలగ్ మీడియాతో మాట్లాడుతూ పర్యాటకరంగంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణె, కొచ్చి, జైపూర్, అహ్మదాబాద్, చండీగఢ్‌లో ఉపాధి అవకాశాలు మరింతగా పెరిగాయి.పర్యాటకరంగంలో సేల్స్ లో18 శాతం, బిజినెస్ డెవలప్మెంట్లో 17 శాతం, చెఫ్ విభాగంలో15 శాతం, ట్రావెల్ కన్సల్టెంట్లో 15 శాతం మేరకు ఉపాధి పెరగవచ్చనే అంచనాలున్నాయి. అలాగే టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లు, హోటళ్లు, గైడ్లు , వన్యప్రాణి నిపుణులకు కూడా మంచి డిమాండ్ ఏర్పడే అవకాశాలున్నాయి. -
భారత్ బ్యాంకింగ్ పటిష్టమవుతోంది: ఫిచ్
న్యూఢిల్లీ: కోవిడ్ తీవ్రత తగ్గుముఖం పట్టడంతో భారతీయ బ్యాంకుల నిర్వహణా పరిస్థితులు గణనీయంగా మెరుగుపడుతున్నట్లు రేటింగ్ ఏజెన్సీ– ఫిచ్ తన తాజా ప్రకటనలో పేర్కొంది. బ్యాంకింగ్‌కు సంబంధించి పలు సూచీలు కోవిడ్ ముందుస్తు పరిస్థితులకన్నాసైతం ముందంజలో ఉన్నట్లు వివరించింది. కొన్ని రంగాల విషయంలో బ్యాంకుల రుణ బకాయిలూ తగ్గుతున్నట్లు తెలిపింది. ‘ఆరి్థక వ్యవస్థ భారీ పరిమాణం, డిమాండ్ పరిస్థితులు లాభదాయకమైన వ్యాపారాన్ని సృష్టించడానికి అలాగే ఆదాయాలు పెరగడానికి, ఇబ్బందులను తగ్గించడానికి బ్యాంకింగ్‌కు మరిన్ని అవకాశాలను అందించాల్సి ఉంది’’ కూడా ఫిచ్ పేర్కొంది. -
పట్టణాలకు ప్రత్యేక బస్సులు!
సాక్షి, హైదరాబాద్: ఇక పట్టణాల్లో అద్దె బస్సులు రాజ్యమేలబోతున్నాయి. నగరాలు, పట్టణాల్లో ప్రజా రవాణా భారీ నష్టాలతో ఆర్టీసీ కుదేలవుతున్న వేళ.. వాటిని పూడ్చేందుకు కేంద్రం ఓ అడుగు ముందుకేసింది. ప్రపంచ బ్యాంకు చేయూతతో ప్రత్యేక ప్రాజెక్టును తెస్తోంది. ఇందులో భాగంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రధాన పట్టణాల మధ్య అద్దె బస్సులను భారీగా తిప్పేందుకు వీలుగా రంగం సిద్ధం చేస్తోంది. వీటి నిర్వహణతో వచ్చే నష్టాలను ఐదేళ్లపాటు భరించేందుకు సమాయత్తమైంది. ఈలోపు వాటి నష్టాలను పూడ్చుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఐదేళ్ల కాలానికి గాను రూ.75 వేల కోట్లను ఇందు కోసం ఖర్చు చేయనున్నారు. ఈ మొత్తాన్ని ఆయా రాష్ట్రాల డిమాండ్ ఆధారంగా పంచుతారు. ప్రాజెక్టులో భాగస్వామ్యం అయ్యేందుకు ఉన్న సంసిద్ధతను తెలపాల్సిందిగా కేంద్ర ఉపరితల రవాణా శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం ఓకే అంటే అందులో భాగస్వామ్యం ఉంటుంది. పట్టణ ప్రాంతంలో ప్రత్యేకంగా తిప్పే బస్సుల నిర్వహణతో వచ్చే నష్టాలతో పాటు, వాటి నిర్వహణకు సంబంధించిన మౌలిక వసతుల కల్పనకు అయ్యే వ్యయంలో సగభాగాన్ని భరించేందుకు వీలుగా గ్రాంట్లు అందించనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా వచ్చే బస్సులన్నీ ఆర్టీసీ సొంత బస్సులుగా కాకుండా పూర్తిగా అద్దె ప్రాతిపదికన ప్రైవేటు ఆపరేటర్లే నిర్వహించనున్నారు. వెరసి ప్రజా రవాణా సంస్థలో అద్దె బస్సుల హవా మరింతగా పెరగనుంది. ప్రపంచ బ్యాంకు సాంకేతిక సహకారంతో.. ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ అత్యంత వేగంగా పెరుగుతోంది. కానీ, పెరుగుతున్న జనాభాకు వీలుగా ఆయా ప్రాంతాల్లో ప్రజా రవాణా విస్తరించటం లేదని ప్రపంచ బ్యాంకు ప్రత్యేక అధ్యయనాలతో తేల్చింది. దీన్ని మార్చాలంటే పట్టణ ప్రాంతాల్లో ప్రజా రవాణాను బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మన దేశంతో కూడా అవగాహనకు వచ్చింది. కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఆధ్వర్యంలో ఈ బృహత్ ప్రాజెక్టును చేపట్టబోతోంది. ఇందుకు సంబంధించి తన వంతుగా సాంకేతిక సహకారాన్ని ఉచితంగా అందించటంతో పాటు కేంద్రానికి అవసరమైన కొంత ఆర్థిక చేయూతను అందించేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు వచ్చే ఐదేళ్లలో పట్టణ ప్రజా రవాణా రూపురేఖలు మార్చాలన్నది ప్రణాళిక. ఇందుకు ఐదేళ్ల కాలానికి రూ.75 వేల కోట్లు ఖర్చవుతాయని ఓ అంచనా. దీనికి కేంద్రం కూడా సానుకూలంగా ఉండి, రాష్ట్ర ప్రభుత్వాలను భాగస్వాములు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి తాజాగా ఢిల్లీలో ప్రపంచ బ్యాంకు ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ ప్రాజెక్టు వివరాలు వెల్లడించింది. ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేసేందుకు మహారాష్ట్ర, ఏపీలను ఎంపిక చేసి, మిగతా రాష్ట్రాలు సమ్మతిని తెలపాల్సిందిగా కేంద్రం కోరింది. ప్రాజెక్టులో చేరేందుకు ఉన్న అభ్యంతరాలను తెలపాల్సిందిగా సూచించింది. ఈ సమావేశానికి టీఎస్ఆర్టీసీ తరుఫున పలువురు హాజరయ్యారు. దీనిపై కేంద్రానికి తుది నిర్ణయం వెల్లడించాల్సి ఉంది. పదేళ్లు భరించాలి.. ఈ సమావేశంలో పేర్కొన్న వయబిలీటీ గ్యాప్ ఫండ్‌ను ఐదేళ్లు కాకుండా పదేళ్లు భరించాలని సమావేశంలో వివిధ రాష్ట్రాల ప్రతినిధులు కోరారు. దీనిపై ఇంకా కేంద్రం నిర్ణయం తీసుకోలేదు. ఇక బస్సులను కూడా తమ ప్రాంతాలకు సూటయ్యే వాటిని తామే సమకూర్చుకునే వెసులుబాటు కల్పించాలని కూడా కోరారు. గతంలో జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద నాసిరకమైన బస్సులు సరఫరా కావటంతో అవి కేవలం మూడేళ్లకే పాడై ఆ తర్వాత భారీ నష్టాలు మూటగట్టినట్టు వారు కేంద్రం దృష్టికి తెచ్చారు. అందుకోసం నాణ్యమైన బస్సులను తామే సమకూర్చుకుంటామని, అందుకయ్యే వ్యయాన్ని కేంద్రం భరించాలని కోరారు. దీనిపై కేంద్రం నిర్ణయం తెలపాల్సి ఉంది. -
చెక్‌డ్యాంలతో సత్ఫలితాలు
సాక్షి, బాలానగర్: మండలంలోని గుండేడ్–బాలానగర్, మాచారం – నందారం, పెద్దాయపల్లి–బోడజానంపేట, కేతిరెడ్డిపల్లి గ్రామాల శివారులోని దుందుబీ వాగుపై నిర్మించిన చెక్‌డ్యాంల నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వచ్చాయి. దీంతో రానున్న రోజుల్లో వర్షాలు పడితే చెక్‌డ్యాం లు నిండి పరిసర గ్రామాల్లో నీటి కష్టాలు తీరను న్నాయి. ఏళ్లుగా గ్రామాల్లో నీటికష్టాలు మిన్నంటి నా గతంలో దుందుబీ నదిపై నిర్మించిన చెక్‌డ్యాం లు సత్ఫలితాలు ఇస్తున్నాయి. దీంతో మరిన్ని చెక్‌డ్యాంల నిర్మాణానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రత్యేక చొరవతో మండలంలోని గుండేడ్ శివారులో రూ.కోటి 4 లక్షలతో రెండు, బోడాజానంపేట శివారులో రూ.29 లక్షలతో మరొకటి మొత్తం మూడు చెక్‌డ్యాంలు నిర్మించడానికి నిధులు మంజూరు చేసి పనులు పూర్తిచేశారు. ప్రస్తుత చెక్‌డ్యాంలు సత్ఫలితాలు మండల కేంద్రంతోపాటు, పెద్దాయపల్లి, గౌతా పూర్ శివారులో ఏర్పాటు చేసిన చెక్‌డ్యాంలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. గత వర్షాకాలంలో చెక్‌డ్యాంలు నిండి భూగర్భజలాలు పెరిగి వ్యవసా య బోర్లలో నీరు సంవృద్ధిగా లభించింది. వ్యవసాయ బోర్లలో నీరు సంవృద్ధిగా లభ్యమై బోరు మోటార్లు కాలిపోయే పరిస్థితి తప్పుతుంది. అంతేకాకుండా గతేడాదితో పోల్చితే తాగునీటి సమస్య పెద్దగా రాలేదు. పశువులకు తాగునీరు కొరత లేకపోవడమే కాకుండా సాగు విస్తీర్ణం పెరిగింది. గ్రామాలకు ప్రయోజనాలు మండలంలోని గుండేడ్, బోడజానంపేట శివారులో దుందుబీ నదిపై నిర్మిస్తున్న చెక్‌డ్యాంల నిర్మాణం పూర్తయితే చెక్‌డ్యాంల పరిసర గ్రామాలైన మాచారం, నందారం, గుండేడ్, బాలానగర్, చెన్నంగులగడ్డ తండా, పెద్దాయపల్లి, గౌతాపూర్, సేరిగూడ, బోడజానంపేట, గాలిగూడ గ్రామాలకు ప్రయోజనం లభించనుంది. ఆయా గ్రామాల శివారులలో భూగర్భజలాలు పెరిగి తాగునీటితోపాటు, వ్యవసాయానికి సైతం నీరు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. -
మెరుగైన పోలీసింగ్‌కు కృషి: డీజీపీ
నిజామాబాద్: వ్యక్తుల హోదాతో సంబంధం లేకుండా ప్రజలకు నాణ్యమైన సేవలందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మెరుగైన పోలీసింగ్ విషయంపై అధికారులతో సమీక్షించామని, రాష్ట్రవ్యాప్తంగా ఒకే తరహా సేవలు అందించేందుకు కృషిచేస్తున్నామని చెప్పారు. ఈమేరకు అధికారులతో సమీక్ష చేశామన్నారు. ఒకేతరహా పోలీసింగ్, సాంకేతికత, నైపుణ్యాలు మెరుగుపర్చుకోవడం వంటి అంశాలపై చర్చించామని చెప్పారు. వచ్చే ఆరు నెలల్లో పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఒకే తరహా సేవలు అందిస్తామని ఆయన తెలిపారు. సాంకేతికతను వాడటం, పని పద్దతుల్లో మార్పు, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడంపై దృష్టి సారిస్తామని, ప్రజల సహకారంతో నాణ్యమైన పోలీసింగ్‌కు కృషిచేస్తామని, అన్ని ప్రభుత్వ శాఖలతో కలిసి పనిచేస్తామని వివరించారు. జిల్లా పోలీసు యంత్రాంగం మంచి పనితీరు కనబరుస్తున్నదని డీజీపీ కితాబు ఇచ్చారు. -
విద్యార్థి సంపూర్ణ వికాసమే కీలకం
గణితంపై భయాన్ని తొలగించాలి పదోతరగతిలో మెరుగైన ప్రమాణాలు సాధించాలి మౌలిక వసతులను ఏర్పాటు చేసుకోవాలి ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశంలో కలెక్టర్ లోకేష్‌కుమార్ ఖమ్మం: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల సంపూర్ణ వికాసాభివృద్ధే కీలకంగా ప్రధానోపాధ్యాయులు ముందుకెళ్లాలని కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ కోరారు. పదో తరగతి ఫలితాలు, పాఠశాలల్లో మౌలిక వసతులు తదితరాంశాలపై జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో నగరంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనిని జెడ్పీ చైర్పర్సన్ కవిత జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాలల్లో తప్పనిసరిగా టాయిలెట్స్ ఉండాలన్నారు. అసంపూర్తిగా ఉన్నవాటిని పూర్తిచేయాలన్నారు. మరో 870 పాఠశాలల్లో టాయిలెట్స్‌ను ఎన్‌ఆర్‌ఐఈజీఎస్ ద్వారా నిర్మించుకోవాలన్నారు. పాఠశాల పరిశుభ్రత కోసం విద్యాకమిటీ చైర్మన్‌తో సమన్వయం చేసుకుని వర్కర్లను నియమించుకోవాలని సూచించారు. పాఠశాలలన్నీ పచ్చగా ఉండేలా చెట్లు పెంచాలని, పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ప్రతి పాఠశాలకు తాగునీరు, రన్నింగ్‌వాటర్ కోసం మిషన్ భగీరథ పథకంలో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాలను వెంటనే కూల్చివేసేందుకు జిల్లాపరిషత్ నుంచి త్వరలో అనుమతుల వస్తాయన్నారు. జిల్లాలో జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ‘‘ప్రభుత్వ పాఠశాలలంటే.. వాటిలో ఎస్సీ, ఎస్టీ, పేద విద్యార్థులే చదువుతారనే పేరుంది. దీనిని తొలగించేందుకు ప్రధానోపాధ్యాయులు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరముంది’’ అని అన్నారు. గత సంవత్సరం పదోతరగతి పరీక్షల్లో అత్యధికమంది విద్యార్థులు గణితంలోనే ఫెయిలవుతుండడంపై విచారం వ్యక్తం చేశారు. దీనిని అధిగమించేందుకు, గణితంపై భయం తొలగేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. మాతృభాష తెలుగులో కూడా కొందరు ఫెయిలువుతుండడం బాధాకరమన్నారు. పదోతరగతిలో మెరుగైన ఫలితాలు సాధించేందుకుగాను కనీసంగా 10 నుంచి 20 మోడల్ ప్రశ్నాపత్రాలతో ప్రాక్టీస్ చేయించాలని సూచించారు. జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత మాట్లాడుతూ... సిలబస్ పూర్తిపై కాకుండా, బోధించిన అంశం విద్యార్థులకు ఏమేరకు అర్థమవుతోందన్న దానిపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. గణతం ప్రాథమికాంశాలను నేర్పించకపోతే పై తరగతులకు వెళ్లినప్పుడు ఇబ్బంది పడతారని అన్నారు. డీఈఓ నాంపల్లి రాజేష్, డిప్యూటీ డీఈఓలు బస్వారావు, వెంకటనర్సమ్మ, రాములు కూడా మాట్లాడారు. పదోతరగతిలో నూటికి నూరుశాతం ఫలితాలు సాధించిన ప్రధానోపాధ్యాయులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. ఆర్వీఎం పీఓ రవికుమార్, డీడీ అబ్రహం, డీసీఈబీ చైర్మన్ కనపర్తి వెంకటేశ్వర్లు, ఆర్పీహెచ్ఎం జిల్లా అధికారి నిర్మల్‌కుమార్, ఎంఈఓలు తదితరులు పాల్గొన్నారు. -
ఫస్టియర్ విద్యార్థులూ జాగ్రత్త!
ఇప్పటికే పాసైన సబ్జెక్ట్‌ను ఇంప్రూవ్‌మెంట్‌లో ఫెయిలైతే ఫెయిలే సాక్షి, హైదరాబాద్: ఫస్టియర్‌లో కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిలై, కొన్ని సబ్జెక్టుల్లో పాసయ్యారా? ఫెయిలైన సబ్జెక్టులతోపాటు పాసైన సబ్జెక్టుల్లో మార్కులు పెంచుకునేందుకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాయాలనుకుంటున్నారా? అయితే జాగ్రత్త! ప్రస్తుతం పాసైన సబ్జెక్టుల్లో.. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలో ఫెయిల్ అయ్యారో ఫెయిల్ కిందే లెక్క! అంతకుముందుకు ఆ సబ్జెక్టులో పాస్ అయినా చివరి ఫలితాలనే పరిగణనలోకి తీసుకుంటారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు. ఇక ప్రథమ సంవత్సర విద్యార్థులు అన్ని సబ్జెక్టుల్లో ఉతీర్ణులైన వారు ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు. వీరికి మాత్రం ఎందులో ఎక్కువ మార్కులు వస్తే దాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. వీరు సాధారణ ఫీజుతోపాటు ప్రతి పేపరుకు రూ.100 చొప్పున చెల్లించాలి. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కమ్ ఫొటోకాపీకి అవకాశం రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కమ్ ఫొటో కాపీ కోసం విద్యార్థులు ఈ నెల 30లోగా ఆన్లైన్లో ఫీజు చెల్లించాలి. రీకౌంటింగ్ కోసం ఒక్కో పేపరుకు రూ.100 చెల్లించాలి. రీ వెరిఫికేషన్, మూల్యాకనం చేసిన జవాబు పత్రాల జిరాక్స్ కాపీ (ఫొటో కాపీ) పొందేందుకు ఒక్కో సబ్జెక్టుకు రూ.600 చొప్పున మీసేవా, ఏపీ ఆన్లైన్ కేంద్రాల్లో ఫీజు చెల్లించాలి. ఇంప్రూవ్మెంట్ రాయాలనుకునే వారు, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఇంటర్ బోర్డు అధికారులు సూచించారు. జేఈఈ మెయిన్‌లో వార్షిక పరీక్షలే లెక్క ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ తుది ర్యాం కుల ఖరారులో (జేఈఈ స్కోర్‌కు 60%, ఇంటర్ మార్కులకు 40%) ఇంటర్ వార్షిక పరీక్ష ఫలితాలనే పరిగణనలోకి తీసుకుంటారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో టాప్ ర్యాంకు విద్యార్థులు ఐఐటీల్లో ప్రవేశాలకోసం రాష్ట్ర బోర్డు నుంచి పరీక్షకు హాజరైన విద్యార్థుల్లో టాప్-20 పర్సంటైల్‌లో ఉండాలి. లేదా బోర్డు పరీక్షలో 75% మార్కులు సాధించి ఉండాలి. ఎంసెట్‌లో ఇలా.. ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల మార్కులకు 25% వెయిటేజీ ఇచ్చి ఎంసెట్ తుది ర్యాంకును ఖరారు చేస్తారు. ఎవరైనా విద్యార్థి వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయి, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో పాస్ అయితే ఆ మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. వాటి ఆధారంగానే ఆ విద్యార్థికి ఎంసెట్ తుది ర్యాంకును ఖరారు చేస్తారు. -
బ్యాటింగ్ తీరు మెరుగుపడాలి: రవిశాస్త్రి
సొంతగడ్డపై జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్ 3-0తో ప్రపంచ నంబర్‌వన్ జట్టు దక్షిణాఫ్రికాను ఓడించినప్పటికీ... స్పిన్ పిచ్‌లపై భారత బ్యాట్స్‌మెన్ ఆటతీరు ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. ఏడాది కాలంలోనే విరాట్ కోహ్లి మంచి నాయకుడిగా ఎదిగాడని ఆయన ప్రశంసించారు. క్రమం తప్పకుండా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఉంటున్నందున భారత జాతీయ జట్టు సభ్యులు దేశవాళీ టోర్నమెంట్లలో ఆడలేకపోతున్నారని ఆయన అన్నారు. -
వీడని అక్కాచెల్లెళ్ల మర్డర్ కేసు మిస్టరీ
-
ఇంటర్ సప్లిమెంటరీకి ఏర్పాట్లు పూర్తి
శ్రీకాకుళం న్యూకాలనీ:ఈ నెల 25వ తేదీ నుంచి జరగనున్న ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డు సప్లిమెంటరీ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. ఇటీవల జరిగిన వార్షిక పరీక్షల్లో ప్రథమ సంవత్సరంలో మార్కులను పెంచుకునేందుకు (ఇంప్రూవ్మెంట్) కోసం దరఖాస్తు చేస్తున్న 9,984 మంది విద్యార్థులతో కలిపి మొత్తం 28,150 మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో ప్రథమ సంవత్సరం జనరల్ విభాగంలో ఇంప్రూవ్మెంట్ కోసం 9,910 మంది, ఫెయిలైన విద్యార్థులు 9,930 మంది, ఒకేషనల్ విభాగంలో ఇంప్రూవ్మెంట్ కోసం 74 మంది, ఫెయిలైన విద్యార్థులు 306 మంది ఉన్నారు. ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో 7,763 మంది, ఒకేషనల్‌లో 167 మంది ఫెయిలైన విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యేందుకు ఫీజులు చెల్లించారు. 59 కేంద్రాలు కేటాయింపు సప్లిమెంటరీ పరీక్షలను 59 కేంద్రాలను అధికారులు కేటాయించారు. ఇప్పటికే పరీక్ష కేంద్రాలకు జవాబుపత్రాలతోపాటు నామినల్‌రోల్స్, ఇతర మెటీరియల్‌ను చేరవేశారు. శ్రీకాకుళం పట్టణంలోనే తొమ్మిది కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి. ఇందుకుగాను 59 మంది చీఫ్ సూపరింటెండెట్లు, 59 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, కస్టోడియన్లు, ఏసీవోలను నియమించారు. తనిఖీ బృందాల నియామకం పరీక్షల విభాగం డీఈసీ కన్వీనర్, ఆర్ఐవో ఎ.అన్నమ్మ నేతృత్వంలో డీఈసీ కమిటీ సభ్యులు బి.యజ్ఞభూషణరావు(ప్రిన్సిపాల్ -టెక్కలి), బొడ్డేపల్లి మల్లేశ్వరరావు(ప్రిన్సిపాల్ -కోటబొమ్మాళి), జి.వి.జగన్నాథరావు (హిస్టరీ లెక్చరర్ -తొగరాం)తోపాటు హైపవర్ కమిటీ సభ్యులగా చౌదరి ఆదినారాయణ (ప్రిన్సిపాల్ -రణస్థలం)లను ఇంటర్‌బోర్డు నియమించిన విషయం తెలిసిందే. వీరితోపాటు పరీక్ష కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచేందుకు మూడు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలతోపాటు మరో ఐదు సిట్టింగ్ స్క్వాడ్లను, ఇతర సిబ్బందిని నియమించారు. అప్రమత్తంగా ఉండండి:ఆర్ఐవో సప్లిమెంటరీ పరీక్షల నిర్వహనకు నియామకమైన సీఎస్‌లు, డీవోలు, కస్టోడియన్లు, ఏఎస్‌వోలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆర్ఐవో, డీఈసీ కమిటీ కన్వీనర్ ఎ.అన్నమ్మ పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో శుక్రవారం జరిగిన సమీక్షా సమావేశంలో పరీక్షల నిర్వహన తీరుతెన్నులు, జాగ్రత్తలు తదితర అంశాలపై ఆమెతోపాటు డీఈసీ కమిటీ సభ్యులు పలు సూచనలు చేశారు. పకడ్బందీగా పరీక్షలు శ్రీకాకుళం పాతబస్టాండ్:ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ -2 పి.రజనీకాంతారావు అన్నారు. పరీక్షల నిర్వహణపై శుక్రవారం సంబంధిత ఆధికారులతో సమీక్ష నిర్వహించారు. మాస్ కాపియింగ్, అవకతవకలు జరగకుండా చూడాలని ఆదేశించారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టు మెంటల్ ఆధికారులు, పర్యవే క్షణలు చేయాలన్నారు. జంబ్లింగ్ విధానంలో భామిని నుంచి కొత్తూరు, కొత్తూరు నుంచి హిరమండలం, ఎల్ఎన్ పేట నుంచి హిరమండలం, పూండి నుంచి నౌపడ ఇలా కేంద్రాలను జంబ్లింగ్ చేసినట్టు చెప్పారు. సమావేశంలో ప్రాంతీయ పర్యవేక్షనాధికారి ఎ.అన్నమ్మ, జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు బీవై భూషణరావు పాల్గొన్నారు. -
మే 25 నుంచి జూన్ 1 వరకూ అడ్వాన్స్ సప్లిమెంటరీ
మే 1వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లింపునకు అవకాశం ఫెయిల్ అయినవారికి, ఇంప్రూవ్మెంట్ వారికి అవకాశం సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను మే 25వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు షెడ్యూలు ప్రకటించింది. విద్యార్థులు మే 1వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని పేర్కొంది. ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించే అవకాశం లేదని స్పష్టం చేసింది. వొకేషనల్ కోర్సులకు సంబంధించిన మొదటి సంవత్సరం పాత విద్యార్థులు ఈ ఒక్కసారి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కావచ్చని పేర్కొంది. ఇదే చివరి అవకాశమని వెల్లడించింది. అన్ని సబ్జెక్టులు పాస్ అయిన విద్యార్థులు ఇంప్రూవ్మెంట్ కోసం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాయవచ్చని తెలిపింది. విద్యార్థులు సాధారణ ఫీజు జనరల్ కోర్సులైతే రూ. 300, వొకేషనల్ కోర్సులైతే రూ. 400లతోపాటు ఒక్కో సబ్జెక్టుకు అదనంగా రూ. 100 చొప్పున చెల్లించాలని పేర్కొంది. పాత హాల్‌టికె ట్ నెంబరుతోనే పరీక్షలు రాయాల్సి ఉంటుందని వెల్లడించింది. ప్రస్తుతం వచ్చిన మార్కులు, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో వచ్చే మార్కుల్లో ఏవి ఎక్కువగా ఉంటే వాటినే పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించింది. ప్రథమ సంవత్సరంలో ఫెయిల్ అయిన విద్యార్థులు ఫెయిల్ అయిన సబ్జెక్టులతోపాటు పాస్ అయిన సబ్జెక్టుల్లో పరీక్షలు రాస్తే కొత్త ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటామని తెపింది. హాజరు మినహాయింపు పొందిన ప్రైవేటు విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకావచ్చని, వారు సంబంధిత ప్రిన్సిపాళ్లను సంప్రదించి పరీక్ష ఫీజును చెల్లించవచ్చని పేర్కొంది. ఏదైనా కారణాలతో మార్చిలో జరిగిన పరీక్షలకు హాజరుకాని విద్యార్థులు కూడా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావచ్చని తెలిపింది. మే 1వ తేదీ వరకే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ దరఖాస్తులకు అవకాశం విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ జవాబు పత్రాల జిరాక్స్ కాపీలను పొందేందుకు మే 1వ తేదీలోగా ఫీజు చెల్లించాలి. రీ కౌంటింగ్ కోసం ఒక్కో పేపరుకు రూ. 100లు, రీవెరిఫికేషన్ కమ్ జవాబుపత్రాల జిరాక్స్ కాపీ పొందేందుకు ఒక్కో సబ్జెక్టుకు రూ.600 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. మీసేవా కేంద్రాలు, ఏపీ ఆన్లైన్ కేంద్రాల్లో పరీక్ష ఫీజును చెల్లించవచ్చు. దరఖాస్తు ఫారాలను కూడా మే 1వ తేదీలోగా అందజేయాలి. ఆ తరువాత వచ్చే వాటిని స్వీకరించరు. దరఖాస్తులను ప్రిన్సిపాళ్లు, ఆర్ఐవోల ద్వారా పంపించడానికి వీల్లేదు. ఇదీ పరీక్షల టైంటేబుల్ వచ్చే నెల 25వ తేదీ నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సర పరీక్షలను, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ద్వితీయ సంవత్సర పరీక్షలను నిర్వహిస్తారు. అలాగే ప్రాక్టికల్స్ జూన్ 4 నుంచి 7వ తేదీ వరకు జరుగుతాయి. ఎథిక్స్, మానవీయ విలువలు పరీక్షను జూన్ 8న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు నిర్వహిస్తారు. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను జూన్ 9న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు నిర్వస్తారు. ఈ తేదీలు వొకేషనల్ విద్యార్థులకు కూడా వర్తిస్తాయి. ఫస్టియర్ పరీక్షలు సెకండ్ ఇయర్ పరీక్షలు తేదీ/ వారం సోమవారం పార్ట్-2 పార్ట్-2 25-05-2015 సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1 సెకండ్ లాంగ్వేజ్ పేపర్-11 మంగళవారం పార్ట్-1 పార్ట్-1 26-05-2015 ఇంగ్లిష్ పేపర్-1 ఇంగ్లిష్ పేపర్-11 బుధవారం పార్ట్-3 పార్ట్-3 27-05-2015 మ్యాథమెటిక్స్ పేపర్-1ఏ మ్యాథమెటిక్స్ పేపర్-2ఏ బోటనీ పేపర్-1 బోటనీ పేపర్-2 సివిక్స్ పేపర్-1 సివిక్స్ పేపర్-2 సైకాలజీ-1 సైకాలజీ-2 గురువారం మ్యాథమెటిక్స్ పేపర్-1బీ మ్యాథమెటిక్స్ పేపర్-2బీ 28-05-2015 జ్యువాలజీ పేపర్-1 జ్యువాలజీ పేపర్-2 హిస్టరీ పేపర్-1 హిస్టరీ పేపర్-2 శుక్రవారం 29-05-2015 ఫిజిక్స్ పేపర్-1 ఫిజిక్స్ పేపర్-2 ఎకనామిక్స్ పేపర్-1 ఎకనామిక్స్ పేపర్-2 క్లాసికల్ లాంగ్వేజీ పేపర్-1 క్లాసికల్ లాంగ్వేజి-2 శనివారం కెమిస్ట్రి పేపర్-1 కెమిస్ట్రి-2 30-05-2015 కామర్స్ పేపర్-1 కామర్స్-2 సోషయాలజీ పేపర్-1 సోషయాలజీ-2 ఫైన్ ఆర్ట్స్, మ్యుజిక్స్ పేపర్-1 ఫైన్ ఆర్ట్సీ, మ్యూజిక్ పేపర్-2 ఆదివారం జ్యువాలజీ పేపర్-1 జ్యువాలజీ పేపర్-2 31-05-2015 హోంసైన్స్ పేపర్-1 హోంసైన్స్ పేపర్-2 పబ్లిక్ అడ్మిస్ట్రేషన్ పేపర్-1 పబ్లిక్ అడ్మిస్ట్రేషన్ పేపర్-2 లజిక్ పేపర్-1 లజిక్ పేపర్-2 బిడ్జి కోర్స్ మ్యాథ్స్పేపర్-1 బిడ్జి కోర్స్ మ్యాథ్స్పేపర్-2 (ఫర్ బైపీసీ విద్యార్థులకు) (ఫర్ బైపీసీ విద్యార్థులకు) సోమవారం 01-06-2016 మాడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1 మాడ్రాన్ లాంగ్వేజ్ పేపర్-2 జియోగ్రఫి పేపర్-1 జియోగ్రఫి-2 -
పేదరిక నిర్మూలనకు నిధులు
అభివృద్ధి చెందిన దేశాలకు భారత్ పిలుపు నైరోబీ: అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని పేదరికాన్ని నిర్మూలించేందుకు అభివృద్ధి చెందిన దేశాలు ఉదారంగా మరిన్ని నిధులివ్వాలని పశ్చిమ దేశాలకు భారత్ పిలుపునిచ్చింది. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల తలసరి ఆదాయంలో భారీ వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో పేదరికాన్ని అంతమొందించేందుకు తొలుత నిర్దేశించుకున్న సాయంకన్నా అధికంగా నిధులివ్వాలని కోరింది. అప్పుడే 2015 తర్వాత అమలు చేసేందుకు నిర్దేశించుకున్న ఎజెండా కార్యరూపం దాలుస్తుందని అభిప్రాయపడింది. ఈ మేరకు ఇక్కడ జరిగిన ఐక్యరాజ్య సమితి తొలి పర్యావరణ సదస్సులో భారత్ తరఫున హాజరైన కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రసంగించారు. అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటికే చేసిన వాగ్దానం మేరకు తమ స్థూల జాతీయాదాయంలో(జీఎన్ఐ) నిర్దేశిత శాతాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలకు అభివృద్ధి సాయం కింద(ఓడీఏ) తక్షణమే ఇవ్వాల్సిన అవసరముందన్నారు. పేదరిక నిర్మూలన పథకాల అమలుకు సాయం చేసేందుకు ఆయా దేశాలు ముందుకు రావాలని కోరారు. ఇప్పటికే హామీ ఇచ్చిన 0.7% జీఎన్ఐ నిధులు సహా అదనపు నిధులు ఇవ్వాలన్నారు. -
రాష్ట్రాలు సమైక్యంగా వుంటేనే పురోగతి
-
పల్లెలకు సుస్తీ..!
సాక్షి, గుంటూరు:ప్రజారోగ్యం మెరుగుదలకు ప్రభుత్వం ఏటా రూ.కోట్లు కుమ్మరిస్తున్నా, వ్యాధుల నియంత్రించడంలో వైద్య ఆరోగ్యశాఖ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది ఆరంభం నుంచి ఎన్నడూ లేనంతగా జిల్లాలో వైరల్, చికున్ గున్యా జ్వరాలు విజృంభించాయి. తీవ్రమైన కీళ్ల నొప్పులతో సత్తువను హరించి వేశాయి. చిన్నారులు సైతం పెద్ద సంఖ్యలో మంచం పట్టారు. కిందటేడాది కంటే జ్వరాల వ్యాప్తి పది నుంచి పదిహేను శాతం అధికంగా నమోదైనట్లు జిల్లా ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. కానీ ఇది 50 శాత ం దాటినట్టు సమాచారం. ఈ దఫా మలేరియా, డెంగీ, గున్యా, వైరల్ జ్వరాలు ఒకే సారి విజృంభించడంతో ఈ వ్యాధుల బారిన పడిన వారు కోలుకోవడానికి చాలా సమయం పడుతోంది. జ్వరం నుంచి కోలుకోని నెలలు గడిచినా ఇప్పటికీ తీవ్రమైన ఒళ్లు నొప్పులతో సతమతమవుతున్నవారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. జ్వర పీడితులతో పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. రోగుల్లో 90 శాతం మంది ప్రయివేటు ఆస్పత్రులనే ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన కొన్ని ఆస్పత్రుల నిర్వాహకులు అవసరం లేకున్నా టెస్టుల పేరుతో రకరకాల మందుల రాసి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ జ్వరాల చికిత్సలతో గుంటూరు జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రులకు రూ.30 కోట్లకు పైగా ఆదాయం లభించినట్లు అంచనా. ప్రభుత్వ శాఖల నడుమ సమన్వయ లేమి వ్యాధుల తీవ్రతకు కారణమవుతోంది. కలుషిత తాగు నీరు, పారిశుద్ధ్య లోపం, దోమల నియంత్రణకు ఫాగింగ్, పిచికారి యంత్రాలు లేకపోవడంతో వ్యాధులు విజృంభిస్తున్నాయి. వైద్యాధికారుల తప్పుడు నివేదికలు జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్లో రెండు లక్షల మందికి పైగా చికున్‌గున్యా బారిన పడ్డారు. తండాలు, మారుమూల పల్లెల్లో మాత్రమే కనిపించే మలేరియా కేసులు ఈ ఏడాది పట్టణాల్లోనూ అధికంగానే నమోదవుతున్నాయి. వేలల్లో మలేరియా, వందల్లో డెంగీ కేసులను గుర్తించారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లలేని పల్లెల్లో జనం ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. వ్యాధులపై జిల్లా వైద్యాధికారులు లెక్కలు చిత్రంగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా కేవలం 12 మండలాల్లో 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 72 గ్రామాల్లోనే జ్వరాలున్నట్లు నివేధించారు. మలేరియా కేసులు 410, డెంగ్యూ నిర్ధారిత కేసులు 16, చికున్ గున్యా కేసులు 42 కేసుల్ని మాత్రమే నిర్ధారించినట్లు ప్రకటించారు. ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది గ్రామాల్లో గృహ సందర్శనలు చేసి వ్యాధులపై ప్రత్యేక సర్వే నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఇంత స్థాయిలో వ్యాధులు ప్రబలితే, ఎస్పీఎం విభాగం సర్వేపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పారిశుద్ధ్య లోపంతోనే జ్వరాలు ప్రబలుతున్నాయని వైద్యాధికారులు నివేదికల్లో పేర్కొనడం గమనార్హం. ఈ ఏడాది నవంబరు వరకు జిల్లాలో 5,35,672 రక్తపూతలు సేకరించామని చెబుతున్న అధికారులు చికున్ గున్యా, డెంగ్యూ, మలేరియా కేసులు తక్కువగానే చూపడం లెక్కలపై అనుమానాలకు తావిస్తోంది. ప్రజారోగ్యంపై ఏదీ.. చైతన్యం.. పల్లెల్లో వర్షపు నీరు.. చెత్తా చెదారం పేరుకుపోయి దోమలు విజృంభిస్తున్నా నివారణకు చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. ప్రయత్నాలు మాత్రం సరిగా జరగడం లేదు. వైద్య ఆరోగ్యశాఖ పల్లెల్లో పారిశుద్ధ్య నిర్వహణకు జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ద్వారా పీహెచ్సీ సబ్ సెంటర్లకు రూ.10 వేలకు పైగా నిధులు అందుతున్నాయి. కానీ ఈ నిధులు పక్కదారి పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఏఎన్ఎం, గ్రామ కార్యదర్శి సంయుక్త చెక్ పవర్‌తో ఈ నిధుల్ని ఖర్చు చేసేలా ఆదేశాలిచ్చారు. ఈ ఏడాది జూన్‌లో వర్షాలు ప్రారంభమయ్యే సమయంలోనే జిల్లాలోని రెవెన్యూ గ్రామ పంచాయితీలు 1,021కి శానిటేషన్ నిర్వహణకు రూ.10 కోట్లకు పైగా నిధులు విడుదలయ్యాయి. ఈ నిధుల్ని సక్రమంగా ఖర్చు చేసి ప్రజారోగ్యం మెరగుదలకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. జ్వరాలు ప్రబలిన గ్రామాల్లో 226 వైద్య శిబిరాలు నిర్వహించామని, 33,906 మందికి వైద్య సేవలు అందించామని అధికారులు పేర్కొంటున్నారు. దోమల నియంత్రణకు యాంటి లార్వాను గృహాల్లో, కాల్వల్లో మలాథియన్ ఫాగింగ్ చేశామని చెబుతున్నారు. -
పల్లెలకు సుస్తీ..!
సాక్షి, గుంటూరు:ప్రజారోగ్యం మెరుగుదలకు ప్రభుత్వం ఏటా రూ.కోట్లు కుమ్మరిస్తున్నా, వ్యాధుల నియంత్రించడంలో వైద్య ఆరోగ్యశాఖ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది ఆరంభం నుంచి ఎన్నడూ లేనంతగా జిల్లాలో వైరల్, చికున్ గున్యా జ్వరాలు విజృంభించాయి. తీవ్రమైన కీళ్ల నొప్పులతో సత్తువను హరించి వేశాయి. చిన్నారులు సైతం పెద్ద సంఖ్యలో మంచం పట్టారు. కిందటేడాది కంటే జ్వరాల వ్యాప్తి పది నుంచి పదిహేను శాతం అధికంగా నమోదైనట్లు జిల్లా ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. కానీ ఇది 50 శాత ం దాటినట్టు సమాచారం. ఈ దఫా మలేరియా, డెంగీ, గున్యా, వైరల్ జ్వరాలు ఒకే సారి విజృంభించడంతో ఈ వ్యాధుల బారిన పడిన వారు కోలుకోవడానికి చాలా సమయం పడుతోంది. జ్వరం నుంచి కోలుకోని నెలలు గడిచినా ఇప్పటికీ తీవ్రమైన ఒళ్లు నొప్పులతో సతమతమవుతున్నవారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. జ్వర పీడితులతో పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. రోగుల్లో 90 శాతం మంది ప్రయివేటు ఆస్పత్రులనే ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన కొన్ని ఆస్పత్రుల నిర్వాహకులు అవసరం లేకున్నా టెస్టుల పేరుతో రకరకాల మందుల రాసి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ జ్వరాల చికిత్సలతో గుంటూరు జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రులకు రూ.30 కోట్లకు పైగా ఆదాయం లభించినట్లు అంచనా. ప్రభుత్వ శాఖల నడుమ సమన్వయ లేమి వ్యాధుల తీవ్రతకు కారణమవుతోంది. కలుషిత తాగు నీరు, పారిశుద్ధ్య లోపం, దోమల నియంత్రణకు ఫాగింగ్, పిచికారి యంత్రాలు లేకపోవడంతో వ్యాధులు విజృంభిస్తున్నాయి. వైద్యాధికారుల తప్పుడు నివేదికలు జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్లో రెండు లక్షల మందికి పైగా చికున్‌గున్యా బారిన పడ్డారు. తండాలు, మారుమూల పల్లెల్లో మాత్రమే కనిపించే మలేరియా కేసులు ఈ ఏడాది పట్టణాల్లోనూ అధికంగానే నమోదవుతున్నాయి. వేలల్లో మలేరియా, వందల్లో డెంగీ కేసులను గుర్తించారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లలేని పల్లెల్లో జనం ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. వ్యాధులపై జిల్లా వైద్యాధికారులు లెక్కలు చిత్రంగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా కేవలం 12 మండలాల్లో 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 72 గ్రామాల్లోనే జ్వరాలున్నట్లు నివేధించారు. మలేరియా కేసులు 410, డెంగ్యూ నిర్ధారిత కేసులు 16, చికున్ గున్యా కేసులు 42 కేసుల్ని మాత్రమే నిర్ధారించినట్లు ప్రకటించారు. ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది గ్రామాల్లో గృహ సందర్శనలు చేసి వ్యాధులపై ప్రత్యేక సర్వే నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఇంత స్థాయిలో వ్యాధులు ప్రబలితే, ఎస్పీఎం విభాగం సర్వేపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పారిశుద్ధ్య లోపంతోనే జ్వరాలు ప్రబలుతున్నాయని వైద్యాధికారులు నివేదికల్లో పేర్కొనడం గమనార్హం. ఈ ఏడాది నవంబరు వరకు జిల్లాలో 5,35,672 రక్తపూతలు సేకరించామని చెబుతున్న అధికారులు చికున్ గున్యా, డెంగ్యూ, మలేరియా కేసులు తక్కువగానే చూపడం లెక్కలపై అనుమానాలకు తావిస్తోంది. ప్రజారోగ్యంపై ఏదీ.. చైతన్యం.. పల్లెల్లో వర్షపు నీరు.. చెత్తా చెదారం పేరుకుపోయి దోమలు విజృంభిస్తున్నా నివారణకు చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. ప్రయత్నాలు మాత్రం సరిగా జరగడం లేదు. వైద్య ఆరోగ్యశాఖ పల్లెల్లో పారిశుద్ధ్య నిర్వహణకు జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ద్వారా పీహెచ్సీ సబ్ సెంటర్లకు రూ.10 వేలకు పైగా నిధులు అందుతున్నాయి. కానీ ఈ నిధులు పక్కదారి పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఏఎన్ఎం, గ్రామ కార్యదర్శి సంయుక్త చెక్ పవర్‌తో ఈ నిధుల్ని ఖర్చు చేసేలా ఆదేశాలిచ్చారు. ఈ ఏడాది జూన్‌లో వర్షాలు ప్రారంభమయ్యే సమయంలోనే జిల్లాలోని రెవెన్యూ గ్రామ పంచాయితీలు 1,021కి శానిటేషన్ నిర్వహణకు రూ.10 కోట్లకు పైగా నిధులు విడుదలయ్యాయి. ఈ నిధుల్ని సక్రమంగా ఖర్చు చేసి ప్రజారోగ్యం మెరగుదలకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. జ్వరాలు ప్రబలిన గ్రామాల్లో 226 వైద్య శిబిరాలు నిర్వహించామని, 33,906 మందికి వైద్య సేవలు అందించామని అధికారులు పేర్కొంటున్నారు. దోమల నియంత్రణకు యాంటి లార్వాను గృహాల్లో, కాల్వల్లో మలాథియన్ ఫాగింగ్ చేశామని చెబుతున్నారు. -
‘సమైక్యం’తోనే అభివృద్ధి
ఒంగోలు, న్యూస్‌లైన్ :రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే మూడు ప్రాంతాలూ అభివృద్ధి చెందుతాయని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ డాక్టర్ నూకసాని బాలాజీ అన్నారు. సమైక్య రాష్ట్ర సాధన కోసం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా ఆటోలు, రిక్షాలతో గురువారం సమైక్య ర్యాలీలు నిర్వహించారు. రిక్షా కార్మికులు తాము సైతం అంటూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి వైఎస్సార్సీపీ సమైక్య ర్యాలీకి సంఘీభావం ప్రకటించారు. కందుకూరులో జిల్లా కన్వీనర్, కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్త నూకసాని, మరో సమన్వయకర్త ఉన్నం వీరాస్వామిలు ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అక్కడి నుంచి పట్టణంలోని అన్ని ప్రధాన వీధుల్లో ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు నాందిపలికిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా సమైక్యాంధ్ర పేరుతో ఉద్యమాలు చేయడం హాస్యాస్పదమన్నారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు చేశామంటూ తప్పుడు ప్రకటనలివ్వడం వారి దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. మార్కాపురంలో నియోజకవర్గ సమన్వయకర్తలు వెన్నా హనుమారెడ్డి, ఉడుముల శ్రీనివాసరెడ్డిలు పార్టీ కార్యాలయం వద్ద ర్యాలీని ప్రారంభించారు. అనంతరం పట్టణ వీధుల నుంచి ర్యాలీ కోర్టు సెంటర్ వద్దకు చేరుకోగా పార్టీ కార్యకర్తలు అక్కడ రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా సమన్వయకర్తలు మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం ఏ పార్టీ కట్టుబడి ఉందో జనానికి స్పష్టంగా అర్థమవుతోందన్నారు. సమైక్య శంఖారావానికి అడ్డంకులు సృష్టించిన సీఎం ఏ రకమైన సమైక్యవాదో తేటతెల్లమైందన్నారు. ఒంగోలులో పార్టీ జిల్లా కార్యాలయం వద్ద ర్యాలీని జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్‌లు ప్రారంభించారు. అనంతరం ర్యాలీ ప్రధాన రహదారుల్లో సాగింది. చర్చి సెంటర్లోని వైఎస్సార్ విగ్రహం వద్ద ఆటోలను వలయంగా ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ కేంద్రమంత్రులు, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు ఇకనైనా డ్రామాలు ఆపాలని మండిపడ్డారు. ప్రజలను నిత్యం మభ్యపెట్టగలమని భావిస్తే అది రాజకీయ జీవితానికి గ్రహపాటుగా మారుతుందని హెచ్చరించారు. రాష్ట్ర విభజన ఆగేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించినట్లు అసెంబ్లీని సమావేశపరిచి సమైక్యాంధ్రకు సంఘీభావంగా ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి రాజ్యాంగ సంక్షోభం సృష్టించడం ఒక్కటే మార్గమన్నారు. కనిగిరిలో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త ముక్కు కాశిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో ప్రకాశం జిల్లాకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు, రైతు కూలీలు సమైక్యాంధ్రకు సంఘీభావం ప్రకటించేందుకు ముందుకు రావాలని కోరారు. యర్రగొండపాలెంలో గురువారం సాయంత్రం ఆటో రిక్షాల ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త పాలపర్తి డేవిడ్‌రాజు మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాకుంటే పశ్చిమ ప్రకాశం మొత్తం ఎడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గిద్దలూరులో నియోజకవర్గ సమన్వయకర్తలు ముత్తుముల అశోక్‌రెడ్డి, వై.వెంకటేశ్వరరావులు ఆటోరిక్షాల ర్యాలీని ప్రారంభించారు. రాష్ట్ర విభజనతో విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వస్తుందన్నారు. ఉద్యమంలో విద్యార్థులు ప్రధాన పాత్ర పోషించాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సూరా పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చీరాల పోస్టాఫీస్ సెంటర్లో నియోజకవర్గ సమన్వయకర్తలు సజ్జా హేమలత, అవ్వారు ముసలయ్యలు ర్యాలీని ప్రారంభించారు. సాల్మన్ సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. త్వరలో హైదరాబాద్‌లో నిర్వహించే సమైక్య శంఖారావానికి ప్రతి ఒక్కరూ కదిలిరావాలని పిలుపునిచ్చారు. -
తెలంగాణ అభివృద్ధికి...వైఎస్ఆర్ విశేష కృషి
తల్లాడ, న్యూస్‌లైన్: తెలంగాణ ప్రాంత అభివృద్ధికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి విశేష కృషి చేశారని వైఎస్ఆర్ సీపీ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. పార్టీ తల్లాడ మండల స్థాయి కార్యకర్తల సమావేశం మండల కన్వీనర్ గొడుగునూరి లక్ష్మీరెడ్డి అధ్యక్షతన ఆదివారం స్థానిక బాలభారతి విద్యాలయంలో జరిగింది. పొంగులేటి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వైఎస్ఆర్ ఆనాడే అనుకూలంగా వ్యవహరించారని, ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక నిధులు కే టాయించారని చెప్పారు. ఆ మహానేత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రజలు మరిచిపోలేదని అన్నారు. తెలంగాణలో వైఎస్ఆర్ సీపీ బలంగా ఉందని, రానున్న ఎన్నికల్లో ప్రజలు మరింతగా ఆదరిస్తార ని.. అండగా నిలబడతారని అన్నారు. రాబోయే జిల్లా-మండల పరిషత్, అసెంబ్లీ-పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ సీపీ ప్రభంజనం సృష్టిస్తుందని అన్నారు. ముందుగా వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి, చిత్రపటానికి పొంగులేటి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సమావేశంలో పార్టీ సత్తుపల్లి నియోజకవర్గ సమన్వయకర్తలు నంబూరి రామలింగేశ్వరరావు, మట్టా దయానంద్ విజయ్‌కుమార్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు తుమ్మలపల్లి రమేష్ పాల్గొన్నారు. తెలంగాణకు వైఎస్ఆర్ సీపీ వ్యతిరేకం కాదు మధిర : తెలంగాణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని ఆ పార్టీ నేత, ఖమ్మం పార్లమెంట్ నియోజవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. మధిర పట్టణ, మండల ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం స్థానిక రెడ్డి గార్డెన్స్‌లో జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మహానేత వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలు.. వైఎస్.జగన్మోహన్రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ సీపీ ద్వారానే సాధ్యమవుతుందనే నమ్మకంతోనే ఆ పార్టీలో ప్రజలు చేరారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఈ పార్టీ(వైఎస్ఆర్ సీపీ)లో ఎవరూ చేరలేదని అన్నారు. తెలంగాణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమంటూ కొన్ని పార్టీలు దుష్ర్పచారం చేస్తున్నాయని విమర్శించారు. ‘మా పార్టీ తెలంగాణ ఇవ్వమంటే ఇస్తారా, వద్దంటే ఆగుతారా..?’ అని ప్రశ్నించారు. తెలంగాణ ఇవ్వొద్దని జగనన్న ఏనాడూ చెప్పలేదని అన్నారు. తెలంగాణ తెచ్చినా, ఇచ్చినా తమ పార్టీ హర్షం వ్యక్తం చేస్తుందన్నారు. జైలు నుంచి జగన్ బయటకు వచ్చినప్పుడు జరిగిన భారీ ర్యాలీలో తెలంగాణ ప్రజలే పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని చెప్పారు. తెలంగాణలో జగన్ పర్యటిస్తే ఆయన శక్తి ఎలాంటిదో, వైఎస్ఆర్ సీపీ ప్రభంజనమేమిటో తెలుస్తుందని అన్నారు. రాబోయే రోజుల్లో జగనన్న తెలంగాణ జిల్లాల్లో ఓదార్పు యాత్ర చేస్తారని, ఇది ఖమ్మం జిల్లా నుంచే ప్రారంభమవుతుందని చెప్పారు. వైఎస్ఆర్కు తెలంగాణలో కోట్లమంది అభిమానులు ఉన్నారని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థుల గెలుపును చూసి మిగిలిన పార్టీల నాయకులు ముక్కున వేలేసుకున్నారని, పార్టీ ప్రభంజనాన్ని చూసి అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. భట్టి ఎంత బలవంతుడైనప్పటికీ.. వైఎస్ఆర్ సీపీ ప్రభంజనంలో కొట్టుకుపోవాల్సిందేనని అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమ (వైఎస్ఆర్ సీపీ) పార్టీ నాయకులు, కార్యకర్తలను బెదిరించేందుకు చేసే ప్రయత్నాలు వృధా ప్రయాసేనని అన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా నాయకుడు అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ మెండెం జయరాజు, సేవాదళ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు దారెల్లి అశోక్, మండల-పట్టణ కన్వీనర్లు టివి.రెడ్డి, చల్లా శ్రీనివాసరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు కత్తుల శ్యామలరావు, వీరయ్యచౌదరి, లకిరెడ్డి నర్సిరెడ్డి, ఎర్రుపాలెం-బోనకల్ మండల కన్వీనర్లు అంకసాల శ్రీనివాసరావు, చావా హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.