- మే 1వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లింపునకు అవకాశం
- ఫెయిల్ అయినవారికి, ఇంప్రూవ్‌మెంట్ వారికి అవకాశం
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను మే 25వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు షెడ్యూలు ప్రకటించింది. విద్యార్థులు మే 1వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని పేర్కొంది. ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించే అవకాశం లేదని స్పష్టం చేసింది. వొకేషనల్ కోర్సులకు సంబంధించిన మొదటి సంవత్సరం పాత విద్యార్థులు ఈ ఒక్కసారి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కావచ్చని పేర్కొంది. ఇదే చివరి అవకాశమని వెల్లడించింది. అన్ని సబ్జెక్టులు పాస్ అయిన విద్యార్థులు ఇంప్రూవ్‌మెంట్ కోసం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాయవచ్చని తెలిపింది. విద్యార్థులు సాధారణ ఫీజు జనరల్ కోర్సులైతే రూ. 300, వొకేషనల్ కోర్సులైతే రూ. 400లతోపాటు ఒక్కో సబ్జెక్టుకు అదనంగా రూ. 100 చొప్పున చెల్లించాలని పేర్కొంది. పాత హాల్‌టికె ట్ నెంబరుతోనే పరీక్షలు రాయాల్సి ఉంటుందని వెల్లడించింది. ప్రస్తుతం వచ్చిన మార్కులు, అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీలో వచ్చే మార్కుల్లో ఏవి ఎక్కువగా ఉంటే వాటినే పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించింది. ప్రథమ సంవత్సరంలో ఫెయిల్ అయిన విద్యార్థులు ఫెయిల్ అయిన సబ్జెక్టులతోపాటు పాస్ అయిన సబ్జెక్టుల్లో పరీక్షలు రాస్తే కొత్త ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటామని తెపింది. హాజరు మినహాయింపు పొందిన ప్రైవేటు విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకావచ్చని, వారు సంబంధిత ప్రిన్సిపాళ్లను సంప్రదించి పరీక్ష ఫీజును చెల్లించవచ్చని పేర్కొంది. ఏదైనా కారణాలతో మార్చిలో జరిగిన పరీక్షలకు హాజరుకాని విద్యార్థులు కూడా అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావచ్చని తెలిపింది.
మే 1వ తేదీ వరకే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ దరఖాస్తులకు అవకాశం
విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ జవాబు పత్రాల జిరాక్స్ కాపీలను పొందేందుకు మే 1వ తేదీలోగా ఫీజు చెల్లించాలి. రీ కౌంటింగ్ కోసం ఒక్కో పేపరుకు రూ. 100లు, రీవెరిఫికేషన్ కమ్ జవాబుపత్రాల జిరాక్స్ కాపీ పొందేందుకు ఒక్కో సబ్జెక్టుకు రూ.600 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. మీసేవా కేంద్రాలు, ఏపీ ఆన్‌లైన్ కేంద్రాల్లో పరీక్ష ఫీజును చెల్లించవచ్చు. దరఖాస్తు ఫారాలను కూడా మే 1వ తేదీలోగా అందజేయాలి. ఆ తరువాత వచ్చే వాటిని స్వీకరించరు. దరఖాస్తులను ప్రిన్సిపాళ్లు, ఆర్‌ఐవోల ద్వారా పంపించడానికి వీల్లేదు.
ఇదీ పరీక్షల టైంటేబుల్
వచ్చే నెల 25వ తేదీ నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సర పరీక్షలను, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ద్వితీయ సంవత్సర పరీక్షలను నిర్వహిస్తారు. అలాగే ప్రాక్టికల్స్ జూన్ 4 నుంచి 7వ తేదీ వరకు జరుగుతాయి. ఎథిక్స్, మానవీయ విలువలు పరీక్షను జూన్ 8న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు నిర్వహిస్తారు. ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను జూన్ 9న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు నిర్వస్తారు. ఈ తేదీలు వొకేషనల్ విద్యార్థులకు కూడా వర్తిస్తాయి.
ఫస్టియర్ పరీక్షలు సెకండ్ ఇయర్ పరీక్షలు
తేదీ/ వారం
సోమవారం పార్ట్-2 పార్ట్-2
25-05-2015 సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1 సెకండ్ లాంగ్వేజ్ పేపర్-11
మంగళవారం పార్ట్-1 పార్ట్-1
26-05-2015 ఇంగ్లిష్ పేపర్-1 ఇంగ్లిష్ పేపర్-11
బుధవారం పార్ట్-3 పార్ట్-3
27-05-2015 మ్యాథమెటిక్స్ పేపర్-1ఏ మ్యాథమెటిక్స్ పేపర్-2ఏ
బోటనీ పేపర్-1 బోటనీ పేపర్-2
సివిక్స్ పేపర్-1 సివిక్స్ పేపర్-2
సైకాలజీ-1 సైకాలజీ-2
గురువారం మ్యాథమెటిక్స్ పేపర్-1బీ మ్యాథమెటిక్స్ పేపర్-2బీ
28-05-2015 జ్యువాలజీ పేపర్-1 జ్యువాలజీ పేపర్-2
హిస్టరీ పేపర్-1 హిస్టరీ పేపర్-2
శుక్రవారం
29-05-2015 ఫిజిక్స్ పేపర్-1 ఫిజిక్స్ పేపర్-2
ఎకనామిక్స్ పేపర్-1 ఎకనామిక్స్ పేపర్-2
క్లాసికల్ లాంగ్వేజీ పేపర్-1 క్లాసికల్ లాంగ్వేజి-2
శనివారం కెమిస్ట్రి పేపర్-1 కెమిస్ట్రి-2
30-05-2015 కామర్స్ పేపర్-1 కామర్స్-2
సోషయాలజీ పేపర్-1 సోషయాలజీ-2
ఫైన్ ఆర్ట్స్, మ్యుజిక్స్ పేపర్-1 ఫైన్ ఆర్ట్సీ, మ్యూజిక్ పేపర్-2
ఆదివారం జ్యువాలజీ పేపర్-1 జ్యువాలజీ పేపర్-2
31-05-2015 హోంసైన్స్ పేపర్-1 హోంసైన్స్ పేపర్-2
పబ్లిక్ అడ్మిస్ట్రేషన్ పేపర్-1 పబ్లిక్ అడ్మిస్ట్రేషన్ పేపర్-2
లజిక్ పేపర్-1 లజిక్ పేపర్-2
బిడ్జి కోర్స్ మ్యాథ్స్‌పేపర్-1 బిడ్జి కోర్స్ మ్యాథ్స్‌పేపర్-2
(ఫర్ బైపీసీ విద్యార్థులకు) (ఫర్ బైపీసీ విద్యార్థులకు)
సోమవారం
01-06-2016 మాడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1 మాడ్రాన్ లాంగ్వేజ్ పేపర్-2
జియోగ్రఫి పేపర్-1 జియోగ్రఫి-2