మెరుగైన పోలీసింగ్‌కు కృషి: డీజీపీ | trying to better policing: DGP | Sakshi
Sakshi News home page

మెరుగైన పోలీసింగ్‌కు కృషి: డీజీపీ

Published Fri, Jan 19 2018 3:02 PM | Last Updated on Wed, Oct 17 2018 6:10 PM

నిజామాబాద్: వ్యక్తుల హోదాతో సంబంధం లేకుండా ప్రజలకు నాణ్యమైన సేవలందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మెరుగైన పోలీసింగ్ విషయంపై అధికారులతో సమీక్షించామని, రాష్ట్రవ్యాప్తంగా ఒకే తరహా సేవలు అందించేందుకు కృషిచేస్తున్నామని చెప్పారు. ఈమేరకు అధికారులతో సమీక్ష చేశామన్నారు. ఒకేతరహా పోలీసింగ్, సాంకేతికత, నైపుణ్యాలు మెరుగుపర్చుకోవడం వంటి అంశాలపై చర్చించామని చెప్పారు. వచ్చే ఆరు నెలల్లో పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఒకే తరహా సేవలు అందిస్తామని ఆయన తెలిపారు. సాంకేతికతను వాడటం, పని పద్దతుల్లో మార్పు, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడంపై దృష్టి సారిస్తామని, ప్రజల సహకారంతో నాణ్యమైన పోలీసింగ్కు కృషిచేస్తామని, అన్ని ప్రభుత్వ శాఖలతో కలిసి పనిచేస్తామని వివరించారు. జిల్లా పోలీసు యంత్రాంగం మంచి పనితీరు కనబరుస్తున్నదని డీజీపీ కితాబు ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement