వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్లో భారత్ ఓటమిని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. టోర్నీలో వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా.. ఆఖరి మెట్టుపై బోల్తా పడుతుందని ఎవరూ ఊహించివుండరు. అయితే మెగా టోర్నీలో ఓటమి తర్వాత అదే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా.. అభిమానుల్లో కాస్త జోష్‌ను నింపింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో యువ భారత జట్టును తొలి రెండు టీ20ల్లోనూ ఆసీస్‌ను చిత్తు చేసింది.
వచ్చే ఏడాది జూన్‌లో జరగనున్న టీ20 వరల్డ్‌కప్ సన్నహాకాల్లో భాగంగా ఈ సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్ తర్వాత దక్షిణాఫ్రికాతో కూడా భారత్ టీ20ల్లో పాల్గోనుంది. కాగా టీ20 వరల్డ్‌కప్-2024 నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది జరగనున్న టీ20లో ప్రపంచకప్‌లో టీమిండియా టైటిల్ ఫేవరేట్ అని రవిశాస్త్రి తెలిపాడు. టీ20 వరల్డ్‌కప్-2024 అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా జూన్‌లో జరగనుంది.
"ఏదీ కూడా సులభంగా రాదు. సచిన్ టెండూల్కర్ వంటి లెజెండ్ ఒక ప్రపంచకప్‌ను గెలవడానికి ఆరు వరల్డ్‌కప్‌ల వరకు వేచి చూశాడు. వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకోవడం అంత ఈజీ కాదు. ఫైనల్ రోజు మనం ఎలా ప్రదర్శన చేశామన్నదే పరిగణలోకి వస్తుంది. ఇటువంటి మెగా టోర్నీల్లో సెమీఫైనల్-ఫైనల్లో మంచి ప్రదర్శన చేస్తేనే వరల్డ్ ఛాంపియన్స్‌గా నిలుస్తారు. లీగ్ స్టేజిలో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన ఆసీస్.. సెమీస్, ఫైనల్లో అద్భుతంగా రాణించింది కాబట్టి విజేతగా నిలిచింది.
భారత్ ఓటమి నన్ను ఇప్పటికి బాధిస్తోంది. కానీ మా బాయ్స్ ఈ ఓటమి నుంచి మా బాయ్స్ చాలా విషయాలు నేర్చుకున్నారు. వారు సానుకూల దృక్పథంతో తమ ఆటను కొనసాగిస్తున్నారు. భారత్ త్వరలోనే ప్రపంచకప్ గెలుస్తుందని నేను ఆశిస్తున్నారు. టీ20 వరల్డ్‌కప్-2024ను టీమిండియా సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే టీమిండియా ప్రస్తుతం కసితో ఉంది. ప్రధాన పోటీ దారుగా భారత్ బరిలోకి దిగనుంది. ప్రస్తుతం భారత జట్టు టీ20 ఫార్మాట్‌పైనే దృష్టిపెట్టాలి’’ అని ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ లాంఛ్ ఈవెంట్‌లో రవిశాస్త్రి పేర్కొన్నాడు.
చదవండి: Virat Kohli: తమ్ముడంటే ప్రేమ! మనుషులు దూరంగా ఉన్నా.. కోహ్లి తోబుట్టువు భావనా గురించి తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment