టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా ఫిట్‌నెస్ సమస్యలతో గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్ తర్వాత ఏ విధమైన క్రికెట్ ఆడలేదు. అయితే అతడు బ్యాటింగ్, ఫీల్డింగ్ చేయడానికి ఫిట్‌గా ఉన్నప్పటికీ.. బౌలింగ్ ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. ఇక ఐపీఎల్ కొత్త జట్టుగా అవతరించిన గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా హార్ధిక్ ఎంపికయ్యాడు.కాగా ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ భారత జట్టులో హార్ధిక్ పాండ్యాకు చోటు దక్కుతుందని కొంత మంది మాజీ ఆటగాళ్లు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్రి కీలక వాఖ్యలు చేశాడు.
భారత జట్టులో ఆరో స్ధానానికి ఫుల్ టైమ్ ఆల్-రౌండర్ అవసరమని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. టీ20 ప్రపంచకప్ జట్టులో కేవలం బ్యాటర్‌గా హార్ధిక్‌కు చోటు దక్కే అవకాశం లేదు అని అతడు తెలిపాడు. "టీమిండియాలో 6వ స్థానంలో కచ్చితంగా ఒక ఆల్ రౌండర్ ఉండాలి. టాప్ ఫైవ్‌లో ఎవరైనా రెండు లేదా మూడు ఓవర్లు వేసేలా ఉండాలి. దీంతో కెప్టెన్‌పై ఒత్తిడి తగ్గుతుంది. ఆ స్ధానంలో సరైన ఆల్‌రౌండర్ భారత్‌కు లేడు. కాబట్టి భారత జట్టులో ఫాస్ట్ బౌలింగ్, అద్భుతమైన ఫీల్డింగ్ చేసే ఆల్‌రౌండర్ కావాలి. ఇక బ్యాటింగ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
భారత జట్టు అద్భుతమైన బ్యాటింగ్ లైనప్‌ను కలిగి ఉంది. ఇక టీమిండియాలో మొదటి ఐదు స్థానాల్లో అత్యుత్తమ ఆటగాళ్లు ఉన్నారు. కాబట్టి హార్ధిక్ పాండ్యా బ్యాటర్‌గా అవకాశం దొరకడం చాలా కష్టం. అయితే అతడు కనీసం రెండు లేదా మూడు ఓవర్లు బౌలింగ్ చేయగలిగతే తిరిగి జట్టులో చోటు దక్కించకుకోవచ్చు" అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.
చదవండి: IPL 2022: చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్.. స్టార్ ఆటగాడు దూరం!
Comments
Please login to add a commentAdd a comment