
అరంగేట్రంలోనే జట్టుకు ఐపీఎల్ టైటిల్ అందించిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్, టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాపై భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆసక్తకిర వాఖ్యలు చేశాడు. ఈ ఏడాది సీజన్‌లో హార్ధిక్ కెప్టెన్‌గానే కాకుండా ఆల్‌రౌండర్‌గా అద్భుతంగా రాణించాడు. 15 మ్యాచ్‌లు ఆడిన అతడు 487 పరుగులతో పాటు 8 వికెట్లు కూడా పడగొట్టాడు. అయితే గత కొద్ది కాలంగా పేలవ ఫామ్‌తో భారత జట్టుకు దూరంగా ఉన్న హార్ధిక్.. ఐపీఎల్‌లో అదరగొట్టి తిరిగి జట్టులోకి వచ్చాడు. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌కి హార్ధిక్ పాండ్యా ఎంపికయ్యాడు.
"హార్ధిక్‌కు జట్టులో బ్యాటర్‌గా లేదా ఆల్‌రౌండర్‌గా చోటు దక్కింది. అయితే అతడు గాయం నుంచి కోలుకున్నప్పటికీ కేవలం 2 ఓవర్లు బౌలింగ్ చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. అయితే గాయం కారణంగా జట్టుకు దూరమైన తర్వాత హార్ధిక్‌కు మంచి విశ్రాంతి లభించింది. ఇకపై కూడా అతడికి చాలా విశ్రాంతి అవసరం. హార్ధిక్‌ను టీ20 ప్రపంచకప్ వరకు వన్డేల్లో ఆడించే ప్రయత్నం చేయకూడదు. అతడు టీ20 ప్రపంచకప్‌కు ఫిట్‌గా ఉండడం భారత్‌కు చాలా ముఖ్యం. ఫిట్‌గా ఉంటే హార్ధిక్ పాండ్యా ఒక్కడూ ఇద్దరి ఆటగాళ్లతో సమానం. పాండ్యా బ్యాటింగ్ ఆర్డర్‌లో ఏ పొజిషన్‌లో అయినా అద్భుతంగా ఆడగలడు" అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.
చదవండి: Hardik Pandya - Kiran More: 'ఆ ఆటగాడు ఇకపై ఫోర్-డి ప్లేయర్'.. టీమిండియా మాజీ క్రికెటర్