హార్దిక్ పాండ్యా(PC: IPL.com)
ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది సీజన్‌లో కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గా కూడా రాణిస్తోన్నాడు. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన హార్ధిక్ పాండ్యా 308 పరుగులు సాధించాడు.
ఈ క్రమంలో హార్ధిక్ పాండ్యాపై టీమిండియా మాజీ ఆటగాడు హార్భజన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. చాలా మంది భారత స్టార్ ఆటగాళ్ల కంటే హార్ధిక్ అద్భుతంగా ఆడుతున్నాడని భజ్జీ అభిప్రాయపడ్డాడు. త్వరలోనే పాండ్యా జట్టులోకి వస్తాడని హార్భజన్ తెలపాడు.
"హార్దిక్ అద్భుతమైన టెక్నిక్‌తో బ్యాటింగ్ చేస్తున్నాడు. మూడో స్ధానంలో అతడు నిలకడగా రాణిస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ స్థానంలో హార్దిక్ బ్యాటింగ్ చేయడం మనం చూడ లేదు. అతడు సాధారణంగా ఆరో, ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి హిట్టింగ్ చేసేవాడు. ఇన్నింగ్స్‌లో అఖరి మూడు, నాలుగు ఓవర్లలో అతడికి బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చేది. అప్పుడు కూడా తానేంటో నిరూపించుకునేవాడు. నేను అతడిని ఎవరితోనూ పోల్చదలచుకోలేదు.
కానీ ప్రస్తుతం చాలా మంది స్టార్ బ్యాటర్ల కంటే మెరుగ్గా ఆడుతున్నాడు. ఏ జట్టులోనైనా అత్యత్తుమ బ్యాటర్.. ఎక్కవ బంతులను ఎదుర్కొంటాడు. హార్ధిక్ కూడా అంతే.. ఒక్క సారి సెట్ అయితే చివర్లో మరింత ప్రమాదకరంగా మారుతాడు. భారత జట్టులో కూడా హార్దిక్‌కి టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఇవ్వాలి.
జట్టులో మరో ఆటగాడిని ఫినిషర్‌గా ఎంపిక చేసి.. అతడిని ముందు బ్యాటింగ్‌కు పంపాలి. ఈ ఏడాది సీజన్‌లో హార్దిక్ బ్యాట్‌తో పాటు బంతితో కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. అతడు కచ్చితంగా భారత జట్టలోకి పునరాగమనం చేస్తాడని "హార్భజన్ సింగ్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment