వెస్టిండీస్‌లో టీమిండియా పర్యటన చివరి అంకానికి చేరుకుంది. కరేబియన్ టూర్‌లో చివరి సిరీస్ ఆడేందుకు భారత జట్టు సిద్దమైంది. ట్రినిడాడ్ వేదికగా గురువారం నుంచి భారత్-వెస్టిండీస్ మధ్య ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. బ్రియాన్ లారా స్టేడియంలో జరగనున్న తొలి టీ20లో సత్తా చాటేందుకు హార్దిక్ పాండ్యా సారధ్యంలోని యువ భారత జట్టు ఉవ్విళ్లూరుతోంది. ఈ సిరీస్‌కు రోహిత్, కోహ్లిలకు సెలక్టర్లు ముందే విశ్రాంతి ఇచ్చారు.
ఇక ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా స్టాండింగ్ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో హార్దిక్ మరో రెండు వికెట్ల సాధిస్తే.. టీ20 క్రికెట్‌లో 150 వికెట్ల మైలు రాయిని అందుకుంటాడు. తద్వారా టీ20 క్రికెట్‌లో 4000 పరుగులతో పాటు 150 వికెట్లు అందుకున్న తొలి భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. టీ20 క్రికెట్‌లో హార్దిక్ ఇప్పటివరకు 4348 పరుగులతో పాటు 148 వికెట్లు పడగొట్టాడు.
మరోవైపు టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ఓ అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో కుల్దీప్ మరో నాలుగు వికెట్లు సాధిస్తే.. అంతర్జాతీయ టీ20ల్లో 50 వికెట్ల పడగొట్టిన భారత బౌలర్ల జాబితాలో చేరుతాడు. దీంతో టీ20ల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా యుజువేంద్ర చాహల్‌ను కుల్దీప్ అధిగమిస్తాడు. చాహల్ 34 మ్యాచ్‌లలో ఈ ఘనత సాధించాడు. కుల్దీప్ ఇప్పటివరకు 28 మ్యాచ్‌లు ఆడి 46 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: IND vs WI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. విధ్వంసకర ఓపెనర్ ఎంట్రీ! హైదరాబాదీ కూడా
Comments
Please login to add a commentAdd a comment