ఆసియాకప్-2023లో దాయాదుల సమరానికి రంగం సిద్దమైంది. మరి కొన్ని గంటల్లో భారత్-పాకిస్తాన్ మధ్య బ్లాక్ బ్లాస్టర్ మ్యాచ్‌కు తెరలేవనుంది. ఈ చిరకాల ప్రత్యర్ధుల పోరుకు శ్రీలంకలోని పల్లెకెలె మైదానం వేదికైంది.
ఈ హైవోల్టేజ్ మ్యాచ్ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. ఇక ఈ కీలక మ్యాచ్‌కు ముందు భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై భారత్ విజయం సాధిస్తుందని రవిశాస్త్రి థీమా వ్యక్తం చేశాడు.
టీమిండియానే ఫేవరేట్
ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌లో నావరకు అయితే టీమిండియానే ఫేవరేట్. ప్రస్తుత భారత జట్టు 2011 ప్రపంచకప్‌ను గెలిచిన టీమ్ కంటే బలంగా ఉంది. జట్టులో చాలా మంది అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. అదేవిధంగా రోహిత్ శర్మ వంటి అనుభవజ్ఞుడైన కెప్టెన్ ఉన్నాడు. రోహిత్ శర్మకు భారత ఉపఖండ పిచ్‌లపై అద్భుతమైన రికార్డు ఉంది.
అయితే పాకిస్తాన్‌ను మాత్రం తక్కువగా అంచనా వేయకూడదు. ఎందుకంటే వారు తమ గతంలో కంటే అద్భుతంగా ఆడుతున్నారు. ప్రస్తుత జట్టు కూడా చాలా బాగుంది. ఏడు-ఎనిమిదేళ్ల క్రితం భారత్-పాక్ జట్ల మధ్య చాలా గ్యాప్ ఉండేది. కానీ దాన్ని వారు నెమ్మదిగా తగ్గించుకుంటూ వస్తున్నారు. పాకిస్తాన్ ప్రస్తుతం నెం1 జట్టుగా ఉంది.
కాబట్టి బౌలింగ్, బ్యాటింగ్ రెండు విభాగాల్లోనూ భారత్ అద్భుతంగా రాణించాలి. పాకిస్తాన్- భారత్ మ్యాచ్‌కు ముందు ఆటగాళ్ల ఫామ్‌ను ఎప్పుడూ లెక్కించకూడదు. ఎవరు ఒత్తిడిని తట్టుకుని రాణిస్తారో వారే విజయం సాధిస్తారు. వరుసగా సెంచరీలు సాధించి పాకిస్తాన్‌పై ఆటగాళ్లు విఫలమైన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎటువంటి పొరపాట్లు చేయకుండా ఆడగల్గితే పాక్‌ను కచ్చితంగా ఓడించవచ్చు అని ఈస్పీఎన్‌తో రవిశాస్త్రి పేర్కొన్నాడు.
భారత్‌దే పై చేయి
కాగా భారత్, పాక్‌లు తలపడిన గత ఐదు వన్డేల్లో టీమిండియాదే 4–1తో పైచేయిగా ఉంది. 2017 చాంపియన్స్‌ట్రోఫీలో లీగ్ దశలో గెలిచి తుదిపోరులో భారత్ ఓడింది. 2018 ఆసియాకప్‌లో రెండుసార్లు టీమిండియా గెలిచింది. చివరిసారిగా గత వన్డే ప్రపంచకప్(2019)లోనూ భారత్‌దే గెలుపు.
చదవండి: నేడే ‘ఆసియా’ అసలు సమరం
Comments
Please login to add a commentAdd a comment